మాస్ రాజా.. మళ్ళీ హిట్ రూట్లోనే డబుల్ ప్లాన్

మాస్ మహారాజా రవితేజ ఎనర్జీకి తిరుగులేదు కానీ, బాక్సాఫీస్ లెక్కలు మాత్రం ఈ మధ్య అనుకూలంగా ఉండటం లేదు. వరుస పెట్టి సినిమాలు చేస్తున్నా, విజయాలు మాత్రం అందని ద్రాక్షలా మారాయి.;

Update: 2025-11-30 03:31 GMT

మాస్ మహారాజా రవితేజ ఎనర్జీకి తిరుగులేదు కానీ, బాక్సాఫీస్ లెక్కలు మాత్రం ఈ మధ్య అనుకూలంగా ఉండటం లేదు. వరుస పెట్టి సినిమాలు చేస్తున్నా, విజయాలు మాత్రం అందని ద్రాక్షలా మారాయి. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో వచ్చిన 'మిస్టర్ బచ్చన్', 'మాస్ జాతర' ఫలితాలు రవితేజ మార్కెట్ ను గట్టిగానే దెబ్బతీశాయి. కనీసం ఓపెనింగ్స్ కూడా రాబట్టలేకపోవడం ఫ్యాన్స్ ను కలవరపెడుతోంది. దీంతో ఇప్పుడు రవితేజ ప్రయోగాలు పక్కన పెట్టి, ఒక పక్కా సేఫ్ ప్రాజెక్ట్ కోసం చూస్తున్నట్లు అర్థమవుతోంది.

గత కొంతకాలంగా రవితేజ కెరీర్ గ్రాఫ్ గమనిస్తే, సోలో హీరోగా ఆయనకు వచ్చిన సాలిడ్ బ్లాక్ బస్టర్ కేవలం 'ధమాకా' మాత్రమే. మధ్యలో 'వాల్తేరు వీరయ్య' లాంటి మెగా హిట్ ఉన్నా, అది మల్టీస్టారర్ కాబట్టి క్రెడిట్ చిరంజీవికి కూడా వెళ్తుంది. ఇక రావణాసుర'టైగర్ నాగేశ్వరరావు, ఈగల్ వంటివన్నీ బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచినవే. అందుకే ఇప్పుడు మళ్ళీ తనకు కలిసొచ్చిన మ్యాజిక్ ను రిపీట్ చేయడానికి రవితేజ సిద్ధమవుతున్నాడు.

లేటెస్ట్ గా ఇండస్ట్రీలో వినిపిస్తున్న వార్త ఫ్యాన్స్ లో కొత్త జోష్ నింపుతోంది. రవితేజకు 'ధమాకా' వంటి హిట్ ఇచ్చిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ, ఇటీవల ఫిల్మ్ ఛాంబర్ లో "డబుల్ ధమాకా" అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ ను రిజిస్టర్ చేయించిందట. ఈ టైటిల్ చూడగానే ఇది పక్కా రవితేజ కోసమే అని, మళ్ళీ ఆ హిట్ సెంటిమెంట్ ను వాడుకోబోతున్నారని ఇండస్ట్రీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.

ఈ ప్రాజెక్ట్ కోసం పాత సక్సెస్ ఫుల్ కాంబినేషన్ ను రంగంలోకి దింపుతున్నట్లు టాక్. దర్శకుడు త్రినాథ రావు నక్కిన దర్శకత్వంలో, రవితేజ శ్రీలీల జోడీ మరోసారి సందడి చేసే అవకాశం ఉందని టాక్. గతంలో వీరిద్దరి కెమిస్ట్రీ, శ్రీలీల ఎనర్జిటిక్ డ్యాన్సులు సినిమా విజయానికి ప్రధాన కారణంగా నిలిచాయి. ఇప్పుడు 'డబుల్' అంటూ వస్తున్నారంటే, ఎంటర్టైన్మెంట్ డోస్ కూడా డబుల్ ఉండేలా ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది.

రవితేజ ఇటీవల మాస్ ఎంటర్టైనర్స్ తీసినా కూడా ఫ్లాప్స్ అవుతున్నట్లు మాస్ జాతర నిరూపించింది. అలాగని ఫ్యాన్స్ అవి కోరినట్లు కాదు. రెగ్యులర్ కంటెంట్ తో కాకుండా కాస్త కొత్తగా ఉండాలని కోరుకుంటున్నారు. ఇక ఇప్పుడు మళ్లీ సీరియస్ రోల్స్ కంటే, రవితేజ మార్క్ కామెడీ, మాస్ మేనరిజమ్స్ ఉంటేనే సినిమా సేఫ్ జోన్ లో ఉంటుందని మేకర్స్ గ్రహించినట్లున్నారు. వరుస డిజాస్టర్ల తర్వాత రవితేజ తీసుకున్న ఈ నిర్ణయం ఆయన కెరీర్ కు చాలా కీలకం కానుంది. హిట్ ఇచ్చిన బ్యానర్, కలిసొచ్చిన డైరెక్టర్, లక్కీ హీరోయిన్.. ఈ కాంబో కనుక సెట్ అయితే రవితేజ బౌన్స్ బ్యాక్ అవ్వడం ఖాయం. మరి కాంబినేషన్ పై అఫీషియల్ క్లారిటీ ఎప్పుడు వస్తుందో చూడాలి.

Tags:    

Similar News