జై హనుమాన్ ని పక్కన పెట్టిన రిషబ్ శెట్టి..?

రిషబ్ శెట్టి ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్ లో బిజీగా ఉన్న స్టార్. కాంతారా రెండు సినిమాలతో ఆయన చేసిన హంగామా తెలిసిందే.;

Update: 2026-01-07 03:49 GMT

రిషబ్ శెట్టి ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్ లో బిజీగా ఉన్న స్టార్. కాంతారా రెండు సినిమాలతో ఆయన చేసిన హంగామా తెలిసిందే. యాక్టింగ్, డైరెక్షన్ రెండు చేస్తూ ఈ రేంజ్ ఇంపాక్ట్ చూపించడం అనేది ఒక గొప్ప విషయం. అందులో తన సత్తా చాటాడు రిషబ్ శెట్టి. కాంతారా తో నేషనల్ వైడ్ గా క్రేజ్ తెచ్చుకున్న రిషబ్ శెట్టితో తెలుగు మేకర్స్ భారీ సినిమాలు చేస్తున్నారు. ఆల్రెడీ హనుమాన్ సీక్వెల్ గా జై హనుమాన్ సినిమా చేస్తున్నాడు. ఆ సినిమాతో పాటు సితార బ్యానర్ లో ఒక సినిమా సైన్ చేశారు.

కాంతారా చాప్టర్ 1 తర్వాత రిషబ్ శెట్టి జై హనుమాన్..

ఐతే మరోపక్క ఛత్రపతి శివాజీ కథతో రిషబ్ శెట్టి ఒక భారీ సినిమా ప్లానింగ్ లో ఉంది. అందులో వివేక్ ఒబెరాయ్ కూడా నటిస్తున్నారు. కాంతారా చాప్టర్ 1 తర్వాత అసలైతే రిషబ్ శెట్టి జై హనుమాన్ చేయాలి. కానీ ప్రశాంత్ వర్మ ఇంకా లేట్ చేసేలా ఉన్నాడని శివజీ సినిమాను ముందు చేసే ప్లానింగ్ లో ఉన్నారట రిషబ్ శెట్టి. అలా ఐతే జై హనుమాన్ మరింత వెనక్కి వెళ్లే ఛాన్స్ ఉంటుంది.

హనుమాన్ సినిమా చివర్లో జై హనుమాన్ అనౌన్స్ చేసి 2025 రిలీజ్ అని చెప్పారు మేకర్స్. కానీ హనుమాన్ సినిమా నిర్మాతలతోనే ప్రశాంత్ వర్మ ఆర్థిక లావాదేవీల విషయంలో గొడవలు జరగడం.. ఇంకా సీక్వెల్ ప్రాజెక్ట్ చేతులు మారడం లాంటివి జై హనుమాన్ ని మరింత లేట్ చేస్తున్నాయి. టాలెంట్ ఉన్నా కూడా ప్రశాంత్ వర్మ వరుస సినిమాల కమిట్మెంట్ వల్ల అతన్ని ఇబ్బందుల్లో పడేశాయి.

తెలుగులో రెండు భారీ ప్రాజెక్ట్స్..

జై హనుమాన్ అసలైతే జనవరి కల్లా సెట్స్ మీదకు వెళ్తుందని చెప్పుకొచ్చారు. కానీ ఇంకా దానికి సంబంధించిన అప్డేట్ ఐతే ఏది రాలేదు. ఒకవేళ సినిమా మరింత లేట్ అయ్యేలా ఉందంటే రిషబ్ తన డేట్స్ అన్నీ శివాజీ కథకు ఇచ్చేలా ఉన్నాడు. అదే జరిగితే జై హనుమాన్ మరింత లేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మొత్తానికి జై హనుమాన్ విషయంలో ఫ్యాన్స్ అంత ఆసక్తిగా ఉన్నారో అంత వెనక్కి వెళ్తుంది.

రిషబ్ శెట్టి మాత్రం తెలుగులో రెండు భారీ ప్రాజెక్ట్ లతో పాటు మరో రెండు సినిమాలను ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలతో నేషనల్ లెవెల్ లో రిషబ్ శెట్టి స్టామినా ప్రూవ్ చేయనున్నారు. ప్రశాంత్ వర్మ తన సినిమాల విషయంలో ఒక క్లారిటీ రాలేకపోతే కెరీర్ మీద ఎఫెక్ట్ పడేలా ఉంది. జై హనుమాన్ ని ఎంత త్వరగా మొదలు పెడితే అంత బాగుంటుంది. ఒకవేళ ఆ ప్రాజెక్ట్ ఇంకా లేట్ అయితే మాత్రం ప్రశాంత్ వర్మ రిస్క్ లో పడినట్టే అవుతుంది. జై హనుమాన్ తో పాటు ప్రశాంత్ వర్మ తన సినిమాటిక్ యూనివర్స్ లో మరికొన్ని సినిమాలు ప్లాన్ చేస్తున్నాడు. ఆల్రెడీ మహాకాళి సినిమాకు ప్రశాంత్ వర్మ కథ అందిస్తున్నాడన్న విషయం తెలిసిందే. ఐతే మిగతా సినిమాల విషయంలోనే ఒక క్లారిటీ రావాల్సి ఉంది.

Tags:    

Similar News