వార్ 2 ఎలివేషన్స్.. ఆర్జీవి కామెంట్స్ వైరల్..!
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రీసెంట్ ఇంటర్వ్యూలో శివ సినిమా 4కె రీ రిలీజ్ పై మాట్లాడారు.;
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రీసెంట్ ఇంటర్వ్యూలో శివ సినిమా 4కె రీ రిలీజ్ పై మాట్లాడారు. ఆ సినిమా టైం లో తన ఆలోచనలు ఆ తర్వాత ఆలోచన గురించి చెప్పుకొచ్చారు. ఐతే ఆర్జీవి మాటల ప్రస్తావనలో రీసెంట్ గా రిలీజైన వార్ 2 సినిమా గురించి చెప్పారు. సినిమాలో అవసరానికి మించి ఎలివేషన్స్, ప్రొడక్షన్ వ్యాల్యూస్ చూపించుకోవాలని భారీ ఖర్చు చేశారని అన్నారు.
స్టోరీ మర్చిపోయి ఎలివేషన్స్..
హృతిక్ రోషన్ ఎంట్రీ ఫైట్ గురించి మాట్లాడిన ఆర్జీవి అదలా ఎందుకని ఆ కీ పర్సన్ ని అడిగితే అది కొత్తగా ఉంటుందని అని చెప్పాడట. దాంతో తనకు నోట మాట రాలేదని అన్నారు ఆర్జీవి. అంతేకాదు టాప్ యాంగిల్ షాట్స్, డ్రాన్స్ షాట్స్ ట్రైలర్ లో బాగా అనిపించగా థియేటర్ కి వెళ్లి చూస్తే వాటికి ఆడియన్స్ ఎమోషనల్ గా కనెక్ట్ అవ్వలేకపోయారని అన్నారు ఆర్జీవి. అలాంటి భారీ సీన్స్ వల్ల ఆడియన్స్ సినిమాకు కనెక్ట్ అవ్వలేదు.
రాజమౌళి సినిమాలో కూడా భారీ సీన్స్ ఉంటాయి. కానీ అవి ఆడియన్స్ కు కనెక్ట్ అవుతాయి. మిగతా వాళ్లంతా స్టోరీ మర్చిపోయి ఎలివేషన్స్, మాసివ్ క్రియేషన్ అని అంటుంటారు. అందుకే ఆడియన్స్ వాళ్ల మీద నమ్మకాన్ని కోల్పోతున్నారని అన్నారు ఆర్జీవి. ఇల్ లాజికల్ సీన్స్ సినిమాను చంపేస్తాయి. ఒక సీన్ కి అవసరం లేని భారీతనం సినిమా కథను పాడు చేస్తుందని అన్నారు.
ఆర్జీవి మాస్టర్ క్రాఫ్ట్స్ మెన్ ..
నేను కూడా పరుచూరి గోపాలకృష్ణలా సినిమా రివ్యూస్ చెబితే చాలామంది హర్ట్ అవుతారు. అందుకే నేను అలాంటి పనులు చేయనని అన్నారు ఆర్జీవి. శివ సినిమా నుంచి ఆర్జీవి మాస్టర్ క్రాఫ్ట్స్ మెన్ అనే టాక్ ఉంది. సినిమాను ఎలా తీయాలో ఆయనకు తెలిసినంతగా ఎవరికీ తెలియదు అనేంత నాలెడ్జ్ ఉంది. ఐతే శివ తీసినప్పుడు ఉన్న ఆర్జీవి వేరు.. ఇప్పుడు ఆర్జీవి వేరు. ఆయన సినిమాల మీద ఫోకస్ తగ్గించేశారు. ఐతే ఆయన తిరిగి మళ్లీ శివ లాంటి సినిమాలు తీస్తే మాత్రం కచ్చితంగా మిగతా అందరు డైరెక్టర్స్ సైడ్ అవ్వాల్సిందే.
రాం గోపాల్ వర్మ ఎప్పుడో 30 ఏళ్ల క్రితం తీసిన శివ గురించి చెబుతున్నారేంటి అంటే అప్పట్లో ఆ సినిమా ఎన్ని సంచలనాలు సృష్టించిందో తెలిసిన వారికి ఆ సినిమా తీసిన ఆర్జీవి గొప్పతనం తెలుస్తుంది. ఆర్జీవి మళ్లీ అలాంటి సినిమా తీయాలని ఆయన ఫ్యాన్స్ కోరుతున్నారు. ఇక వార్ 2పై ఆర్జీవి రివ్యూ కచ్చితంగా ఫ్యాన్స్ కి మాత్రం రుచించదని చెప్పొచ్చు.