జై హనుమాన్.. అప్పటికల్లా రిషబ్ అలా చేస్తారట!

టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ, కన్నడ నటుడు రిషబ్ శెట్టి కాంబినేషన్ లో జై హనుమాన్ మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే.;

Update: 2025-10-01 06:16 GMT

టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ, కన్నడ నటుడు రిషబ్ శెట్టి కాంబినేషన్ లో జై హనుమాన్ మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. బ్లాక్ బస్టర్ హిట్ హనుమాన్ కు సీక్వెల్ గా తెరకెక్కుతున్న ఆ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

అయితే సినిమాలో హనుమంతుడిగా రిషబ్ శెట్టి కనిపించనున్నారు. ఇప్పటికే ఆయనకు సంబంధించిన లుక్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఆ పోస్టర్ లో రిషబ్ శెట్టి హనుమంతుడిగా పవర్ ఫుల్ పోజులో, శ్రీరాముని విగ్రహం చేతిలో భక్తిపూర్వకంగా పట్టుకుని పాదాల మీద కూర్చుని కనిపించారు. దీంతో పోస్టర్ అందరినీ విపరీతంగా ఆకట్టుకుంది.

అదే సమయంలో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే మూవీపై ఇటీవల రిషబ్ శెట్టి అప్డేట్ ఇచ్చిన విషయం తెలిసిందే. తన అప్ కమింగ్ మూవీ కాంతార : చాప్టర్ 1 విడుదలకు ముందే మరో సినిమాకు సైన్ చేయాలని అనుకోలేదన్నారు. కానీ ప్రశాంత్ వర్మ చెప్పిన కథ నచ్చి వెంటనే ఓకే చెప్పేశానని తెలిపారు.

కథ చాలా ఇంట్రెస్టింగ్‌ గా ఉందని అంచనాలు పెంచిన రిషబ్.. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని తెలిపారు. మరికొద్ది రోజుల్లో షూటింగ్ డేట్స్ ఫిక్స్ చేస్తామని అన్నారు. అయితే తాజాగా మరోసారి జై హనుమాన్ సినిమా పేరును కాంతార ప్రీక్వెల్ విజయవాడ ఈవెంట్ లో ప్రస్తావించారు. కానీ మూవీకి సంబంధించి అప్డేట్ ఇవ్వలేదు.

తాను ఆ సినిమా కల్లా ఏం చేయనున్నానో చెప్పారు. మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడక్షన్ లో జై హనుమాన్ సినిమాకు గాను వర్క్ చేస్తున్నట్లు తెలిపారు. అప్పటికల్లా తెలుగును బాగా నేర్చుకుంటానని తెలిపారు. అప్పుడు స్పష్టంగా మాట్లాడతానని అన్నారు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ గా మారింది.

రీసెంట్ గా హైదరాబాద్ లో జరిగిన కాంతార ఈవెంట్ లో రిషబ్ కేవలం కన్నడలోనే మాట్లాడారు. తెలుగు నార్మల్ గా వచ్చినా.. కూడా మాట్లాడకపోవటంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. సినిమాను బాయ్ కాట్ చేయాలంటూ హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ చేశారు. అందుకే విజయవాడ ఈవెంట్ లో తెలుగులో మొత్తం మాట్లాడారు. జై హనుమాన్ కల్లా మొత్తం క్లియర్ గా నేర్చుకుని మాట్లాడతానని చెప్పారు.

Tags:    

Similar News