ఒక్కసారి 'జైశ్రీరామ్' నినాదం.. 50 కోట్ల మందికి రీచ్!
యూట్యూబ్ లో కోట్లాది మంది ఫాలోవర్లను సంపాదించుకున్న ఆ గ్లోబల్ కంటెంట్ క్రియేటర్.. రామాయణ సినిమా ప్రమోషన్ ఈవెంట్ లో ఇండియన్ కల్చర్ ను ఎంతో ఇంట్రెస్ట్ గా ఫాలో అయ్యారు.
ఒక్క నినాదం.. ఒక్క మూమెంట్.. కానీ రీచ్ మాత్రం వరల్డ్ వైడ్ గా! జై శ్రీరామ్ అంటూ ఫేమస్ యూట్యూబర్ మిస్టర్ బీస్ట్ చేసిన ఒక్క నినాదం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. యూట్యూబ్ లో కోట్లాది మంది ఫాలోవర్లను సంపాదించుకున్న ఆ గ్లోబల్ కంటెంట్ క్రియేటర్.. రామాయణ సినిమా ప్రమోషన్ ఈవెంట్ లో ఇండియన్ కల్చర్ ను ఎంతో ఇంట్రెస్ట్ గా ఫాలో అయ్యారు.
యూట్యూబర్ మిస్టర్ బీస్ట్ అలియాస్ జేమ్స్ స్టీఫెన్ డొనాల్డ్ సన్ ప్రస్తుతం ఇండియాలో విజిట్ చేస్తున్నారు. అయితే ముంబైలో జరిగిన రామాయణ మూవీ ప్రమోషనల్ ఈవెంట్ కు బీస్ట్ చీఫ్ గెస్ట్ గా అటెండ్ అయ్యారు. బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్, నేచురల్ బ్యూటీ సాయిపల్లవి, నటుడు రవి దూబే, దర్శకుడు నితేశ్ తివారి, నిర్మాత నమిత్ మల్హోత్ర తదితరులు ఆ ఈవెంట్ లో పాల్గొన్నారు.
ఈవెంట్ లో మిస్టర్ బీస్ట్ కు మూవీ టీమ్ చాలా ట్రెడిషనల్ గా వెల్కమ్ చెప్పింది. ఆ సమయంలో రణబీర్ కపూర్ ఆయనకు ఇండియన్ ట్రెడిషన్స్ ప్రకారం నమస్కారం చేయడం ఎలాగో చూపించారు. రెండు చేతులు జోడించి ప్రేక్షకులకు విష్ చేయాలని చెప్పారు. మిస్టర్ బీస్ట్ కూడా అదే విధంగా చేతులు జోడించి అందరినీ పలకరించారు. అయితే ఆ కార్యక్రమంలో అసలు హైలైట్ మరో సీన్.
మిస్టర్ బీస్ట్ ను జై శ్రీరామ్ అని నినదించమంటూ ఆడియన్స్ కోరారు. దీంతో రణబీర్ కపూర్ ఆయన చెవిలో ఆ విషయం చెప్పగా.. మిస్టర్ బీస్ట్ వెంటనే ‘జై శ్రీరామ్’ అంటూ నినదించారు. దీంతో అక్కడి ఎన్విరాన్మెంట్ ఒక్కసారిగా మారిపోయింది. ఆడియన్స్ పెద్ద ఎత్తున రెస్పాండ్ అవుతూ సందడి చేశారు. ఇక ఆ ఒక్క మూమెంట్ ఇప్పుడు రామాయణ ప్రమోషన్ లో స్పెషల్ అట్రాక్షన్ గా మారింది.
ప్రపంచవ్యాప్తంగా భారీగా ఫాలోయింగ్ ఉన్న మిస్టర్ బీస్ట్ (50 కోట్లకు మందికిపైగా ఫాలోవర్లు) తన సోషల్ మీడియా కంటెంట్ తో కోట్లాది మందిని చేరుకుంటుంటారు. ఆయన భారత పర్యటనలో భాగంగా రామాయణ ఈవెంట్ కు హాజరు కావడం సినిమాకు కూడా ఇంటర్నేషనల్ రేంజ్ లో ఆసక్తిని తీసుకొచ్చే అంశంగా కనిపిస్తోంది. అంతేకాదు.. మిస్టర్ బీస్ట్ మీడియాతో కూడా మాట్లాడారు. వారందరికీ హిందీలో థ్యాంక్స్ చెప్పారు.
ఇండియాకు వచ్చిన సందర్భంగా లోకల్ కల్చర్, ట్రెడిషన్స్ ను గౌరవిస్తూ ఆయన వ్యవహరించడం అక్కడున్న వారిని ఆకట్టుకుంది. రణబీర్ కపూర్ రాముడిగా, సాయిపల్లవి సీతగా నటిస్తున్న రామాయణపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. నితేశ్ తివారి దర్శకత్వం వహిస్తున్న ఆ చిత్రాన్ని రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. తొలి భాగాన్ని దీపావళి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇలాంటి సమయంలో ప్రపంచంలోనే భారీ ఫాలోయింగ్ ఉన్న మిస్టర్ బీస్ట్ జై శ్రీరామ్ అంటూ నినదించడం.. రామాయణ ప్రమోషన్ లో స్పెషల్ మూమెంట్ అనే చెప్పాలి.