'కాంతార' స్టార్‌తో టాలీవుడ్ వర్సెస్ బాలీవుడ్
'కాంతార చాప్టర్ 1' సినిమాతో, 2025లో ఇండియాలోనే బిగ్గెస్ట్ గ్రాసర్‌ను కొట్టిన రిషబ్ శెట్టి, ఇప్పుడు నేషనల్ స్టార్ అయ్యాడు.;
'కాంతార చాప్టర్ 1' సినిమాతో, 2025లో ఇండియాలోనే బిగ్గెస్ట్ గ్రాసర్‌ను కొట్టిన రిషబ్ శెట్టి, ఇప్పుడు నేషనల్ స్టార్ అయ్యాడు. 'KGF' యష్ తర్వాత, కన్నడ ఇండస్ట్రీ నుంచి మరో పాన్ ఇండియా స్టార్ దొరికేశాడు. ఇప్పుడు రిషబ్ నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది హాట్ టాపిక్ గా మారింది. అతనితో సినిమా చేసేందుకు అన్ని ఇండస్ట్రీలు పోటీ పడుతున్నాయి. ఈ పోటీలో ఇప్పుడు టాలీవుడ్, బాలీవుడ్ నువ్వా నేనా అన్నట్లు తలపడుతున్నాయి.
'కాంతార 1' ప్రమోషన్ల టైమ్‌లోనే రిషబ్ శెట్టి ఒక క్లారిటీ ఇచ్చాడు. తన తదుపరి సినిమా, టాలీవుడ్ సెన్సేషన్ ప్రశాంత్ వర్మ డైరెక్షన్‌లో 'జై హనుమాన్' ఉంటుందని స్వయంగా ప్రకటించాడు. దీంతో, సౌత్ డైరెక్టర్లు ఇద్దరు (ప్రశాంత్ వర్మ, రిషబ్) కలిసి మరో మైథలాజికల్ వండర్ క్రియేట్ చేస్తారని ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారు. అయితే, ఈ రేసులో బాలీవుడ్ సైలెంట్‌గా లేదు.
వాళ్లు రిషబ్ కోసం మరో భారీ ప్రాజెక్టును సిద్ధం చేశారు. అదే, ఛత్రపతి శివాజీ మహారాజ్ బయోపిక్ 'ది ప్రైడ్ ఆఫ్ భారత్'. కాంతార లాంటి రూటెడ్ సినిమా తీసిన హీరోతో, శివాజీ లాంటి ఐకానిక్ క్యారెక్టర్ చేయిస్తే, నార్త్ బెల్ట్‌లో సినిమా రేంజ్ వేరేలా ఉంటుందని వాళ్ల ప్లాన్. ఇక్కడే అసలు కన్ఫ్యూజన్ మొదలైంది. రిషబ్ మాట ప్రకారం 'జై హనుమాన్' ముందు మొదలవ్వాలి. కానీ, బాలీవుడ్ మీడియాలో మాత్రం 'ది ప్రైడ్ ఆఫ్ భారత్' షూటింగ్ రోలింగ్‌కు రెడీ అయిపోయిందని గట్టిగా టాక్ నడుస్తోంది.
అంతేకాదు, అందులో ఔరంగజేబు పాత్ర కోసం వివేక్ ఒబెరాయ్‌ను కూడా ఫైనల్ చేశారని వార్తలు వస్తున్నాయి. ఇది ప్రశాంత్ వర్మ టీమ్‌ను, రిషబ్ ఫ్యాన్స్‌ను డైలమాలో పడేసింది.
ఇప్పుడు రిషబ్ ముందున్నది కేవలం మైథాలజీనా, బయోపికా? అనే ఛాయిస్ కాదు. ఇది టాలీవుడ్ వర్సెస్ బాలీవుడ్ ఛాయిస్‌గా మారింది. తాను పబ్లిక్‌గా మాట ఇచ్చిన టాలీవుడ్ (ప్రశాంత్ వర్మ) ప్రాజెక్టును మొదలుపెడతాడా లేక, తన పాన్ ఇండియా ఇమేజ్‌ను నార్త్‌లో మరింత స్ట్రాంగ్ చేసుకోవడానికి బాలీవుడ్ (శివాజీ బయోపిక్) వైపు అడుగులేస్తాడా? అనేది ఆసక్తికరంగా మారింది.
ఈ రెండు పాత్రలకు దేశవ్యాప్తంగా విపరీతమైన ఎమోషనల్ కనెక్షన్ ఉంది. రెండింటికీ రిషబ్ నుంచి భారీ డెడికేషన్, ట్రాన్స్‌ఫర్మేషన్ అవసరం. వీటిని ఒకేసారి షూట్ చేయడం అసాధ్యం. మరి, ఈ టగ్ ఆఫ్ వర్‌లో రిషబ్ ఏ ఇండస్ట్రీకి ముందు ఓటు వేస్తాడో తెలియాలంటే మరికొంత కాలం ఆగాల్సిందే.