పెద్ది బజ్ లో రిషబ్ శెట్టి ఎలివేషన్స్
‘కాంతార’ సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో సెన్సేషన్ క్రియేట్ చేసిన నటుడు, దర్శకుడు రిషబ్ శెట్టి లేటెస్ట్ గా ‘పెద్ది’ ట్రైలర్ పై తన రివ్యూ ఇచ్చారు.
‘కాంతార’ సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో సెన్సేషన్ క్రియేట్ చేసిన నటుడు, దర్శకుడు రిషబ్ శెట్టి లేటెస్ట్ గా ‘పెద్ది’ ట్రైలర్ పై తన రివ్యూ ఇచ్చారు. సోషల్ మీడియా వేదికగా ఆయన స్పందిస్తూ ఈ సినిమా విజువల్స్ చాలా అద్భుతంగా ఉన్నాయని ప్రశంసించారు. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్న ఈ రూరల్ స్పోర్ట్స్ డ్రామాకు నార్త్, సౌత్ అనే తేడా లేకుండా ఇండస్ట్రీ ప్రముఖుల నుంచి సపోర్ట్ లభిస్తోంది. అందులో భాగంగానే రిషబ్ శెట్టి ప్రత్యేకంగా పోస్ట్ పెట్టడం ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.
ట్రైలర్ లో రామ్ చరణ్ స్క్రీన్ ప్రెజెన్స్ చాలా స్టన్నింగ్ గా ఉందని రిషబ్ శెట్టి పేర్కొన్నారు. ప్రతి ఫ్రేమ్ లోనూ చరణ్ ఇంటెన్సిటీ ఒక ఫైర్ లా ఉందంటూ ప్రశంసించారు. అలాగే కన్నడ స్టార్ నటుడు శివరాజ్ కుమార్ ఈ సినిమాలో ఒక కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. శివరాజ్ కుమార్ క్యారెక్టర్ ఈ కథకు ఒక విభిన్నమైన పవర్‌ను, బలాన్ని తీసుకువచ్చిందని రిషబ్ చెప్పారు. హీరోయిన్ జాన్వీ కపూర్ తన గ్లామర్, చలాకీతనంతో ఒక వైబ్రంట్ స్పార్క్ ని యాడ్ చేసిందని తన పోస్ట్ లో రాసుకొచ్చారు.
దర్శకుడు బుచ్చిబాబు సన వర్క్ ని కూడా రిషబ్ శెట్టి ప్రత్యేకంగా అప్రిషియేట్ చేశారు. ఈ విలేజ్ డ్రామాను ఆయన హ్యాండిల్ చేసిన తీరు చాలా బాగుందని ఎక్సలెంట్ వర్క్ అంటూ కొనియాడారు. సినిమాటోగ్రాఫర్ రత్నవేలు విజువల్స్ తో పాటు నిర్మాత వెంకట సతీష్ కిలారు, వృద్ధి సినిమాస్, మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ నిర్మాణ విలువలు చాలా రిచ్ గా ఉన్నాయని చెప్పారు.
సినిమా టీమ్ మొత్తానికి ఆయన తన బెస్ట్ విషెస్ తెలియజేశారు. ఒక మట్టి కథతో పక్కా లోకల్ ఎమోషన్ ని నమ్ముకుని వస్తున్న సినిమా కావడంతో, రిషబ్ శెట్టి లాంటి క్రియేటివ్ పర్సన్ కి ఈ కంటెంట్ బాగా కనెక్ట్ అయినట్లు తెలుస్తోంది. ముంబైలో రీసెంట్ గా జరిగిన ఈవెంట్ లో ట్రైలర్ ను లాంచ్ చేసినప్పటి నుంచి బాలీవుడ్ మీడియాలో కూడా దీనిపై మంచి చర్చ జరుగుతోంది. చరణ్ ఈ క్యారెక్టర్ కోసం రెజ్లర్ గా, క్రికెటర్ గా డిఫరెంట్ లుక్స్ లో కనిపించడం ట్రైలర్ లోనే హైలైట్ గా నిలిచింది.
ఏఆర్ రెహమాన్ ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ యాక్షన్ సీన్స్ ని బాగా ఎలివేట్ చేసింది. కేవలం నార్త్ బెల్ట్ లోనే కాకుండా కన్నడ ఇండస్ట్రీలో కూడా శివరాజ్ కుమార్ క్రేజ్ వల్ల ఈ సినిమాకు మంచి ఓపెనింగ్స్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇప్పుడు రిషబ్ శెట్టి ట్వీట్ తో కర్ణాటక ట్రేడ్ వర్గాల్లో కూడా సినిమాపై మరింత పాజిటివ్ బజ్ క్రియేట్ అయింది. ఏదేమైనా ‘పెద్ది’ అఫీషియల్ ప్రమోషన్స్ చాలా ప్లాన్డ్ గా సాగుతున్నాయి. వేరే లాంగ్వేజ్ స్టార్స్ కూడా ఈ కథలోని ఇంటెన్సిటీని మెచ్చుకోవడం సినిమాకు పెద్ద అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వస్తున్న ఈ సినిమా జూన్ 4న బాక్సాఫీస్ రేసులోకి దిగబోతోంది. ట్రైలర్ కు వచ్చిన ఈ సాలిడ్ రెస్పాన్స్ చూశాక థియేటర్లలో చరణ్ మార్క్ మాస్ ఎంటర్టైన్మెంట్ ఏ రేంజ్ లో ఉండబోతోందో చూడాలి.