అంత ధైర్యం రానా ఎందుకు చేయలేకపోతున్నాడు?
కన్నడ స్టార్ రిషబ్ శెట్టి తనని తానే పాన్ ఇండియా స్టార్ గా ఆవిష్కరించుకున్న తీరు గురించి చెప్పాల్సిన పనిలేదు.;
కన్నడ స్టార్ రిషబ్ శెట్టి తనని తానే పాన్ ఇండియా స్టార్ గా ఆవిష్కరించుకున్న తీరు గురించి చెప్పాల్సిన పనిలేదు. `కాంతార` ప్రాంచైజీతో ఇండియానే షేక్ చేసిన నటుడు. తన కథలో తానే నటించి గొప్ప నటుడిగా నీరాజనాలు అందుకున్నాడు. `కాంతార` రిలీజ్ వరకూ రిషబ్ శెట్టి కేవలం కన్నడ వరకే పరిమితం. `కాంతార` రిలీజ్ అనంతరం తెలుగులో పెద్ద స్టార్ అయ్యాడు. అక్కడ నుంచి బాలీవుడ్ కి వెళ్లాడు. ప్రస్తుతం తెలుగు సహా హిందీలో కూడా సినిమాలు చేస్తున్నాడు. తాను పెట్టుబడిగా పెట్టింది కేవలం తన లో క్రియేటివిటీ, నటన మాత్రమే.
ట్యాలెంట్ ఉన్నా వెనుకబడిన నటుడు:
తన విజన్ కి మరో ఇద్దరు నిర్మాతలు తోడవ్వడంతో తాను అనుకున్నది సాధించగలిగాడు. అందు కోసం ఎంతో కష్టపడ్డాడు? అన్నది వాస్తవం. అడవి శేష్, విశ్వక్ సేన్ లాంటి నటులు రీజనల్ మార్కెట్ లో అలాగే సక్సెస్ అయ్యారు. పాన్ ఇండియలో యువ సంచలనం తేజ సక్సస్ తీరు తెలిసిందే. కథాబలం ఉన్న సినిమాలతోనే తనని తాను పాన్ ఇండియా స్టార్ గా మలుచుకున్నాడు. అయితే ఇలాంటి సక్సెస్ ని రానా ఎప్పుడో చూడాలి. కానీ తనలో ధైర్యమే సరిపోలేదు? అన్నది ఫిలిం సర్కిల్స్ లో చర్చకొస్తుంది.
నటన మానేసి నిర్మాతగా:
రానా ఇండస్ట్రీకి వచ్చిన విధానం చూసి భవిష్యత్ లో తిరుగులేని స్టార్ అవుతాడని అంతా భావించారు. అతడి కథల ఎంపిక చూసి కూడా గొప్ప భవిష్యత్ ఉంటుందని అంచనా వేసారు. రొటీన్ కి భిన్నమైన కథలు, పాత్రలు ఎంచుకోవడంతోనే రానాకి ఆ గుర్తింపు దక్కింది. కానీ నటుడిగా మాత్రం పాన్ ఇండియా కాదు గదా? రీజనల్ మార్కెట్ లో కూడా తాను అనుకున్నది రీచ్ అవ్వలేకపోయాడనే చర్చ జరుగు తోంది. రానా కొంత కాలంగా నటుడిగా సినిమాలు చేయని సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నిర్మాతగా ప్రారంభమై సినిమాలు నిర్మిస్తున్నాడు.
ఇలా ఎంత కాలం రానాజీ:
సెలబ్రిటీలను ఇంటర్వ్యూలు చేస్తున్నాడు. కానీ తాను హీరోగా మాత్రం ఎస్టాబ్లిష్ అయ్యే ఏ చిన్న ప్రయత్నం కూడా చేయడం లేదు. చేతిలో చాలా అవకాశాలున్నా? వాటిని సద్వినియోగం చేసుకోవడం లేదనే విమర్శ వినిపిస్తోంది. పరిశ్రమలో కావాల్సినన్ని పరిచయాలున్నాయి. యూనిక్ కాన్సెప్ట్ లను ఎంచుకునే మేధస్సు ఉంది. అవసరం అనుకుంటే తనమీద తానే 100 కోట్లు పెట్టుబడి పెట్టుకోగల సామర్ధ్యం ఉన్న వాడు. కానీ రానా మాత్రం ఆ ప్రయత్నాలేవి చేయడం లేదు. వచ్చిన సినిమాల్లో కామియో పాత్రలు పోషించడం తప్ప రానా నుంచి ఎలాంటి పాన్ ఇండియా ప్రయత్నం కనిపించడం లేదు. మరి ఇలా ఎంత కాలం బండి నడిపిస్తాడో చూడాలి.