అభిమానులను చికాకు పెట్టాను.. ఒప్పుకున్న మాస్ రాజా
మాస్ మహారాజ్ రవితేజ నటించిన చివరి కొన్ని సినిమాలు ఆశించిన విజయాలను సాధించలేదు.;
మాస్ మహారాజ్ రవితేజ నటించిన చివరి కొన్ని సినిమాలు ఆశించిన విజయాలను సాధించలేదు. రొటీన్ కంటెంట్ తో అభిమానులను తీవ్రంగా నిరాశపరిచిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు రవితేజ తన తప్పును ఒప్పుకున్నాడు. నా చివరి సినిమాలతో అభిమానులను చికాకు పెట్టానని నిజాయితీగా అంగీకరించారు. అంతేకాదు.. మాస్ జాతర చిత్రంతో ఇది తిరిగి రిపీట్ కాదని ప్రామిస్ చేసారు. మీరు తప్పకుండా ఈ సినిమాని థియేటర్లలో ఆస్వాధిస్తారని కూడా అన్నారు.
వేదికపై అతిథిగా పాల్గొన్న సూర్య గురించి రవితేజ మాట్లాడుతూ.. సూర్యను తాను అరుదుగా కలుస్తుంటానని, కానీ కలిసిన ప్రతిసారీ ఆప్యాయత అభిమానం మా మధ్య ఉంటుందని అన్నారు. మాస్ జాతర విజయోత్సవ సభలో మళ్లీ కలుసుకుందామని కూడా అభిమానులనుద్ధేశించి మాట్లాడారు.
ఇక ఇదే వేదికపై నిర్మాత నాగవంశీ మాట్లాడుతూ.. రవితేజ నటించిన బ్లాక్ బస్టర్ చిత్రాలు వెంకీ, కిక్, విక్రమార్కుడు తరహాలో `మాస్ జాతర`లోను ఆయన నుంచి ఆశించే అన్ని అంశాలు ఉన్నాయని ప్రామిస్ చేసారు. ఈనెల 31న విడుదలకు సిద్ధమవుతున్న ఈ చిత్రాన్ని థియేటర్లలో చూసి ఆస్వాధించాలని కూడా కోరారు.
మంగళవారం సాయంత్రం మాస్ జాతర ప్రీరిలీజ్ వేడుకలో అతిథిగా పాల్గొన్న స్టార్ హీరో సూర్య చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు. రవితేజతో తన స్నేహానుబంధం గురించి ప్రస్థావించారు. మాస్ జాతరలో శ్రీలీల కథానాయిక. రాజేంద్ర ప్రాసద్ ఒక ముఖ్యమైన పాత్రను పోషించారు. భాను భోగవరపు దర్శకత్వం వహించారు. భాగస్వాములతో కలిసి నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రీరిలీజ్ వేడుకలో సంగీత దర్శకుడు భీమ్స్ సహా చిత్రబృందం పాల్గొంది.