ఓటీటీ ఎంట్రీకి రెడీ అంటోన్న మరో హీరో
ఇప్పుడు ఎక్కడ చూసినా ఓటీటీల హవానే నడుస్తుంది. ఆల్రెడీ బాలీవుడ్, టాలీవుడ్ లోని బడా స్టార్లు కూడా డిజిటల్ ప్లాట్‌ఫామ్ లో సినిమాలు, సిరీస్‌లు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు.;
ఇప్పుడు ఎక్కడ చూసినా ఓటీటీల హవానే నడుస్తుంది. ఆల్రెడీ బాలీవుడ్, టాలీవుడ్ లోని బడా స్టార్లు కూడా డిజిటల్ ప్లాట్‌ఫామ్ లో సినిమాలు, సిరీస్‌లు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అవేవీ కుదరకపోతే రియాలిటీ షో లు చేయడానికి కూడా రెడీ అవుతున్నారు. ఓటీటీ కంటెంట్ కు ఆడియన్స్ అలవాటు పడటాన్ని గమనించిన స్టార్లు తాము కూడా ఆ దారిలోకే వెళ్లడానికి సిద్ధపడుతున్నారు.
ఆల్రెడీ ఓటీటీ ఎంట్రీ ఇచ్చిన బడా స్టార్లు
అందుకే స్టార్‌డమ్ తో సంబంధం లేకుండా ప్రతీ ఒక్కరూ ఓటీటీలో సినిమాలు, సిరీస్‌లు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. మన టాలీవుడ్ లో కూడా గత కొంతకాలంగా ఓటీటీ కంటెంట్ కు చాలా డిమాండ్ పెరిగింది. అందుకే స్టార్లు సైతం డిజిటల్ ఎంట్రీ ఇస్తూ ట్రెండ్ ను ఫాలో అవుతున్నారు. ఇప్పటికే బాలకృష్ణ, వెంకటేష్, జగపతి బాబు లాంటి సీనియర్ హీరోలు ఏదొక రకంగా ఓటీటీ ఎంట్రీ ఇచ్చి ఆడియన్స్ కు దగ్గరవుతుండగా, మెగాస్టార్ చిరంజీవి కూడా మంచి పాత్ర లభిస్తే ఓటీటీలో నటించడానికి తనకెలాంటి అభ్యంతరం లేదని చెప్పారు.
మంచి కంటెంట్ వస్తే రెడీ
అయితే ఇప్పుడు మరో హీరో ఓటీటీలో నటించడానికి తనకు ఎలాంటి సమస్యా లేదని, మంచి కంటెంట్ వస్తే ఓటీటీలో చేయడానికి తాను రెడీ అని చెప్తున్నారు. ఆ హీరో మరెవరో కాదు, మాస్ మహారాజా రవితేజ. మాస్ జాతర ప్రమోషన్స్ లో ఓ ఇంటర్వ్యూలో భాగంగా డైరెక్టర్ భాను భోగవరపు, రవితేజను ఉద్దేశించి మీరు ఓటీటీలో ఉండే ప్రతీ కంటెంట్ ను కవర్ చేస్తారని, మిమ్మల్ని ఓటీటీ సిరీస్‌లు, సినిమాల్లో ఎక్స్‌పెక్ట్ చేయొచ్చా అని అడిగారు.
దానికి రవితేజ సమాధానమిస్తూ, కచ్ఛితంగా చేయొచ్చు. తాను దేనికైనా రెడీ అని, మంచి కంటెంట్ వస్తే తప్పకుండా చేస్తానని చెప్పారు. రవితేజ ఈ మాట చెప్పడంతో ఆయన ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. కేవలం థియేటర్లలోనే కాకుండా ఓటీటీలో కూడా తమ హీరో సినిమాలు, సిరీస్ లు చేస్తే బావుంటుందని అభిప్రాయపడుతున్నారు. మరి రవితేజను మంచి కంటెంట్ తో ఎవరు మెప్పిస్తారో చూడాలి. ఇక సినిమాల విషయానికొస్తే అక్టోబర్ 31న మాస్ జాతరతో ప్రేక్షకుల ముందుకు రానున్న రవితేజ, సంక్రాంతికి కిషోర్ తిరుమల సినిమాతో ఆడియన్స్ ను పలకరించనున్నారు. వాటి తర్వాత సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రవితేజ సినిమా చేస్తారని వార్తలొస్తున్నాయి. కానీ దీనికి సంబంధించి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటనా రాలేదు.