కూలీ మూవీలో తన పాత్రపై హీరోయిన్ అసంతృప్తి.. అయినా అదృష్టం అంటూ!
టాలీవుడ్లోకి శ్రీ విష్ణు నటించిన 'సామజవరగమన' అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. కూలీ మూవీలో ఓ పాత్రలో కనిపించిన సంగతి మనకు తెలిసిందే.;
కొంతమంది నటీమణులు తమకు ఇష్టమైన డైరెక్టర్ లేదా హీరో సినిమాలో ఓ చిన్న పాత్రలో కనిపించినా చాలు అనుకుంటారు. మరికొంతమంది అయితే అభిమాన హీరో పక్కన ఇలా కనిపించి అలా వెళ్లిపోయినా చాలు అనుకుంటారు. అయితే ఈ హీరోయిన్ కూడా అలాగే అనుకుంది. ఆ హీరో సరసన ఒక్క సినిమాలోనైనా స్క్రీన్ షేర్ చేసుకోవాలని కోరుకుంది. కానీ తీరా సినిమాలో ఆ నటిని పెట్టుకున్నాక తన పాత్రకి స్కోప్ లేదని దర్శకుడిని నిందిస్తోంది. మరి ఇంతకీ ఆ నటి ఎవరు అంటే.. 'కూలీ' మూవీలో శృతిహాసన్ సోదరి పాత్రలో నటించిన హీరోయిన్ రెబా మోనికా..
టాలీవుడ్లోకి శ్రీ విష్ణు నటించిన 'సామజవరగమన' అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. కూలీ మూవీలో ఓ పాత్రలో కనిపించిన సంగతి మనకు తెలిసిందే. అయితే ఈ సినిమాలో నటించిన రెబా మోనికా తన పాత్రకి సినిమాలో అంత స్కోప్ లేదు అంటూ డైరెక్టర్ ని నిందిస్తోంది. అయితే చాలామంది నటీనటులు ఓ సినిమాలో నటించాక తమకు ఆ సినిమాలో స్కోప్ ఉన్న పాత్ర ఇవ్వకపోతే కచ్చితంగా ఆ సినిమాపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ నెగిటివ్ కామెంట్లు చేస్తారు. అలా తాజాగా రెబా మోనికా కూడా కూలీ మూవీపై తన అసంతృప్తి వ్యక్తం చేసింది.
ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన రెబా మోనికా.."కూలీ మూవీలో నటించి నేను చాలా నిరాశపడ్డాను. ఒక రకంగా ఈ సినిమాలో ఎందుకు చేశానా అనిపించింది. ఎందుకంటే నా పాత్రకు అంత ప్రాధాన్యత లేదు.అయితే కొన్ని కొన్ని సార్లు మనం అనుకున్నది ఏదీ జరగదు. కానీ సూపర్ స్టార్ రజినీకాంత్ గారితో కలిసి నటించాలనే నా కోరిక నెరవేరినందుకు ఎప్పటికీ రుణపడి ఉంటాను."అంటూ చెప్పుకొచ్చింది.అయితే ఈ సినిమాలో శృతిహాసన్ సోదరి పాత్రలో నటించిన రెబా మోనిక తనని సైడ్ క్యారెక్టర్ గా చూపించారు అంటూ డైరెక్టర్ ని నిందించింది.
ఇక రెబా మోనికా మాట్లాడిన మాటలు నెట్టింట వైరల్ గా మారడంతో చాలామంది నెటిజన్లు లోకేష్ కనగరాజ్ కి మద్దతిస్తూ రెబా మోనికాని ఏకిపారేస్తున్నారు. ఎందుకంటే రెబా మోనికానే స్వయంగా లోకేష్ కనగరాజ్ దగ్గరికి వెళ్లి రజినీకాంత్ తో చేసే సినిమాలో ఒక చిన్న పాత్ర అయినా ఇవ్వండి అని అడిగిందట. ఇక ఈ విషయాన్ని కూడా కూలీ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రెబా మోనికా చెప్పింది.
అంతేకాదు తన పాత్రకి పెద్దగా ప్రాధాన్యత ఉండదు అని డైరెక్టర్ చెప్పినా కూడా రెబా మోనికా ఒప్పుకొని రజినీకాంత్ తో స్క్రీన్ షేర్ చేసుకుంటే చాలు అని సినిమా చేయడానికి ముందుకు వచ్చిందట. కానీ తీరా సినిమా చేశాక తన పాత్ర విషయంలో అసంతృప్తిగా ఉన్నాను, నిరాశకు గురయ్యాను అంటే తప్పు ఎవరిది అంటున్నారు నెటిజన్స్.
పాత్రకు స్కోప్ లేదని చెప్పినా కూడా రజినీకాంత్ తో నటిస్తే చాలు అనే కోరికతో మీరే సినిమా చేయడానికి ఒప్పుకున్నారు. సినిమా విడుదలయ్యాక మళ్ళీ నా పాత్రకు స్కోప్ లేదంటే ఎవరు మాత్రం ఏం చేస్తారు.. ఇందులో దర్శకుడిని నిందించడం ఎంతవరకు కరెక్ట్ అంటూ నెటిజన్స్ రెబా మోనికా కు కౌంటర్లు ఇస్తున్నారు. ఇక కూలీ మూవీలో నటించిన రెబా మోనికా మాత్రమే కాదు అమీర్ ఖాన్ కూడా ఓ ఇంటర్వ్యూలో కూలీ మూవీ పై అసంతృప్తి వ్యక్తం చేసినట్టు వార్తలు వినిపించాయి.కానీ అదంతా పుకార్లే అని అమీర్ ఖాన్ అలాంటి వ్యాఖ్యలు చేయలేదని అమీర్ ఖాన్ టీం ఆ వ్యాఖ్యలను కొట్టి పారేసింది.