ర‌వితేజ సినిమాలైతే లైన్ లో పెడుతున్నాడు కానీ..?

టాలీవుడ్ లో స‌క్సెస్, ఫెయిల్యూర్ల‌తో సంబంధం లేకుండా వ‌రుస పెట్టి సినిమాలు చేసుకుంటూ వెళ్లే హీరోల్లో మాస్ మ‌హారాజ్ ర‌వితేజ ఒక‌రు.;

Update: 2025-09-05 15:30 GMT

టాలీవుడ్ లో స‌క్సెస్, ఫెయిల్యూర్ల‌తో సంబంధం లేకుండా వ‌రుస పెట్టి సినిమాలు చేసుకుంటూ వెళ్లే హీరోల్లో మాస్ మ‌హారాజ్ ర‌వితేజ ఒక‌రు. ప్ర‌స్తుతం ర‌వితేజ చేతిలో రెండు సినిమాలుండ‌గా ఆ రెండు సినిమాల ప‌నుల్లో ర‌వితేజ చాలా బిజీగా ఉన్నారు. అందులో ఒక‌టి భాను భోగ‌వ‌ర‌పు ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన మాస్ జాత‌ర కాగా, రెండోది కిషోర్ తిరుమ‌ల ద‌ర్శ‌కత్వంలోని సినిమా.

అక్టోబ‌ర్ లో మాస్ జాత‌ర‌

ఈ రెండింట్లో మాస్ జాత‌ర షూటింగ్ ఆల్మోస్ట్ పూర్తైపోయింది. చిన్న చిన్న ప్యాచ్ వ‌ర్క్ మిన‌హా సినిమా అయిపోయిన‌ట్టే. వాస్త‌వానికి ఆగ‌స్ట్ నెలాఖరునే మాస్ జాత‌ర రావాల్సింది కానీ కొన్ని కార‌ణాల వ‌ల్ల ఆ సినిమాను వాయిదా వేశారు. ఈ నెలలో వ‌చ్చే సూచ‌న‌లు క‌నిపించ‌డం లేదు. ఇక మాస్ జాత‌ర వ‌చ్చేది అక్టోబ‌ర్ లోనే అని అంద‌రూ ఫిక్సైపోతున్నారు.

కాక‌పోతే నిర్మాత‌లు ఇంకా ఆ విష‌యంలో ఏ నిర్ణ‌యాన్ని తీసుకోలేద‌ని టాక్. రీసెంట్ గా మాస్ జాత‌ర‌ను చూసి నిర్మాత నాగ‌వంశీ శాటిస్‌ఫై అయ్యార‌ని, సినిమా త‌ప్ప‌కుండా ఆడియన్స్ కు న‌చ్చుతుంద‌ని అత‌ని స‌న్నిహిత వ‌ర్గాల‌తో చెప్పార‌ని టాక్ వినిపిస్తుంది. ఇక కిషోర్ తిరుమల సినిమా విష‌యానికొస్తే ఆ సినిమాను వ‌చ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేస్తామ‌ని ముందే అనౌన్స్ చేశారు నిర్మాత‌లు. కానీ ఇప్పుడు పోటీ ఎక్కువైన నేప‌థ్యంలో ఈ సినిమా కూడా వాయిదా ప‌డినా ఆశ్చ‌ర్య‌పోన‌క్క‌ర్లేదంటున్నారు.

మ్యాడ్ డైరెక్ట‌ర్ తో ర‌వితేజ‌77వ సినిమా

ఇక ఈ రెండు సినిమాలూ కాకుండా ర‌వితేజ, మ్యాడ్ ఫేమ్ క‌ళ్యాణ్ శంక‌ర్ ద‌ర్శ‌కత్వంలో ఓ సూప‌ర్ హీరో సినిమాను లాక్ చేసుకోగా ఆ ప్రాజెక్టును కూడా సితార బ్యాన‌ర్ లో నాగ‌వంశీనే నిర్మించ‌నున్నారు. తాజాగా ఈ సినిమా గురించి ఓ అప్డేట్ వినిపిస్తోంది. కింగ్‌డ‌మ్, వార్2 డిస్ట్రిబ్యూష‌న్ తో బాగా న‌ష్ట‌పోయిన వంశీ, ర‌వితేజ సినిమాకు అయ్యే బ‌డ్జెట్ విష‌యంలో మ‌రోసారి ఆలోచించాల‌ని డిసైడ‌య్యార‌ట‌. సూప‌ర్ హీరో సినిమా కాబ‌ట్టి బ‌డ్జెట్ ఎక్కువ‌వుతుంద‌ని, థియేట్రిక‌ల్ గా ఈ మూవీ వ‌ర్క‌వుట్ అవుతుందా లేదా అనే దానిపై మ‌రోసారి ఆలోచించి డెసిష‌న్ తీసుకుందామ‌ని చూస్తున్నార‌ని, అందుకే ర‌వితేజ77 మూవీ అనుకున్న దాని కంటే లేట‌వుతుంద‌ని అంటున్నారు. నిర్మాణంలోకి దిగిన‌ త‌ర్వాత ఆలోచించుకునే దానికంటే కాస్త లేటైనా ముందే టైమ్ తీసుకుని ఏదొక డెసిష‌న్ తీసుకుంటే బెట‌ర్ అని నాగ‌వంశీ భావిస్తున్నార‌ట‌. ఏదేమైనా ర‌వితేజ వ‌రుస‌గా సినిమాల‌నైతే లైన్ లో పెడుతున్నారు కానీ వాటిని అనుకున్న టైమ్ కు రిలీజ్ చేయ‌డంలో మాత్రం ఇబ్బంది ప‌డుతూనే ఉన్నారు.

Tags:    

Similar News