కాంతారా దేవుళ్లు ఎలా అవతరించారు..?
ఇంతకీ ఈ పంజుర్లి, గుళిక దేవుళ్లు ఎలా అవతరించారు. వారి వెనక అసలు కథ ఏంటన్నది తెలుసుకోవాలని అందరికీ ఉంటుంది.;
రిషబ్ శెట్టి కాంతారా 2022 లో వచ్చి సెన్సేషనల్ హిట్ అందుకుంది. కాంతారా బ్లాక్ బస్టర్ అవ్వడంతో ఆ సినిమాకు ప్రీక్వెల్ గా కాంతారా చాప్టర్ 1 ని తెరకెక్కించాడు రిషబ్ శెట్టి. కాంతారాలో భూత కోల సంప్రదాయాన్ని చూపించారు. కాంతారా చాప్టర్ 1లో పంజుర్లి, గుళిగ దేవుళ్లను పరిచయం చేశారు. ఇంతకీ ఈ పంజుర్లి, గుళిక దేవుళ్లు ఎలా అవతరించారు. వారి వెనక అసలు కథ ఏంటన్నది తెలుసుకోవాలని అందరికీ ఉంటుంది.
పంజుర్లి, గుళిగ దేవుళ్లు కర్ణాటకలో తుళినాడు ప్రాంతానికి చెందిన స్థానిక దేవతలు. కాంతారా సినిమాతోనే వీటి గురించి నేషనల్ వైడ్ గా తెలిసేలా చేశాడు రిషబ్ శెట్టి. అసలు ఎవరు ఈ పంజుర్లి, గుళిగ.. వారి ఆవిర్భావం ఎలా జరిగింది అని చూస్తే.. పుంజుర్లి వరాహ రూపంలో ఉండే ఒక సంరక్షక ఆత్మ అని తెలుస్తుంది. గుళిగ భూమి ప్రకృతిని రక్షించే దేవుడు అని తెలుస్తుంది. ఈ దేవుళ్లు భూతకోలతో పూజలందుకుంటారు.
కర్ణాటక తురునాడి సంప్రదాయం దాదాపు 5000 సంవత్సరాల కిందనే ఈ దేవతలు ఉన్నట్టు తెలుస్తుంది. అప్పటివారు భూత పూజ అని పిలిచేవారు. ఐతే భూతం అనగానే అందరికీ దెయ్యాలు, చెడు ఆత్మలు అనుకుంటారు. కానీ పంజుర్లి, గుళిగలకు వాటితో ఎలాంటి సంబంధం ఉండదు. సినిమాలో చెప్పినట్టుగానే పంజుర్లి, గుళిగ ఇద్దరు సంరక్షణ ఆత్మలే.. ప్రకృతిని గౌరవించే, ధర్మం న్యాయాన్ని పాటించే వారిని వీరు రక్షిస్తారు. ప్రకృతిని నాశనం చేయాలని చూస్తే అలాంటి వారిని శిక్షిస్తారు.
పంజుర్లి ఆవిర్భావం..
కాంతారా సినిమాలో చూపించిన పంజుర్లి కథ నిజంగానే అద్భుతం అనిపించింది. పురాణాల ప్రకారంగానే సినిమాలో అలా చూపించారు. కైలాస పర్వతంలో అడవి పంది చనిపోయిన తర్వాత దాని పిల్ల అనాథ అవుతుంది. అప్పుడు పార్వతి దేవి కరుణతో ఆ బిడ్డను దత్తత తీసుకుంటుంది. ఐతే విషయం తెలిసిన శివుడు కోపంతో రగిలిపోతాడు. కైలాస పర్వతం నుంచి వరాహాన్ని బహిస్కరిస్తాడు. అప్పటికే పార్వతి దేవి ప్రేమతో ఆ వరాహం పంజుర్లిగా మారుతుంది. అడవులు, ప్రకృతి ప్రపంచానికి రక్షకుడిగా పంజుర్లి ఉంటుంది.
గుళిగ ఆవిర్భావం కూడా అలానే..
పార్వతి దేవి ప్రేమ నుంచి పంజుర్లి వస్తే.. ఆమె కోపం నుంచి గుళిగ ఏర్పడుతుంది. విశ్వ వినాశన టైంలో శివుడు విసిరిన రాయి నుంచి గుళిగ ఉద్భవించిందని చెబుతుంటారు. గుళిగ న్యాయానికి అవతారం గా చూస్తారు. దైవానికి ప్రతీకారంగా కూడా గుళిగ ఉంటుంది. విష్ణు వరం వల్ల ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ గుళిగ ప్రత్యక్షమవుతుంది.
అలా పంజర్లి గుళిగ గురించి భూత కోల సంప్రదాయం గురించి కాంతారా తో పాటు కాంతారా చాప్టర్ 1లో రిషబ్ శెట్టి చూపించారు. సినిమాలో రిషబ్ శెట్టి నట విశ్వరూపం చూసి థియేటర్ లో ఆడియన్స్ కి పూనకాలు వచ్చాయి. రిషబ్ శెట్టి నిజంగానే ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డాడు. ఇప్పుడు ఆ కష్టానికి తగిన ప్రతిఫలం వచ్చిందని చెప్పొచ్చు.