ఫ్లాప్‌ సెంటిమెంట్‌... రవితేజ ఫ్యాన్స్‌ ఆందోళన

రవితేజ హీరోగా వచ్చిన ఖిలాడి సినిమాలో డింపుల్‌ హయతి హీరోయిన్‌గా నటించింది. ఆ సినిమా ఫలితం ఏంటో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.;

Update: 2025-11-05 06:45 GMT

మాస్ మహారాజా రవితేజ కెరీర్‌ పరంగా మరోసారి ఒడిదొడుకులు ఎదుర్కొంటున్నాడు. 2023లో హీరోగా రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు సినిమాలతో వచ్చిన రవితేజ 2024లో ఈగల్‌, మిస్టర్ బచ్చన్ సినిమాలతో వచ్చాడు. ఇక ఈ ఏడాది ఇటీవలే మాస్ జాతర సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ ఏడాదిలోనూ రెండు సినిమాలను విడుదల చేయాలి అనుకున్న రవితేజకు బ్రేక్ పడింది. ఆయన మాస్ జాతర, అంతకు ముందు వచ్చిన నాలుగు సినిమాలు బాక్సాఫీస్ వద్ద తీవ్రంగా నిరాశ పరిచాయి. అభిమానులను సైతం మినిమం మెప్పించలేక పోయాయి. దాంతో రవితేజ తదుపరి సినిమా విషయంలో అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కిషోర్ తిరుమల దర్శకత్వంలో రూపొందుతున్న రవితేజ కొత్త సినిమా RT 76 షూటింగ్‌ ముగింపు దశకు చేరుకుంది. వచ్చే ఏడాది సంక్రాంతికే సినిమా వస్తుందని కూడా అంటున్నారు.




 


రవితేజ మూవీ RT 76 షూటింగ్‌ అప్‌డేట్‌..

రవితేజ RT 76 సినిమాలో హీరోయిన్‌గా ఆషికా రంగనాథ్‌ నటిస్తున్న విషయం తెల్సిందే. రవితేజ మార్క్ మాస్ ఎంటర్‌టైన్‌మెంట్‌ను దర్శకుడు కిషోర్ తిరుమల ప్లాన్‌ చేస్తున్నాడని, అందుకు తగ్గట్లుగానే స్క్రీన్‌ప్లే ఉంటుందని, కథ కూడా మాస్ ఆడియన్స్‌కు మెప్పించే విధంగా ఉంటుందని యూనిట్‌ సభ్యులు అంటున్నారు. మాస్ ఆడియన్స్‌ను మెప్పించాలి అంటే సినిమాలో కచ్చితంగా ఐటెం సాంగ్‌ ఉండాల్సిందే. అందుకే ఈ సినిమాలో ఒక ఐటెం సాంగ్‌ను ప్లాన్ చేశారు. ఆ ఐటెం సాంగ్‌లో డింపుల్‌ హయతి కనిపించబోతుంది. ఐటెం సాంగ్‌కు సంబంధించిన షూటింగ్‌ ఇప్పటికే ప్రారంభం అయింది. ఆ విషయాన్ని స్వయంగా హీరోయిన్‌ డింపుల్‌ హయతి సోషల్‌ మీడియా ద్వారా ఒక ఫోటోను షేర్‌ చేయడం ద్వారా చెప్పకనే చెప్పింది. రవితేజ మరోసారి ఈమెతో కలిసి స్టెప్స్ వేయడంను ఫ్యాన్స్‌ జీర్ణించుకోవడం లేదు.

ఖిలాడి హీరోయిన్‌ డింపుల్‌ హయతి

రవితేజ హీరోగా వచ్చిన ఖిలాడి సినిమాలో డింపుల్‌ హయతి హీరోయిన్‌గా నటించింది. ఆ సినిమా ఫలితం ఏంటో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ సినిమాలోని డింపుల్‌ హయతి యొక్క పాత్ర విషయంలోనూ విమర్శలు వచ్చాయి. అందుకే ఖిలాడి సినిమాలో డింపుల్‌ హయతిని కాకుండా మరో హీరోయిన్‌ను నటింపజేసి ఉంటే బాగుండేది అంటూ చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సోషల్‌ మీడియాలో డింపుల్‌ హయతిని ట్రోల్‌ చేసే వారు చాలా మంది ఉన్నారు. ఆమె ఈ మధ్య కాలంలో చేసిన సినిమాల్లో ఏ ఒక్కటి మినిమం సక్సెస్‌ కాలేదు. అందుకే రవితేజ అభిమానులు RT 76 సినిమాలో ఆమెను ఎంపిక చేయడంను తప్పుబడుతూ సోషల్‌ మీడియా ద్వారా దర్శకుడు కిషోర్‌ తిరుమలతో పాటు ఇతర యూనిట్‌ సభ్యులను సున్నితంగా విమర్శిస్తూ కామెంట్స్ చేస్తున్నారు.

కిషోర్‌ తిరుమల దర్శకత్వంలో..

డింపుల్‌ హయతి ఈ సినిమాలో పాటకే పరిమితం అయ్యి ఉంటుందని చాలా మంది భావిస్తున్నారు. షూటింగ్‌ ముగింపు దశకు వచ్చిన తర్వాత ఆమె పాట చిత్రీకరణకు జాయిన్‌ అయింది. అందుకే ఆమెకు హీరోయిన్‌గా నటించే అవకాశం లేదని అంటున్నారు. సినిమాలో ఇద్దరు హీరోయిన్స్‌కి స్కోప్‌ ఉందా అనే చర్చ జరుగుతోంది. మొత్తానికి రవితేజ హీరోగా రాబోతున్న RT 76 సినిమాలో మరో హీరోయిన్‌గా డింపుల్‌ హయతి నటిస్తున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో అభిమానులు బ్యాడ్‌ సెంటిమెంట్‌ అంటూ, ఫ్లాప్‌ సెంటిమెంట్‌ అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే రవితేజ మాత్రం అవన్నీ ఏమీ పట్టించుకోకుండా దర్శకుడి ఎంపికను గౌరవిస్తూ ఆమెతో ఇప్పటికే ఒక పాటను పూర్తి చేశాడు. ఆమెతో గతంలో వచ్చిన పాట బాగానే ఉంది, కనుక ఈ పాట కూడా హిట్‌ అయ్యే అవకాశాలు ఉన్నాయి అనేది కొందరి అభిప్రాయం. మరి ఫ్లాప్‌ సెంటిమెంట్‌ RT 76 సినిమాకు ఏమైనా డ్యామేజ్ చేస్తుందా అనేది చూడాలి.

Tags:    

Similar News