రవితేజ అనార్కలి లో వాళ్లిద్దరు ఫిక్సా..?
రవితేజ అనార్కలి లాంటి టైటిల్ తో వస్తున్నాడు అంటే సంథింగ్ స్పెషల్ అంటున్నారు మాస్ రాజా ఫ్యాన్స్. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ నటిస్తారని తెలుస్తుంది.;
మాస్ మహారాజ్ రవితేజ త్వరలో మాస్ జాతరతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. భాను బోగవరపు డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది. సినిమా అవుట్ పుట్ పై టీం అంతా చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఐతే ఈ సినిమా తర్వాత రవితేజ కిషోర్ తిరుమల డైరెక్షన్ లో సినిమా ఫిక్స్ చేసుకున్నాడు. సుధార్క్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమాకు అనార్కలి అనే టైటిల్ పెట్టబోతున్నారని ఫిల్మ్ నగర్ టాక్.
రవితేజ అనార్కలి లాంటి టైటిల్ తో వస్తున్నాడు అంటే సంథింగ్ స్పెషల్ అంటున్నారు మాస్ రాజా ఫ్యాన్స్. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ నటిస్తారని తెలుస్తుంది. ఐతే ఆ ఇద్దరు హీరోయిన్స్ కూడా యూత్ ఆడియన్స్ మనసులు గెలిచిన కయదు లోహర్, మమితా బైజు అని చెబుతున్నారు. డ్రాగన్ సినిమాతో కయదు యువత మన్సులు దోచేసింది. ఆ సినిమాలో అమ్మడి ఎంట్రీ లేట్ అయిన ఆడియన్స్ మాత్రం ఆమెకు హృదయాలను రాసిచ్చేశారు.
డ్రాగన్ సినిమాతో కయదు క్రేజ్ పెరిగింది. తెలుగు నుంచి కూడా క్రేజీ ఆఫర్స్ వస్తున్నాయి. రవితేజ అనార్కలిలో కయదు ఒక హీరోయిన్ గా అయితే మాత్రం పండగ అన్నట్టే లెక్క. ఇక మరో భామ మమితా కూడా ప్రేమలుతో యూత్ ని మెప్పించింది. తన క్యూట్ లుక్స్ కి బౌల్డ్ అయిన కుర్రాళ్లు ఎంతోమంది ఉన్నారు. మమితా తెలుగు ఎంట్రీ కోసం మన ఆడియన్స్ ఈగర్ గా ఉన్నారు. ఐతే ఆల్రెడీ సూర్య వెంకీ సినిమాలో ఛాన్స్ పట్టేసిన అమ్మడు రవితేజతో కూడా కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటుందని తెలుస్తుంది.
రవితేజ అనార్కలిలో కయదు, మమితా హీరోయిన్స్ గా నటించడం కన్ ఫర్మ్ అయితే మాత్రం సినిమాకు సూపర్ బజ్ వస్తుందని చెప్పొచ్చు. ఇద్దరు ముద్దుగుమ్మలు ఉన్నారు కాబట్టి సినిమాలో ఏమాత్రం విషయం ఉన్నా పక్కా సూపర్ హిట్ అనేస్తున్నారు మాస్ మహారాజ్ ఫ్యాన్స్. మరి రవితేజ అనార్కలి ఏం చేస్తుందో చూడాలి. మాస్ జాతర సినిమా ఓ పక్క జరుగుతున్నా ఈమధ్యనే కిషోర్ తిరుమల సినిమా సెట్స్ మీదకు తీసుకెళ్లాడు రవితేజ. ఐతే ఈ మూవీ ఫైనల్ కాస్టింగ్ ఎవరన్నది చిత్ర యూనిట్ అఫీషియల్ గా అనౌన్స్ చేస్తే బాగుంటుంది.