మాస్ రాజా మ‌ళ్లీ ఆ మ్యాజిక్ రిపీట్ చేస్తాడా?

మాస్ రాజా ర‌వితేజ ప్లాప్ ల‌ ప‌రం ప‌ర కొన‌సాగిస్తోన్న సంగ‌తి తెలిసిందే. `ధ‌మాకా` త‌ర్వాత న‌టించిన సినిమాల‌న్నీ ప్లాప్ అయ్యాయి. `రావ‌ణాసుర‌`, `టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు`, ` ఈగ‌ల్`, `మిస్ట‌ర్ బ‌చ్చ‌న్` అన్నీ ప్లాపుల‌ ప‌రంగా ఒక‌దాని కొక‌టి పోటీ ప‌డిన చిత్రాలే.;

Update: 2025-12-13 23:30 GMT

మాస్ రాజా ర‌వితేజ ప్లాప్ ల‌ ప‌రం ప‌ర కొన‌సాగిస్తోన్న సంగ‌తి తెలిసిందే. `ధ‌మాకా` త‌ర్వాత న‌టించిన సినిమాల‌న్నీ ప్లాప్ అయ్యాయి. `రావ‌ణాసుర‌`, `టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు`, ` ఈగ‌ల్`, `మిస్ట‌ర్ బ‌చ్చ‌న్` అన్నీ ప్లాపుల‌ ప‌రంగా ఒక‌దాని కొక‌టి పోటీ ప‌డిన చిత్రాలే. తాజాగా రిలీజ్ అయిన‌ `మాస్ జాత‌ర` కూడా ప్లాప్ అయింది. ఈ సినిమా హిట్ తోనైనా రాజాకి ఊర‌ట ద‌క్కుతుంది అనుకుంటే? రాజా స‌హా అత‌డి అభిమానుల‌కు నిరుత్సాహ‌మే ఎదురైంది. దీంతో మాస్ రాజాని ఇప్పుడు సంక్రాంతి సీజ‌న్ మాత్ర‌మే ఆదుకోవాలి. ర‌వితేజ హీరోగా న‌టించిన `భ‌ర్త‌మ‌హాశ‌యుల‌కు విజ్ఞ‌ప్తి` సంక్రాంతి కానుక‌గా రిలీజ్ అవుతున్న సంగ‌తి తెలిసిందే.

రిలీజ్ తేదీ ఇంకా ఫిక్స్ అవ్వ‌లేదు గానీ రిలీజ్ మాత్రం ప‌క్కా. చిరంజీవీ, ప్ర‌భాస్ లాంటి స్టార్లు ఉన్నా? వాళ్ల‌కు పోటీగా కాన్పిడెంట్ గా రాజా బ‌రిలోకి దిగుతున్నాడు. దీంతో ర‌వితేజ మ‌ళ్లీ పాత సంక్రాంతి మ్యాజిక్ ని రిపీట్ చేస్తాడా? లేదా? అన్న‌ది ఆస‌క్తి క‌రంగా మారింది. స‌రిగ్గా 14 ఏళ్ల క్రితం ర‌వితేజ హీరోగా న‌టించిన `మిర‌ప‌కాయ్` సంక్రాంతి కానుక‌గానే రిలీజ్ అయి బ్లాక్ బ‌స్ట‌ర్ అయింది. ఆ హిట్ ర‌వితేజ‌ను చాలా కాలం పాటు కాపాడింది. `మిర‌ప‌కాయ్` త‌ర్వాత న‌టించిన చాలా సినిమాలు ప్లాప్ అయినా? `మిర‌ప‌కాయ్` మోజులో చాలా అవ‌కాశాలు అందుకుం టున్నాడు.

అటుపై 2021 లో మ‌ళ్లీ అదే సంక్రాంతికి `క్రాక్` చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకొచ్చాడు. ఈ సినిమా మంచి విజ‌యం సాధించింది. `రాజా ది గ్రేట్` త‌ర్వాత న‌టించిన చాలా సినిమాల ప్లాప్ త‌ర్వాత హిట్ అయిన చిత్ర‌మది. `క్రాక్` త‌ర్వాత న‌టించిన రెండు సినిమాలు కూడా ప్లాప్ అయ్యాయి. అనంతరం `ధ‌మాకా`తో బౌన్స్ బ్యాక్ అయినా స‌క్సెస్ ని కొన‌సాగించ‌లేక‌పోయాడు. దీంతో రాజాని మ‌ళ్లీ 2026 ఆదుకోవాల్సిందే. `భ‌ర్త మ‌హాశ‌యుల‌కు విజ్ఞ‌ప్తి` సినిమాపై పాజిటివ్ బ‌జ్ ఉంది. ఆ సినిమాను క్లాసిక్ డైరెక్ట‌ర్ కిషోర్ తిరుమ‌ల తెర‌కెక్కిస్తున్నాడు.

ఇప్ప‌టి వ‌ర‌కూ కిషోర్ తెర‌కెక్కించిన సినిమాలు బాగానే ఆడాయి. అత‌డి సినిమాల‌కు అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కులు క‌నెక్ట్ అవుతారు. సింపుల్ స్టోరీని త‌న స్టైల్లో అందంగా చెబుతాడు. టైటిల్ తోనే సినిమాకు పాజిటివ్ ఇంప్రెష‌న్ ప‌డింది. వ‌రుస మాస్ చిత్రాల్లో మాస్ పాత్ర‌ల్లో చూసిన ర‌వితేజ ను ఇందులో క్లాస్ లుక్ లో చూసే అవ‌కాశం ఉంటుంది. సినిమాకు సంబంధించి ఇంకా ఎలాంటి ప్ర‌చార కార్య‌క్ర‌మాలు మొద‌లు కాలేదు. టీజ‌ర్, ట్రైల‌ర్ కోసం మాస్ రాజా అభిమానులు ఎగ్జైట్ మెంట్ తో ఎదురు చూస్తున్నారు.

Tags:    

Similar News