ఓవర్సీస్ లో కె-ర్యాంప్.. నిర్మాత రాజేష్ ప్లాన్ సూపర్ సక్సెస్!
అయితే మొదట్లో కాస్త డౌన్ అయిన కె- ర్యాంప్ మూవీ.. ఆ తర్వాత మెల్లగా పుంజుకుందనే చెప్పాలి. వరల్డ్ వైడ్ గా కూడా సాలిడ్ కలెక్షన్స్ సాధిస్తోంది.;
టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం రీసెంట్ గా కె- ర్యాంప్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఆ సినిమాను యంగ్ డైరెక్టర్ జైన్స్ నాని దర్శకత్వం వహించారు. రాజేష్ దండా, బాలాజీ గుత్తా, శివాజీ బొమ్మక్ సంయుక్తంగా రూపొందించారు.
దీపావళి కానుకగా అక్టోబర్ 18వ తేదీన ప్రపంచవ్యాప్తంగా సినిమాను విడుదల చేశారు. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన కె- ర్యాంప్.. క్రిటిక్స్ నుంచి మిక్స్ డ్ టాక్ అందుకుంది. కానీ మంచి వసూళ్లను రాబడుతోంది. తొలి రోజు రూ.4.5 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. కిరణ్ కెరీర్ లో హైయెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన మూవీగా నిలిచింది.
అయితే మొదట్లో కాస్త డౌన్ అయిన కె- ర్యాంప్ మూవీ.. ఆ తర్వాత మెల్లగా పుంజుకుందనే చెప్పాలి. వరల్డ్ వైడ్ గా కూడా సాలిడ్ కలెక్షన్స్ సాధిస్తోంది. ఓవర్సీస్ లోనూ మంచి వసూళ్లను రాబడుతోంది. మంగళవారం వరకు $208K అంటే దాదాపు రూ.1.83 కోట్లకు పైగా కలెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఈ విషయం నెట్టింట వైరల్ గా మారింది.
నిజానికి.. కె- ర్యాంప్ మూవీని నార్త్ అమెరికాలో నిర్మాత రాజేష్ దండానే రిలీజ్ చేశారు. ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ప్రత్యంగిరా సినిమాస్ ద్వారా సొంతంగా విడుదల చేశారు. సినిమాపై ఏర్పడిన బజ్.. కిరణ్ మూవీకి ఉన్న క్రేజ్ దృష్ట్యా.. పలువురు విదేశీ పంపిణీదారులు థియేట్రికల్ రైట్స్ కోసం పోటీ పడ్డారు. వాటి కోసం గరిష్టంగా రూ.50 లక్షలు ఆఫర్ కూడా చేశారు.
కానీ మేకర్స్ మాత్రం ఓవర్సీస్ రైట్స్ ను విక్రయించలేదు. రాజేష్ దండా తన సినిమాపై నమ్మకంతో సొంతంగా విడుదల చేశారు. అయితే ఒకవేళ రూ.50 లక్షలకు రైట్స్ అమ్మి ఉంటే.. బ్రేక్ ఈవెన్ పాయింట్ దాదాపు రూ.కోటి వరకు ఫిక్స్ అవుతుంది. ఇప్పుడు ఆ మార్క్.. కె- ర్యాంప్ ఎప్పుడో దాటేసింది. త్వరలో $300K మార్క్ కు చేరవవుతుందని అంచనా ఉన్నాయి.
దీంతో నిర్మాత రాజేష్ తీసుకున్న నిర్ణయం.. ఆయనకు లాభం చేకూర్చిందని చెప్పడంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు. డిస్ట్రిబ్యూషన్ కు ఇవ్వకుండా సొంతం రిలీజ్ చేసి మంచి పని చేశారని చెప్పాలి. భారీ ఆఫర్లు వచ్చినా కూడా రాజేష్ దండా.. తన నిర్ణయాన్ని మార్చుకోకుండా సొంతంగా విడుదల చేయడం గమనించాల్సిన విషయం. మరి ఫుల్ రన్ లో కె- ర్యాంప్ ఓవర్సీస్ లో ఎలాంటి వసూళ్లు సాధిస్తుందో వేచి చూడాలి.