రవితేజ ఇరుముడి ట్రైలర్ రిలీజ్.. ఎలా ఉందంటే?
ఈ నేపథ్యంలోనే ఎలాగైనా మంచి సక్సెస్ అందుకోవాలని చూస్తున్న రవితేజ ఏకంగా జానర్ మార్చి 'ఇరుముడి' అనే టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆగస్టు 21న ఈ సినిమా విడుదల కాబోతోంది.
మాస్ మహారాజా రవితేజ గత కొంతకాలంగా సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నారు.. చివరిగా ఆయన నటించిన మాస్ జాతర, భర్త మహాశయులకు విజ్ఞప్తి ఈ రెండు చిత్రాలు కూడా ఆయనకు పెద్దగా విజయాన్ని అందించలేదు. దీంతో ఆయన ఖాతాలో హిట్ అనివార్యమైంది. ఈ నేపథ్యంలోనే ఎలాగైనా మంచి సక్సెస్ అందుకోవాలని చూస్తున్న రవితేజ ఏకంగా జానర్ మార్చి 'ఇరుముడి' అనే టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆగస్టు 21న ఈ సినిమా విడుదల కాబోతోంది.
ఇరుముడి ట్రైలర్ రిలీజ్..
విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో చిత్ర బృందం అప్పుడే ప్రమోషనల్ కార్యక్రమాలు మొదలుపెట్టింది. పైగా సినిమా నుండి ఇప్పటికే విడుదల చేసిన ప్రచార చిత్రాలకు మంచి రెస్పాండ్ లభించింది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు. అయ్యప్ప మాలలో ప్రేక్షకులకు ఈసారి మంచి వినోదాన్ని పంచడానికి సిద్ధమైన రవితేజ.. ఈ ట్రైలర్ తో సినిమాపై అంచనాలు పెంచేశారు. తాజాగా విడుదల చేసిన ట్రైలర్లో భక్తి, కుటుంబ భావోద్వేగాలు, యాక్షన్ మేళవింపుగా దీనిని తీర్చిదిద్దినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది.
ట్రైలర్ ఎలా ఉందంటే?
ఇరుముడి అఫీషియల్ ట్రైలర్ విషయానికి వస్తే.. రవితేజ కూతురు పాత్రలో నటిస్తున్న చిన్నారి తన స్కూల్ స్టూడెంట్స్ తో కలిసి సైకిల్ మీదుగా వస్తూ ఒక్కసారిగా కింద పడిపోతుంది. కట్ చేస్తే అటు రవితేజ మద్యం సేవించడానికి తన గ్యాంగ్ తో మీట్ అవుతాడు. "మందు తాగకపోతే క్షణం ఉండలేవు.. 41 రోజులు ఎలా ఉంటావు" అంటూ రవితేజ స్నేహితులు ఆయనను అడగగా.. నా కూతురు మణెమ్మ కోసం అంటూ తన కూతురిపై ఉన్న ప్రేమను చూపిస్తారు. అలా తండ్రి కూతురు మధ్య చక్కటి అనుబంధాన్ని చూపించారు. ఇక తన కూతురితో.." ఊర్లో కానీ ఊరి బయట కానీ.మీ స్కూల్లో కానీ.. స్కూల్ బయట కానీ.. చూసింది చూసినట్టు చెప్పేయాలి" అని రవితేజ తన కూతురితో చెబుతారు. అనుకోకుండా స్కూల్లో ఒక చిన్నారి ఉరి వేసుకుని చనిపోతుంది. ఆ తర్వాత వరుసగా చిన్నారుల మృతదేహాలు లభ్యమవుతూ ఉంటాయి. ఇక తన కూతురి జోలికి రావాలనుకున్న వారికి ఎలా బుద్ధి చెప్పాడు? ముఖ్యంగా మాల వేసిన తర్వాత రౌడీలు రవితేజ పై దాడి చేసినప్పుడు ఎలా దాని నుంచి తప్పించుకున్నారు? అసలు వరుస మరణాలకి గల కారణం ఏంటి? ఇలా తదితర అంశాల మేళవింపే ఈ ఇరుముడి. మొత్తానికైతే కాస్త క్యూరియాసిటీతో సినిమాపై అంచనాలు పెంచేసిన ఈ ట్రైలర్ ప్రేక్షకులను ఏ విధంగా ఆకట్టుకుంటుందో చూడాలి.
ఇరుముడి సినిమా విషయానికి వస్తే జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి శివ నిర్వాణ దర్శకత్వం వహించారు . ప్రియా భవాని శంకర్ కీలక పాత్ర పోషిస్తుంది. ఇకపోతే ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన మల్లెపూల పల్లకి తోపాటు మరికొన్ని అయ్యప్ప స్వామి పాటలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.