భార్యకు నచ్చదని, ఆమె పడుకున్నాక రోజూ ఆ పని చేస్తా
రీసెంట్ గా సన్ ఆఫ్ సర్దార్2 ప్రమోషన్స్ లో భాగంగా ఓ షో లో పాల్గొన్న రవి కిషన్ ఎవరికీ తెలియని ఓ విషయాన్ని బయటపెట్టారు.;
భార్యలకు తెలియకుండా భర్తలు చాలా చేస్తారు. కొందరు తమకు ఉన్న అప్పుల గురించి భార్య దగ్గర దాస్తే, మరికొందరు తమకున్న వ్యసనాలను భార్య ముందు బయటపడకుండా జాగ్రత్త పడతారు. కానీ యాక్టర్ కం పొలిటీషియన్ రవి కిషన్ మాత్రం తన భార్య నిద్రపోయాక ప్రతీరోజూ ఆమె కాళ్లను తాకిన తర్వాతే పడుకుంటానని చెప్తున్నారు.
సినీ ఇండస్ట్రీలో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు రవి కిషన్. తెలుగు ప్రేక్షకులు రవి కిషన్ అని చెప్తే గుర్తుపట్టకపోయినా మద్దాలి శివారెడ్డి అంటే మాత్రం కచ్ఛితంగా గుర్తుపడతారు. రేసుగుర్రం సినిమాలో విలన్ గా నటించి తన యాక్టింగ్ తో ఆడియన్స్ ను మెప్పించిన రవి కిషన్ పలు భాషల్లో నటించారు. ఓ వైపు నటుడిగా ఉంటూనే మరోవైపు రాజకీయాల్లోకి వెళ్లి గతేడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో గోరఖ్‌పూర్ నుంచి ఎంపీగా గెలిచారు.
రీసెంట్ గా సన్ ఆఫ్ సర్దార్2 ప్రమోషన్స్ లో భాగంగా ఓ షో లో పాల్గొన్న రవి కిషన్ ఎవరికీ తెలియని ఓ విషయాన్ని బయటపెట్టారు. తాను ప్రతీ రోజూ తన భార్య పాదాలను తాకిన తర్వాతే నిద్రపోతానని, అలా చేయడం తన భార్యకు ఏ మాత్రం నచ్చదని అందుకే ఆమె నిద్రపోయాక ఆ పని చేస్తానని తెలిపారు రవికిషన్. తన వద్ద పేరు, డబ్బు, పలుకుబడి లేనప్పుడు కూడా తన భార్య తనతోనే నిలబడి, ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొందని, ఇవాళ తాను ఈ స్థాయిలో ఉండటానికి కారణం కూడా ఆమేనని తెలిపారు రవి కిషన్.
ప్రతి ఒక్కరి లైఫ్ లో ఏదొక టైమ్ లో క్లిష్ట పరిస్థితులుంటాయని, అయితే అలాంటి సిట్యుయేషన్స్ లో మన పక్కన నిలబడి మనకు హెల్ప్ చేసే వారిని ఎప్పటికీ మరచిపోకూడదని ఆయన తెలిపారు. తన జీవితంలో ఎన్ని కష్టాలొచ్చినా తన పక్కన తన భార్య నిలబడి ఎంతగానో సపోర్ట్ చేసినట్టు రవికిషన్ చెప్పారు. తనకోసం ఇంత చేసిన ఆమెకు తానేమి ఇవ్వగలను ఇది తప్ప అంటూ మాట్లాడారు రవికిషన్. భార్య పాదాలను తాకి కృతజ్ఞత చెప్పడమే గొప్ప విషయమైతే, దాన్ని ఏ మాత్రం ఈగో లేకుండా అందరి ముందు చెప్పడం ఇంకా గొప్ప విషయమని అందరూ ఆయన్ని ప్రశంసిస్తున్నార. కాగా సన్ ఆఫ్ సర్దార్2 ఆగస్ట్ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది.