కాంతారా 2.. క్లైమాక్స్ ట్విస్ట్ ఇస్తారా..?
రెండేళ్ల క్రితం కాంతార అంటూ ఒక పెద్ద సెన్సేషన్ సృష్టించాడు రిషబ్ శెట్టి. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.;
రెండేళ్ల క్రితం కాంతార అంటూ ఒక పెద్ద సెన్సేషన్ సృష్టించాడు రిషబ్ శెట్టి. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఐతే కాంతార సినిమా ప్రీక్వెల్ గా కాంతార 2 వస్తుంది. ఈ సినిమాపై కూడా ఎక్స్ పెక్టేషన్స్ ఒక రేంజ్ లో ఉన్నాయి. హోంబలే ప్రొడక్షన్స్ కాంతార 2 కోసం భారీ బడ్జెట్ కేటాయించారు. రిషబ్ శెట్టి ఈ సినిమాకు భారీ కాస్టింగ్ కూడా తీసుకున్నాడు.
దసరా బరిలో కాంతారా 2..
కాంతార ప్రీక్వెల్ గా వస్తున్న కాంతార 2 సినిమా అక్టోబర్ 2 దసరా బరిలో దిగుతుంది. అంతకు ముందు వారం ముందు అంటే సెప్టెంబర్ 25న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ వస్తుంది. వారంలో పవన్ కళ్యాణ్ బాక్సాఫీస్ షేక్ చేస్తే ఆ తర్వాత దసరా టైం లో ధనుష్ ఇడ్లీ కొడై, రిషబ్ శెట్టి కాంతార 2 వస్తాయి. కాంతార 2 లో సినిమా అంతా ఒక ఎత్తు క్లైమాక్స్ మరో ఎత్తు అనిపించేలా ఉంటుందట.
ఎలా అయితే కాంతార 1 లో క్లైమాక్స్ లో రిషబ్ శెట్టి పూనకం వచ్చినవాడిలా చేసి ఆడియన్స్ లో షివరింగ్ తెప్పించాడో కాంతార్ 2 లో అంతకుమించి బీభత్సం సృష్టిస్తాడని తెలుస్తుంది. మామూలుగా పూనకాలు వస్తే అదంతా సినిమాలే అనుకుంటాం కానీ కాంతారా లో మాత్రం రిషబ్ శెట్టి నిజంగానే పూనకం వచ్చిన వాడిలా ఊగిపోయాడు ఆడియన్స్ ని ఊగిపోయేలా చేశాడు. ఇక కాంతార 2 లో కూడా అలాంటిదే కానీ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందని టాక్.
రిషబ్, ఎన్టీఆర్ కలిసింది అందుకేనా..
అంతేకాదు కాంతారా 2 లో పార్ట్ 3కి సంబందించిన బిగ్ ట్విస్ట్ ఒకటి ఉంటుందట. దాని కోసమే రిపీటెడ్ ఆడియన్స్ వచ్చేలా చేస్తున్నారట. కాంతార 3 లో మన ఎన్టీఆర్ ఉంటాడన్న టాక్ ఉంది. రిషబ్, ఎన్టీఆర్ ఆమధ్య కలిసింది అందుకే అని చెప్పుకొస్తున్నారు. నిజంగానే కాంతార 3లో తారక్ ఉండటం నిజమైతే మాత్రం రిషబ్ శెట్టికి వచ్చినట్టుగానే కాంతారా 3లో ఎన్ టీ ఆర్ కి నేషనల్ అవార్డ్ వచ్చి తీరుతుంది.
రిషబ్ ఎన్టీఆర్ తో ఏం ప్లాన్ చేస్తున్నాడు అన్నది ప్రస్తుతానికి సస్పెన్సే. ఐతే ఎన్టీఆర్ కాంతారా ఫ్రాంచైజీలో భాగం అయితే మాత్రం ఫ్యాన్స్ కి పక్కా ఫీస్ట్ ఇచ్చే రోల్ చేస్తాడని చెప్పొచ్చు. కాంతార ప్రీక్వెల్ గా వస్తున్న కాంతారా 2 లో కూడా ఎన్ టీ ఆర్ క్యామియో ఏదైనా ఉంటుందా అన్న డిస్కషన్ కూడా జరుగుతుంది. మరి రిష ప్లానింగ్ ఎలా ఉందో చూడాలి. ఎన్ టీ ఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ తో సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా తర్వాత త్రివిక్రం తో సినిమా ఉంది. ఆ సినిమా కూడా మైథాలజీ కథతో భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నారు.