సూర్య కోసం ఆమెను దించుతున్నారు.. వెంకీ పకడ్బందీ ప్లా

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య లీడ్ రోల్ లో వెంకీ అట్లూరి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా సెట్స్ మీద ఉంది.;

Update: 2025-10-27 08:57 GMT

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య లీడ్ రోల్ లో వెంకీ అట్లూరి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా సెట్స్ మీద ఉంది. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో రూపొందుతున్న ఈ సినిమాలో మమితా బైజు హీరోయిన్ గా నటిస్తుంది. ఐతే సినిమాలో బాలీవుడ్ ఒకప్పటి స్టార్ హీరోయిన్ రవీనా టాండన్ నటిస్తున్నట్టు తెలుస్తుంది. రవీనా టాండన్ తెలుగు ఆడియన్స్ కు సుపరిచితురాలే. బాలకృష్ణతో బంగారు బుల్లోడు, నాగార్జునతో ఆకాశవీధిలో సినిమాలు చేసింది రవీనా. అప్పట్లోనే తన గ్లామర్ తో తెలుగు ఆడియన్స్ మనసులు గెలుచుకుంది.

K.G.F 2 లో రవీనా టాండన్..

హీరోయిన్ గా సినిమాలు చేయకపోయినా సినిమాలు, వెబ్ సీరీస్ లతో తన ప్రెజన్స్ తో సర్ ప్రైజ్ చేస్తుంది. యష్, ప్రశాంత్ నీల్ కాంబోలో వచ్చిన కె.జి.ఎఫ్ 2 లో నటించింది రవీనా టాండన్. ఆ తర్వాత బాలీవుడ్ లోనే OTT సీరీస్ లు చేస్తూ వస్తుంది. ఐతే ఇన్నాళ్లకు రవీనా మళ్లీ తెలుగు తెరపై కనిపించబోతుంది. ఈ సినిమాలో ఆమె పాత్ర కూడా ఆడియన్స్ ని సర్ ప్రైజ్ చేస్తుందని అంటున్నారు.

తొలిప్రేమ, సార్, లక్కీ భాస్కర్ సినిమాలతో సక్సెస్ అందుకున్న డైరెక్టర్ వెంకీ అట్లూరి ఈసారి సూర్యతో మరో డిఫరెంట్ కథతో రాబోతున్నారు. ఈ సినిమాలో రాధిక శరత్ కుమార్ కూడా మరో ఇంపార్టెంట్ రోల్ లో నటిస్తున్నారు. సూర్య సినిమాకు ఆయనే ఒక హైలెట్ కాగా మమితా తో పాటు రవీనా, రాధిక శరత్ కుమార్ వీళ్లంతా కూడా సినిమాకు కచ్చితంగా అడ్వాంటేజ్ అవుతారని చెప్పొచ్చు.

సూర్య వెంకీ అట్లూరి కాంబినేషన్ సినిమా..

సూర్య 46వ సినిమాగా వస్తున్న ఈ సినిమాపై ఎక్స్ పెక్టేషన్స్ ఐతే బాగానే ఉన్నాయి. రెట్రో తర్వాత కరుప్పు అంటూ నెక్స్ట్ మంత్ సెకండ్ వీక్ వస్తున్న సూర్య వెంకీ అట్లూరి కాంబినేషన్ సినిమాను నెక్స్ట్ ఇయర్ ఫస్ట్ హాఫ్ లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. మరి ఈ సినిమా విషయంలో అయినా సూర్య ప్లాన్ వర్క్ అవుట్ అవుతుందా లేదా అన్నది చూడాలి. సూర్య సినిమా అంటే తమిళంతో పాటు తెలుగు ఆడియన్స్ లో కూడా క్యూరియాసిటీ ఉంటుంది. ఒక మంచి మాస్ హిట్ తో సూర్య కంబ్యాక్ ఇవ్వాలని అనుకుంటున్నాడు. ఐతే అది ఏ సినిమాతో సాధ్యమవుతుందో చూడాలి.

సార్, లక్కీ భాస్కర్ వెంకీ అట్లూరి రెండు సినిమాలు సితార బ్యానర్ లోనే చేశాడు. ఇప్పుడు సూర్య 46 కూడా ఆ బ్యానర్ లోనే వస్తుంది. మరి ఈ సినిమాతో సితారతో వెంకీ హ్యాట్రిక్ హిట్ కొడతాడా లేదా అన్నది కూడా ఆసక్తికరంగా ఉంది. సూర్య మాత్రం ఈ సినిమాతో మంచి కంబ్యాక్ ఇవ్వాలని చూస్తున్నాడు.

Tags:    

Similar News