తండ్రికి మించిన తనయ.. అగ్నివీర్ గా 'రేసుగుర్రం' నటుడి కూతురు!

సాధారణంగా ఒకరు సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు అంటే ఆయా వ్యక్తులు తమ తదనంతరం తమ వారసులను సినీ పరిశ్రమకు పరిచయం చేయాలి అని ఆసక్తి కనబరిస్తూ ఉంటారు..

Update: 2026-08-11 18:05 GMT

సాధారణంగా ఒకరు సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు అంటే ఆయా వ్యక్తులు తమ తదనంతరం తమ వారసులను సినీ పరిశ్రమకు పరిచయం చేయాలి అని ఆసక్తి కనబరిస్తూ ఉంటారు.. ఇప్పటికే అలా ఎంతోమంది సెలబ్రిటీలు తమ వారసులను ఇండస్ట్రీకి పరిచయం చేసిన విషయం తెలిసిందే. అయితే సెలబ్రిటీలుగా కొనసాగుతున్న ప్రతి ఒక్కరూ తమ వారసులను ఇండస్ట్రీకే పరిచయం చేస్తారా అంటే కాదనే చెప్పాలి. ముఖ్యంగా పిల్లల అభిరుచులను దృష్టిలో పెట్టుకొని, వారి ఆలోచనలకు అనుగుణంగా వ్యవహరించే తల్లిదండ్రులు కూడా లేకపోలేదు.

ఈ క్రమంలోనే ఒక స్టార్ నటుడి కూతురు కూడా ఏకంగా అగ్నివీర్ గా మారి అభిమానుల చేత ప్రశంసలు అందుకుంటోంది. ఆమె ఎవరో కాదు రేసుగుర్రం సినిమాలో విలన్ గా నటించిన రవికిషన్ కూతురు ఇషితా శుక్లా. బాలీవుడ్ నటుడు రవి కిషన్ కుమార్తె ఇషితా శుక్ల ఇండస్ట్రీని కాదని, ఇప్పుడు విభిన్నమైన కెరియర్ను ఎంచుకుంది. ముఖ్యంగా తన తండ్రిలాగా కాకుండా డిఫరెంట్ కెరియర్ ను ఎంచుకొని అగ్నివీర్ గా రక్షణా దళంలోకి చేరింది.

నిజానికి ఇషిత శుక్లాకి చిన్నప్పుడే ఆర్మీలో పని చేయాలన్న కోరిక ఉండేదట. అందులో భాగంగానే సినిమా ఇండస్ట్రీలోకి వెళ్లకుండా నేషనల్ క్యాడెట్ కార్ప్స్ లో చేరారు. ఆ తర్వాత సైనిక శిక్షణ పొందిన ఈమె రక్షణ రంగంలో పనిచేయడానికి సిద్ధమయింది. ఢిల్లీ డైరెక్టరేట్ కు చెందిన 7 గర్ల్స్ బెటాలియన్ లో పనిచేశారు. ఇషిత 2023లో అగ్నివీర్ గా చేరినట్లు తెలుస్తోంది. దీంతో దేశానికి సేవ చేయాలన్న ఆమె నిర్ణయాన్ని అనుపమ్ ఖేర్ తో పాటు పలువురు సినీ ప్రముఖులు కూడా ప్రశంసించారు.

రవి కిషన్ విషయానికి వస్తే.. ఈయనకు ముగ్గురు కుమార్తెలు.. అందులో పెద్దమ్మాయి రీవా కిషన్.. 2020లో విడుదలైన సబ్ కుషల్ మంగళ్ అనే చిత్రం ద్వారా బాలీవుడ్ చిత్ర పరిశ్రమలోకి నటిగా అడుగు పెట్టింది. ఇక ఇషిత శుక్ల రెండవ అమ్మాయి కాగా ..ఈమె అగ్నిపథ్ పథకం కింద అగ్నివీర్ గా భారత సైన్యంలో చేరి గణతంత్ర దినోత్సవ పరేడ్ లో కూడా పాల్గొనింది. మూడవ కుమార్తె తనిష్క కిషన్ . ఈమె తన ఇద్దరు తోబుట్టులతో పోలిస్తే చాలా వరకు గోప్యతను మెయింటైన్ చేస్తూ ఉంటుంది.

రవి కిషన్ విషయానికి వస్తే.. సినిమా నటుడు మాత్రమే కాదు నిర్మాత, రాజకీయ నాయకులు కూడా.. హిందీ , భోజ్ పురి చిత్రాలలో నటించిన ఈయన.. తెలుగు సినిమాలలో కూడా నటించి భారీ పాపులారిటీ అందుకున్నారు. రేసుగుర్రం, సుప్రీమ్ , ఒక అమ్మాయి తప్ప, రాధా, అబద్ధం, ఎమ్మెల్యే, సాక్షి , ఎన్టీఆర్ కథానాయకుడు, సైరా నరసింహారెడ్డి , 90ml, డాకు మహారాజ్, ఈ ఏడాది వచ్చిన పెద్ది సినిమాలో కూడా కీలకపాత్ర పోషించారు. తెలుగు తమిళ్ హిందీ ఇంగ్లీష్ గుజరాతి అంటూ పలు భాషల్లో కూడా పలు చిత్రాలలో నటించిన ఈయన డబ్బింగ్ పాత్రలతో పాటు టెలివిజన్ సీరియల్స్ లో కూడా నటించి మెప్పించారు. అంతేకాదు పలు వెబ్ సిరీస్ లలో కూడా నటించారు.

Tags:    

Similar News