రేణు దేశాయ్ సన్యాసం.. ఇలాంటి వీడియో ఒకటి చేస్తానని అనుకోలేదు..!

ఒకప్పటి హీరోయిన్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ మరోసారి సోషల్ మీడియాలో వైరల్ గా మారారు.;

Update: 2025-10-23 08:21 GMT

ఒకప్పటి హీరోయిన్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ మరోసారి సోషల్ మీడియాలో వైరల్ గా మారారు. ఆమె రీసెంట్ గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తనకు సన్యాసిగా మారాలని ఉందని చెప్పగా దాన్ని పట్టుకుని రేణు దేశాయ్ సన్యాసిగా మారుతుందని మీడియాలో రకరకాల వార్తలు రాశారు. రేణు దేశాయ్ సన్యాసిగా మారుతుందని గత రెండు రోజులుగా వార్తలు రాగా ఫైనల్ గా ఆ వార్తలు తన దాకా చేరడంతో ఆమె స్పందించారు.

ఎలా రెస్పాండ్ అవ్వాలో తెలియట్లేదు..

తాను రీసెంట్ గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తనకు అన్ని బాధ్యతలు పూర్తయ్యాక సన్యాసిగా మారుతా అని చెప్పాను. కానీ ఇప్పటికిప్పుడు నేను సన్యాసంగా మారుతున్నా అన్నట్టు రాస్తున్నారు. ఇలాంటి వార్తలకు ఎలా రెస్పాండ్ అవ్వాలో తెలియట్లేదు.. ఎలా మాట్లాడాలో తెలియట్లేదు. తనకు పిల్లలు ఉన్నారు.. వాళ్ల తర్వాతే దేవుడు. ముందు పిల్లలు ఆ తర్వాత దేవుడు ఆ నెక్స్ట్ నేను.

తనకు ఆధ్యాత్మిక మార్గంలోనే ఉన్నా కానీ ఈ ఏజ్ లో కాదు ఇంకో 10, 20 ఏళ్ల తర్వాత సన్యాసం తీసుకుంటా. కానీ తాను మాట్లాడిన చిన్న వీడియో తీసుకుని ఇప్పుడు సన్యాసం తీసుకుంటున్నట్టుగా వార్తలు రాస్తున్నారు. ఈ విషయం మీద ఇంకెవరినో ఇంటర్వ్యూ చేస్తున్నారు. నేను సన్యాసం తీసుకుంటే వేరే వాళ్లతో ఇంటర్వ్యూస్ ఎందుకు.. మీకు డౌట్ ఉంటే నాకు కాల్ చేసి క్లారిటీ తీసుకోవాలి. ఈ ప్రపంచంలో చాలా సమస్యలు ఉన్నాయి.. ఉమెన్ సేఫ్టీ, ఫుడ్, రోడ్లు ఇలా చాలా రకాల సమస్యలు ఉన్నాయి. వాటి మీద దృష్టి పెట్టండి అంతేకానీ ఇలా నేను ఎక్కడో చెప్పిన ఒక మాటని తీసుకుని మీ సొంత వార్తలు రాయకండి అంటూ రేణు దేశాయ్ స్పెషల్ వీడియో రిలీజ్ చేశారు.

సోషల్ మీడియా వచ్చాక సెలబ్రిటీస్ ఒకటంటే..

సోషల్ మీడియా వచ్చాక సెలబ్రిటీస్ ఒకటంటే దానికి మరో రెండు మూడు యాడ్ చేసి అది వారన్నట్టుగా వార్తలు స్ప్రెడ్ చేస్తున్నారు. రేణు దేశాయ్ చెప్పినట్టుగానే మన చుట్టూ ఎన్ని సమస్యలు ఉన్నా ఇలాంటివి అయితే ఎక్కువ వ్యూస్ వస్తాయి.. ఎక్కువ రీచ్ ఉంటుందని వీటిని కవర్ చేస్తున్నారు. రేణు దేశాయ్ అయితే దండం పెడతా ఇలాంటి వార్తలు స్ప్రెడ్ చేయకండంటూ వీడియో రిలీజ్ చేయాల్సి వచ్చింది.

ఒకప్పుడు హీరోయిన్ గానే కాదు పవన్ కళ్యాణ్ మాజీ భార్యగా రేణు దేశాయ్ పై ఎప్పుడు ఏదో ఒక న్యూస్ వస్తూనే ఉంటుంది. ఈమధ్య సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టిన రేణు దేశాయ్ ఆశించిన స్థాయిలో రిజల్ట్ అందుకోలేదు. ప్రస్తుతం పిల్లలను చూసుకుంటూ జీవితాన్ని సాగిస్తున్న రేణు దేశాయ్ పై ఎప్పుడూ ఏదో ఒక రూమర్ ని క్రియేట్ చేసి సోషల్ మీడియాలో హడావిడి చేస్తుంటారు.



Tags:    

Similar News