• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ‘ఇరుముడి’ జోరు.. రెండో...

‘ఇరుముడి’ జోరు.. రెండో రోజు కూడా తగ్గట్లేదుగా..

| రవితేజ ‘ఇరుముడి’కి మొదటి రోజు వచ్చిన టాక్ బాక్సాఫీస్ దగ్గర బాగానే పని చేస్తోంది. ఓపెనింగ్ డే క్రేజ్‌తో టికెట్ సేల్స్ ఎక్కువగా ఉండటం కామన్.

By - M Prashanth
Update: 2026-08-22 06:11 GMT

రవితేజ ‘ఇరుముడి’కి మొదటి రోజు వచ్చిన టాక్ బాక్సాఫీస్ దగ్గర బాగానే పని చేస్తోంది. ఓపెనింగ్ డే క్రేజ్‌తో టికెట్ సేల్స్ ఎక్కువగా ఉండటం కామన్. అసలు సినిమా పరిస్థితి ఏంటనేది రెండో రోజు నుంచి కాస్త క్లియర్ అవుతుంది. ‘ఇరుముడి’ విషయంలో మాత్రం డే 2లో కూడా బుకింగ్స్ స్పీడ్ తగ్గకపోవడం ఇప్పుడు మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది.

బుక్‌మైషోలో శనివారం ఒక దశలో గంటలోనే 35.42 వేల టికెట్లు బుక్ అయినట్లు కనిపించింది. ప్రస్తుతం వైరల్ అవుతున్న ట్రాకింగ్ లెక్కల ప్రకారం రీజినల్ సినిమాల్లో గంట వ్యవధిలో నమోదైన అత్యధిక టికెట్ సేల్స్ ఇదేనని చెబుతున్నారు. పైగా ఇది మొదటి రోజు కాకుండా డే 2లో రావడం విశేషం. నిన్న ఒక దశలో ‘ఇరుముడి’ 32.5 వేల అవర్లీ బుకింగ్స్ వరకు వెళ్లగా.. ఇప్పుడు ఆ నంబర్ కూడా దాటేసింది.

నిజానికి రవితేజ సినిమాకు ఈ స్థాయి హోల్డ్ చాలా అవసరం. గత కొంతకాలంగా ఆయన సినిమాలకు ఓపెనింగ్స్ వచ్చిన సందర్భాలు ఉన్నా, టాక్ తర్వాత అదే జోరు కొనసాగడం దగ్గరే ఇబ్బంది ఎదురైంది. ‘ఇరుముడి’కి మాత్రం మొదటి షోల నుంచే ఎమోషన్, రవితేజ పర్ఫామెన్స్‌తో పాటు క్లైమాక్స్ గురించి పాజిటివ్ టాక్ రావడం ప్లస్ అయ్యింది. అదే ఇంపాక్ట్ బుకింగ్స్ మీద కనిపిస్తోంది. ముఖ్యంగా వీకెండ్ మొదలవడంతో శనివారం షోలకు డిమాండ్ పెరిగింది.

ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఇది కేవలం ఫస్ట్ డే ఫ్యాన్స్ హంగామాతో వచ్చిన నంబర్ కాదు. రెండో రోజు కూడా గంటకు 35 వేల టికెట్లు అమ్ముడవుతున్నాయంటే కొత్తగా సినిమా చూసేందుకు వస్తున్న ఆడియన్స్ సంఖ్య బాగానే పెరుగుతున్నట్లు అర్థమవుతోంది. అదనపు షోలు, స్క్రీన్స్ పెరిగితే శని, ఆదివారాల్లో ఈ స్పీడ్ ఇంకెంత వరకు వెళ్తుందన్నది చూడాలి. ప్రస్తుతం పోటీగా మరో భారీ సినిమా లేకపోవడం వల్ల మంచి టాక్ మొత్తం ఈ సినిమాకే ఉపయోగపడుతోంది. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ సపోర్ట్ కూడా బాగానే కనిపిస్తోంది.

ఒకప్పుడు ప్రేక్షకులు థియేటర్లకు రావడం తగ్గిందనే మాటలు వినిపించినా.. కంటెంట్ నచ్చితే మాత్రం వాళ్లు వస్తారనే విషయం మళ్లీ కనిపిస్తోంది. ఇప్పుడు ఆదివారం ఈ జోరు ఎక్కడికి వెళ్తుందన్నదే నెక్స్ట్. వీకెండ్ వరకు మంచి బుకింగ్స్ రావడం ఒక లెక్క అయితే, సోమవారం నుంచి అదే హోల్డ్ కనిపించడం మరో లెక్క. ప్రస్తుతం మాత్రం ‘ఇరుముడి’ డే 2 బుకింగ్స్ చూస్తే రవితేజకు చాలా రోజుల తర్వాత బాక్సాఫీస్ దగ్గర కావాల్సిన రన్ మొదలైనట్టే కనిపిస్తోంది.

Tags:    
  • irumudi 
  • raviteja 
  • ravitejamovie 
  • irumudicollections 
  • irumudimovie 
  • ravitejafans 

Similar News

షాహిద్.. సైఫ్‌ హుందాతనానికి బాలీవుడ్ ఫిదా!

2026-11-24 04:18 GMT

చిరకాల ప్రేయసితో ఏడడుగులు వేసిన నటుడు!

2026-11-24 04:18 GMT

సంపత్ నంది కి టాలెంట్ ఉన్నప్పటికీ స్టార్ డైరెక్టర్ అవ్వకపోవడానికి కారణమేంటి..?

2026-11-24 03:56 GMT

క్లిన్ కారాను స్కూల్‌కి వెళ్ల‌మంటే మారాం చేస్తోందా!

2026-11-24 03:50 GMT

'అవెంజ‌ర్స్ డూమ్స్ డే' ఫైన‌ల్ ట్రైల‌ర్: కొత్త వారియ‌ర్ ప్ర‌పంచంలోకి పయ‌నం!

2026-11-24 03:48 GMT

ఈ నటుడికి టాలెంట్ ఉండి కూడా స్టార్ హీరో అవ్వకపోవడానికి కారణమేంటంటే..?

2026-11-24 03:48 GMT

రూ.99 ఆఫ‌ర్‌ : 'రామాయ‌ణ' కాకుండా టాప్-10 సినిమాలు!

2026-11-24 03:47 GMT

నితిన్ మూవీలకి అసిస్టెంట్ డైరెక్టర్‌గా, నిర్మాతగా పనిచేసిన హీరో ఎవరంటే?

2026-11-24 03:47 GMT

ట్రెండీ స్టోరి: విచిత్రంగా పొరుగున ఫేమ‌స్ అయిన స్టార్లు

2026-11-24 00:56 GMT

ఎంత ట్యాలెంట్ చూపించినా రేసులో ఖాళీయే

2026-11-24 00:54 GMT

ఆ టాలీవుడ్ యంగ్ హీరోలకు ట్విట్టర్ పిచ్చి పట్టిందా?

2026-11-24 00:51 GMT

మ‌హేష్ బ‌క్క‌గా అయిపోయార‌ని ఫ్యాన్స్ క‌ల‌త

2026-11-24 00:48 GMT

Copyright @2026

Powered by Blink CMS