కాంతారా.. పుష్ప.. రెండు వేరు వేరయా..!
దసరా కానుకగా వచ్చిన కాంతారా సినిమా చూసిన ఆడియన్స్ రిషబ్ శెట్టి యాక్టింగ్ ని అదుర్స్ అనేస్తున్నారు.;
దసరా కానుకగా వచ్చిన కాంతారా సినిమా చూసిన ఆడియన్స్ రిషబ్ శెట్టి యాక్టింగ్ ని అదుర్స్ అనేస్తున్నారు. కాంతారా లో క్లైమాక్స్ లో ఎలా ఐతే పూనకాలతో ఊగిపోయేలా చేశాడో కాంతారా చాప్టర్ 1 లో కూడా అంతకు మించి అనిపించేలా చేశాడు. కాంతారా చాప్టర్ 1లో రిషబ్ శెట్టి నట విశ్వరూపం సినీ లవర్స్ అందరికీ మైండ్ బ్లాక్ అయ్యేలా చేసింది. ఐతే రిషబ్ శెట్టి కాంతారా.. పుష్ప 2 సినిమాలో అల్లు అర్జున్ ను పోలుస్తూ సోషల్ మీడియాలో డిస్కషన్స్ మొదలు పెట్టారు.
పుష్ప 2 లో అల్లు అర్జున్..
పుష్ప 2 లో అల్లు అర్జున్ గంగమ్మ తల్లి జాతర ఎపిసోడ్ లో అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో అలరించాడు. అమ్మ వారి వేషం లో అల్లు అర్జున్ డ్యాన్స్ ఎమోషన్ అంతా అదిరిపోయింది. ఐతే ఆ కాన్సెప్ట్ ఆ ఎఫెక్ట్స్ వేరు.. అందులో అల్లు అర్జున్ తన బెస్ట్ ఇచ్చాడు. పుష్ప 1 తోనే అల్లు అర్జున్ క్యారెక్టరైజేషన్, అతను దాన్ని అభినయించిన తీరు నేషనల్ బెస్ట్ యాక్టర్ వరించింది. పుష్ప 2 లో ఇంకాస్త రెచ్చిపోయాడు అల్లు అర్జున్.
ఇక ఇప్పుడు కాంతారా చాప్టర్ 1లో రిషబ్ శెట్టి కూడా గూస్ బంప్స్ తెప్పించేశాడు. అలా తెర మీద రిషబ్ శెట్టి పెర్ఫార్మెన్స్ చూసి ఆడియన్స్ అంతా సంబ్రమాశ్చర్యాలకు గురయ్యేలా చేశాడు. వర్క్ మీద అతనికి ఉన్న డెడికేషన్, కమిట్మెంట్ గురించి స్పెషల్ గా మాట్లాడుకుంటున్నారు. రిషబ్ శెట్టి కాంతారా రోల్ నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది.
పుష్ప రాజ్, కాంతారా పాత్రల మధ్య పోటీ..
ఐతే పాత్రలో తమ బెస్ట్ ఇవ్వడమే యాక్టర్స్ పని.. అందులో ఎవరు గొప్ప ఎవరు కాదు అన్నది కాదు. అతనికి వచ్చిన పాత్రను అతను చేస్తున్నాడు. సో పుష్ప రాజ్, కాంతారా పాత్రల మధ్య పోటీ అన్నది అసలు చూడకూడదు. రిషబ్ తన రోల్ లో టాప్ క్లాస్ పర్ఫార్మెన్స్ ఇస్తే.. పుష్ప రాజ్ గా అల్లు అర్జున్ నెక్స్ట్ లెవెల్ అనిపించాడు. ఈ రెండు సినిమాల్లో కథ కథనాలతో పాటు వారి నటన హైలెట్ గా నిలిచింది. కాంతారా చాప్టర్ 1 కేవలం యాక్టర్ గానే కాదు డైరెక్టర్ గా కూడా రిషబ్ శెట్టి మైండ్ బ్లాక్ అయ్యేలా చేశాడు.
పుష్ప 1తో అల్లు అర్జున్ నేషనల్ అవార్డ్ అందుకోగా.. కాంతారా తో రిషబ్ శెట్టి బెస్ట్ యాక్టర్ గా జాతీయ అవార్డ్ అందుకున్నాడు. పుష్ప 2లో కూడా అల్లు అర్జున్ అవార్డ్ విన్నింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. నెక్స్ట్ ఈసారి కూడా అవార్డ్ వస్తుందని ఆశిస్తున్నారు. ఇక కాంతారా చాప్టర్ 1 లో రిషబ్ శెట్టికి నేషనల్ అవార్డ్ కాదు ఏకంగా ఆస్కార్ లెవెల్ పర్ఫార్మెన్స్ అని ఆడియన్స్ చెప్పుకుంటున్నారు.