నటుడిని వేధించిన రియాలిటీ షో నిర్మాత!
ఈ నటుడు చెప్పిన దాని ప్రకారం.. సదరు నిర్మాత తనను మాత్రమే కాదు.. షోలో గెలిచిన విజేత, 60 మంది అబ్బాయిలైన కంటెస్టెంట్లతో `రాజీ` బేరం కుదుర్చుకున్నాడని;
అతడు పాపులర్ నటుడు. రియాలిటీ షోలతో మంచి పేరు తెచ్చుకున్నాడు. కానీ అతడు వేధింపులకు గురయ్యాడు. నిర్మాత అతడిని రూమ్ కి పిలిచి కమిట్‌మెంట్ ఇస్తావా? అని అడిగాడు. రాజీకి వస్తేనే అతడు ఫైనల్ లో గెలుస్తావని హెచ్చరించాడు.
చివరికి నటుడు దానికి అంగీకరించకపోవడంతో తన సహచరుడిని ఫైనల్ లో గెలిపించి నిర్మాత తనపై కక్ష తీర్చుకున్నాడు. షోలో తాను ఎంత బాగా ఆడినా కానీ, చివరికి గెలవకపోవడంతో అతడు తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. అంతేకాదు.. తనకు ప్రతిభ ఉన్నా కమిట్ మెంట్ కి అంగీకరించకపోవడం వల్ల నిర్మాత తన కెరీర్ ని నాశనం చేస్తానని బెదిరించాడని సదరు నటుడు ఆరోపించాడు. ఇప్పటికే అరడజను పైగా రియాలిటీ షోలతో మంచి పేరు తెచ్చుకున్న ఈ నటుడు తనకు ఎదురైన అనుభవాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది సంచనలంగా మారింది.
ఈ నటుడు చెప్పిన దాని ప్రకారం.. సదరు నిర్మాత తనను మాత్రమే కాదు.. షోలో గెలిచిన విజేత, 60 మంది అబ్బాయిలైన కంటెస్టెంట్లతో `రాజీ` బేరం కుదుర్చుకున్నాడని, వారంతా సిగరెట్ బ్రేక్ పేరుతో నిర్మాత రూమ్ కి వెళ్లేవారని కూడా ఆరోపించాడు. నటుడి ఆరోపణలతో ఇప్పుడు ఆ నిర్మాత సంకటంలో పడ్డాడు. రియాలిటీ షోల తెరవెనక భోగోతం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. కేవలం అమ్మాయిలకే వేధింపుల ముప్పు ఉందనుకుంటే పొరపాటే, అబ్బాయిలు కూడా నిర్మాతల కామ వాంఛకు బలి కావాల్సిందేనని తాజా ఘటన చెబుతోంది. అయితే బాలీవుడ్ లో ఇలాంటివి సర్వసాధారణం అని చాలామంది చెబుతుంటారు. ప్రఖ్యాత దర్శకుడు మాధుర్ భండార్కర్ తన సినిమా కథల్లో ఇలాంటి పాత్రలను కూడా ప్రజలకు పరిచయం చేసాడు.