రవితేజ, శివ మూవీ.. మైత్రీ సేఫ్ గేమ్... సక్సెస్ అయితే జాక్ పాట్!

టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ, టాలెంటెడ్ డైరెక్టర్ శివ నిర్వాణ కాంబినేషన్ లో ఓ మూవీ రూపొందుతున్నట్లు కొద్ది రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.;

Update: 2025-09-05 16:46 GMT

టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ, టాలెంటెడ్ డైరెక్టర్ శివ నిర్వాణ కాంబినేషన్ లో ఓ మూవీ రూపొందుతున్నట్లు కొద్ది రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే రవితేజ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని.. త్వరలో అనౌన్స్మెంట్ రానుందని ప్రచారం జరుగుతోంది. ప్రముఖ మైత్రీ మూవీ మేకర్స్ గ్రాండ్ గా నిర్మించనుందని టాక్ వినిపిస్తోంది.

మైత్రీ మూవీ మేకర్స్‌, రవితేజ కాంబోలో ఇప్పటికే అమర్‌ అక్బర్‌ ఆంటోనీ మూవీ రాగా.. శివ నిర్వాణ ఆ బ్యానర్ పై ఖుషి మూవీ చేశారు. ఇప్పుడు శివ నిర్వాణ-రవితేజ- మైత్రీ కాంబోలో సినిమా రానుంది. అయితే శివ నిర్వాణ, రవితేజ ఇద్దరు తమ రూటు మార్చి ఇప్పుడు ఆ ప్రాజెక్టుకు పనిచేస్తున్నట్లు, థ్రిల్లర్ జోనర్ లో సినిమా చేయనున్నట్లు తెలుస్తోంది.

అయితే రవితేజ సినిమాల్లో మాస్ అప్పీల్, యాక్షన్‌, కామెడీ, రొమాన్స్ ఎలిమెంట్స్ కచ్చితంగా ఉంటాయి. ఇప్పుడు రూట్ మార్చి మరీ థ్రిల్లర్‌ స్టోరీకి గాను శివ నిర్వాణతో వర్క్ చేయనున్నారు! ఇప్పటిదాకా నిన్ను కోరి, మజిలీ, ఖుషి వంటి లవ్‌ స్టోరీ చిత్రాలతో ఇంప్రెస్ చేసిన ఆయన.. ఇప్పుడు థ్రిల్లర్‌ జోనర్‌ లో చేస్తున్న తొలి సినిమా కావడం విశేషం.

దీంతో ఇప్పటికే ఆడియన్స్ లో అంచనాలు క్రియేట్ అవుతున్నాయి. క్యూరియాసిటీ కూడా పెరుగుతోంది. అదే సమయంలో ఇప్పుడు సినీ వర్గాల్లో సినిమాకు సంబంధించిన కీలక అప్డేట్లు వైరల్ అవుతున్నాయి. దసరా పండుగకు రవితేజ- శివ నిర్వాణ సినిమా ప్రారంభం కానుందని సమాచారం. సంప్రదాయ పూజా కార్యక్రమాలు జరగనున్నాయట.

అయితే మైత్రీ మూవీ మేకర్స్.. శివ నిర్వాణ- రవితేజ మూవీ విషయంలో సేఫ్ గేమ్ ను ప్లాన్ చేసిందని సినీ వర్గాల్లో ఇప్పుడు ప్రచారం జరుగుతోంది. సేఫ్ ప్రాజెక్ట్ గా సినిమాను రూపొందిస్తుందని టాక్ వినిపిస్తోంది. ముందుగానే నాన్ థియేట్రికల్ రైట్స్ కు గాను అడ్వాన్సులు తీసుకుంటుందని ఊహాగానాలు ఇప్పుడు చక్కర్లు కొడుతున్నాయి.

ఇక సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. మూవీ రిలీజ్ అయ్యాక మౌత్ టాక్ పాజిటివ్ గా వస్తే బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షమే. దానికి తోడు ఇప్పుడు సేఫ్ ప్రాజెక్ట్ గా మైత్రీ సంస్థ రూపొందించాలని నిర్ణయం తీసుకోవడంతో సినిమా హిట్ అయితే జాక్ పాట్ గా నిలవనుంది. మరి రవితేజ, శివ నిర్వాణ మూవీ ఎలా ఉంటుందో.. ఎలాంటి హిట్ అవుతుందో.. ఎప్పుడు స్టార్ కానుందో వేచి చూడాలి.

Tags:    

Similar News