మహానటి సిస్టర్ టాలెంట్ అదరహో!
ఈ వీడియో చూసిన కీర్తి సురేష్ అభిమానులు, నెటిజన్‌లు మహానటి సిస్టర్ టాలెంట్ అదరహో అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.;
వెండితెరపై మెస్మరైజ్ చేస్తూ ప్రేక్షకుల్ని అలరిస్తుంటారు స్టార్స్. తమదైన మార్కు సినిమాలతో ఆకట్టుకుంటూ స్టార్‌లుగా పాపులారిటీని సొంతం చేసుకుంటుంటారు. అయితే వారి ఫ్యామిలీకి సంబంధించిన వారు కొంత మంది ఆసక్తిని బట్టి స్టార్లు అవుతారు. ఇండస్ట్రీలోకి ప్రవేశించి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. కానీ సినీమా రంగంపై ఆసక్తి లేని వారు మాత్రం ఇతర రంగాలలో రాణించాలని, తమకున్న ప్రత్యేక టాలెంట్‌ని ప్రదర్శించాలని చూస్తుంటారు. సినిమాలకు దూరంగా ఉంటూ తమకు నచ్చిన పని చేస్తుంటారు.
స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ సోదరి రేవతి సురేష్ కూడా ఇదే చేస్తూ ఆశ్చర్యపరుస్తోంది. తమిళ, మలయాళ సినిమాల్లో హీరోయిన్‌గా మంచి పేరు తెచ్చుకున్న మేనక నట వారసురాలిగా కీర్తి సురేష్ హీరోయిన్‌గా అరంగేట్రం చేసింది. కెరీర్ ప్రారంభంలో కొన్ని ఇబ్బందుల్ని, ఫ్లాపుల్ని ఎదుర్కొన్నా ఆ తరువాత స్టార్ హీయిన్‌గా పేరు తెచ్చుకుంది. మహానటి` మూవీతో జాతీయ పురస్కారాన్ని సైతం సొంతం చేసుకుని నటిగా విమర్శకుల ప్రశంసల్ని సొంతం చేసుకుంది.
అయితే తనలా కీర్తి సురేష్ అక్క సినిమా రంగంలోకి ప్రవేశించలేదు. తనకు నచ్చిన రంగాన్ని ఎంచుకుని అక్కడ తన టాలెంట్ చూపిస్తోంది. రీసెంట్‌గా రేవతి సురేష్ `చెండమేళం`లో అరంగేట్రం చేసింది. దీనికి సంబంధించిన ప్రత్యేక కార్యక్రమం ఇటీవల తిరువనంతపురంలోని దేవి అట్టుకల్ ఆలయంలో జరిగింది. `చెండమేళం అంటే అదొక వాద్యకళ. ఈ సందర్భంగా తన కుటుంబం గర్వించదగ్గ క్షణాలివని తెలుపుతూ కీర్తి సురేష్ తల్లి మేనక సోషల్ మీడియాలో ఓ ప్రత్యేక వీడియోని షేర్ చేసింది.
తన కుమార్తె రేవతి సురేష్ చెండమేళం ప్రదర్శనతో వాద్యకళా ప్రపంచంలోకి అధికారికంగా అడుగుపెట్టిందని తెలిపింది. తను షేర్ చేసిన వీడియోలో రేవతి సురేష్ చెండమేళం కళని ప్రదర్థిస్తూ అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఈ వీడియో చూసిన కీర్తి సురేష్ అభిమానులు, నెటిజన్‌లు మహానటి సిస్టర్ టాలెంట్ అదరహో అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. దీంతో రేవతి సురేష్ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఇదిలా ఉంటే కీర్తి సురేష్ మూడు క్రేజీ సినిమాల్లో నటిస్తోంది.
తమిళంలో హీరోయిన్ సెంట్రిక్ మూవీ `కన్నివేది`, మలయాళంలో హారర్ థ్రిల్లర్ `తోట్టం` చిత్రాలతో పాటు తెలుగులో రౌడీ హీరో విజయ్ దేవరకొండతో కలిసి `రౌడీ జనార్ధన`లో నటిస్తోంది. రీసెంట్‌గా విడుదల చేసిన ఈ మూవీ టీజర్ సినిమాపై అంచనాల్ని పెంచేసింది. దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ పొలిటికల్ యాక్షన్ డ్రామాకు రవికిరణ్ కోల దర్శకుడు. పాన్ ఇండియా మూవీగా ఇది రిలీజ్ కానుంది.