రీ-రిలీజ్ లతో వాళ్లకు ఇబ్బందే!
రీ-రిలీజ్ లతో చిన్న సినిమాలకు ఆటంకంగా మారుతోందా? కలెక్షన్ల విషయంలో రీ-రిలీజ్ లు ఇబ్బంది పెడుతున్నాయా? అంటే సన్నివేశం అలాగే కనిపిస్తోంది.;
రీ-రిలీజ్ లతో చిన్న సినిమాలకు ఆటంకంగా మారుతోందా? కలెక్షన్ల విషయంలో రీ-రిలీజ్ లు ఇబ్బంది పెడుతున్నాయా? అంటే సన్నివేశం అలాగే కనిపిస్తోంది. రీ-రిలీజ్ లు అన్నది ట్రెండ్ గా మారిన సంగతి తెలిసిందే. ఓల్డ్ హిట్ చిత్రాలన్నింటిని 4 కె వెర్షన్ లో రిలీజ్ చేయడం అన్నది రెండు...మూడేళ్లగా జరుగుతుంది. అయితే ఇలా రీరిలీజ్ లు చేయడం అన్నది స్టార్ హీరోల చిత్రాలకు ఇబ్బంది లేదు.
కానీ చిన్న సినిమాలపై మాత్రం రీ-రిలీజ్ ఎఫెక్ట్ కనిపిస్తుందన్న వాదన తెరపైకి వస్తోంది. ఇటీవలే `భైరవం` సినిమాతో పాటు సూపర్ స్టార్ మహేష్ నటించిన `ఖలేజా` కూడా రీ-రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. `బైరవం` సినిమాకు మంచి టాక్ వచ్చింది. కానీ అదే సమయంలో `ఖలేజా` కూడా థియేటర్లలో ఉండటంతో? `బైరవం` కంటే `ఖలేజా` థియేటర్లో ఆడియన్స్ ఎక్కువగా కనిపించారు. దానికి సంబం ధించి కొన్ని వీడియోలు కూడా నెట్టింట వైరల్ అయ్యాయి.
`బైరవం`లో బెల్లకొండ శ్రీనివాస్, నారా రోహిత్, మనోజ్ లు కీలక పాత్రలు పోషించగా...`ఖలేజా` లో మహేష్ నటించాడు. `భైరవం` కొత్త సినిమా అయినా `ఖలేజా` రెండవ సారి రిలీజ్ అయినా? `ఖలేజా` థియేటర్లో హడావుడి ఎక్కువ కనిపించింది. దీంతో బైరవం వసూళ్లపై ప్రభావం పడింది. అదే ఆ సమయంలో ఖలేజా రిలీజ్ లేకపోయి ఉంటే అదే ఆడియన్స్ బైరవం థియేటర్ కు వెళ్లేవారు? అన్న వాదన తెరపైకి వస్తుంది.
ఇలా రీ-రిలీజ్ లు అన్నది చిన్న సినిమాలకు ఆటంకంగా మారుతుంది అన్న అంశం నిర్మాతల సంఘం దృష్టికి వెళ్లింది. దీనిపై ఇండస్ట్రీలో కూడా వాడి వేడి చర్చ జరుగుతుంది. స్టార్ హీరోల రీరిలీజ్ లతో చిన్న సినిమా నిర్మాతలు నష్టపోతున్నారని వాటిని నివారించాల్సిన బాధ్యత నిర్మాతల సంఘానికి ఉందంటూ వినతి పత్రాలు అందుతున్నాయట. దీనికి సంబంధించి సంఘం ఓ నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని పలువురు పెద్దలు సూచించినట్లు సమాచారం.