ట్రెండ్‌ల కోసం మారని రవితేజ
కానీ మాస్ మహారాజా రవితేజ మాత్రం ఈ సోషల్ మీడియా రేసులో పరుగెత్తే ఇంట్రెస్ట్ ఏమాత్రం లేదంటున్నాడు.
ఇప్పుడు స్టార్ కు యాక్టింగ్ తో పాటు సోషల్ మీడియా మెయింటెనెన్స్ కూడా ఒక ఫుల్ టైమ్ జాబ్ అయిపోయింది. ఇన్ స్టాలో ఎప్పటికప్పుడు యాక్టివ్ గా ఉండాలి, ట్రెండింగ్ వీడియోలు చేయాలి, ఫ్యాన్స్ తో రోజూ కనెక్ట్ అవుతూ ఉండాలి. కానీ మాస్ మహారాజా రవితేజ మాత్రం ఈ సోషల్ మీడియా రేసులో పరుగెత్తే ఇంట్రెస్ట్ ఏమాత్రం లేదంటున్నాడు. రీసెంట్ గా ఆయన చెప్పిన మాటలు చూస్తే ఆన్లైన్ హడావిడికి దూరంగా ఉండటానికే ఎక్కువ ఇష్టపడుతున్నాడని క్లియర్ గా అర్థమవుతోంది.
రవితేజ పిల్లలు ఇప్పటి జనరేషన్ కు తగ్గట్టుగా సోషల్ మీడియాను ఎలా వాడాలో ఆయనకు రోజూ సలహాలు ఇస్తుంటారట. కొత్త కొత్త ఫోటోలు పోస్ట్ చేయాలని, ట్రెండీగా ఉండే రీల్స్ చేయాలని చెప్తుంటారని రవితేజ స్వయంగా వెల్లడించాడు. పిల్లలు ఎంత మోటివేట్ చేస్తున్నా తాను మాత్రం వాళ్ల మాటలను పెద్దగా పట్టించుకోనని క్యాజువల్ గా చెప్పేశాడు.
సోషల్ మీడియాలో ఏ ఫోటో పెడితే ఎక్కువ లైక్స్ వస్తాయి, ఏ వీడియో చేస్తే రీచ్ పెరుగుతుంది లాంటి లెక్కలు వేసుకోవడం రవితేజ కు నచ్చని పని. తన పర్సనాలిటీకి ఏది సెట్ అవుతుందో అదే పోస్ట్ చేయడానికి ఆయన ఇష్టపడతాడు. ఒక స్టార్ హీరో ఇమేజ్ కు డిజిటల్ ప్రెజెన్స్ చాలా అవసరం అని అందరూ ఫీల్ అవుతున్న ఈ టైమ్ లో రవితేజ మాత్రం దాన్ని చాలా లైట్ తీసుకుంటున్నాడు.
చాలామంది హీరోలు చేతిలో సినిమాలు లేకపోయినా రెగ్యులర్ గా ఏదో ఒక పోస్ట్ తో ఆడియన్స్ కు టచ్ లో ఉంటున్నారు. ఇది కూడా వాళ్ల బ్రాండింగ్ లో ఒక పార్ట్ అయిపోయింది. రవితేజ స్టైల్ మాత్రం ఇందుకు పూర్తి ఆపోజిట్ గా ఉంటుంది. ఫాలోవర్స్ ను పెంచుకోవడం కోసం తన క్యారెక్టర్ ను మార్చుకోవడం ఆయనకు అస్సలు నచ్చదు. తాను రియల్ లైఫ్ లో ఎలా ఉంటాడో ఆన్లైన్ లో కూడా అలాగే ఉండాలని ఫిక్స్ అయ్యాడు.
సోషల్ మీడియాలో కొత్త ట్రెండ్స్ ఫాలో అవ్వకపోయినా సిల్వర్ స్క్రీన్ మీద మాత్రం ఎప్పుడూ కొత్తగా కనిపించడానికే ఆయన ట్రై చేస్తుంటాడు. నెక్స్ట్ శివ నిర్వాణ డైరెక్షన్ లో 'ఇరుముడి' సినిమాతో రానున్నాడు. ఈ ప్రాజెక్ట్ తో ఆడియన్స్ కు ఒక సరికొత్త ఎక్స్ పీరియన్స్ ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు. వర్చువల్ వరల్డ్ లో ఫ్యాన్ బేస్ పెంచుకోవడం కంటే సెట్స్ లో కష్టపడి మంచి సినిమా ఇవ్వడానికే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు. కొత్త జనరేషన్ పిల్లలు సోషల్ మీడియా గురించి ఎన్ని ఐడియాలు ఇచ్చినా రవితేజ మాత్రం తన స్టైల్ నే ఫాలో అవుతున్నాడు.