హ్యాట్ ధ‌రించిన‌ ర‌ష్మిక క్యూట్ నెస్ ఓవ‌ర్‌లోడెడ్

2016లో కన్నడ చిత్రం కిరిక్ పార్టీలో తొలిసారిగా నటించిన ర‌ష్మిక అప్ప‌ట్లో త‌న హీరో ర‌క్షిత్‌తో ప్రేమ‌, పెళ్లిని కూడా త్యాగం చేసి పూర్తిగా న‌ట‌న‌కే అంకిత‌మైంది.;

Update: 2024-01-14 06:47 GMT

నేష‌న‌ల్ క్ర‌ష్ గా పాపుల‌రైంది రష్మిక మందన్న. ఇంతింతై వ‌టుడింతై సామెత ఈ అమ్మ‌డికి యాప్ట్. ర‌ష్మిక ఎదుగుద‌ల స‌మ‌కాలిక క‌థానాయిక‌లంద‌రికీ ఒక స్ఫూర్తి. 2016లో కన్నడ చిత్రం కిరిక్ పార్టీలో తొలిసారిగా నటించిన ర‌ష్మిక అప్ప‌ట్లో త‌న హీరో ర‌క్షిత్‌తో ప్రేమ‌, పెళ్లిని కూడా త్యాగం చేసి పూర్తిగా న‌ట‌న‌కే అంకిత‌మైంది. అప్పటి నుండి కెరీర్ ప‌రంగా వెనుదిరిగి చూసుకోలేదు. కిరిక్ పార్టీ నుండి గీత గోవిందం, పుష్ప‌, యానిమ‌ల్ వరకు బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌లలో న‌టించింది. ద‌క్షిణాదితో పాటు ఉత్త‌రాది యువ‌త‌ హృదయాలను గెలుచుకుంది. వాస్తవానికి `పుష్ప: ది రైజ్`లో పుష్ప‌రాజ్ ప్రియురాలు శ్రీ‌వ‌ల్లిగా అద్భుత న‌ట‌న‌తో క‌ట్టి ప‌డేసిన ర‌ష్మిక A-లిస్ట‌ర్ స్టార‌ర్ గా మారింది.


అటుపై `గుడ్‌బై` చిత్రంతో హిందీ చిత్ర పరిశ్రమలోకి కూడా ప్రవేశించింది. దీనికి మిశ్రమ స్పందనలు వచ్చాయి.. అయితే ప్రజలు రష్మిక న‌ట‌న‌ను గొప్పగా ప్రశంసించారు. సిద్ధార్థ్ మ‌ల్హోత్రాతో మిష‌న్ మ‌జ్నులోను ర‌ష్మిక న‌ట‌న‌కు గుర్తింపు ద‌క్కింది. గత సంవత్సరం చివరలో సందీప్ రెడ్డి వంగా రణబీర్ కపూర్ కాంబినేష‌న్ మూవీ యానిమ‌ల్ లో రష్మిక మందన్న పాత్ర‌కు గొప్ప ప్ర‌శంస‌లు ద‌క్కాయి. 2023 బెస్ట్ హిట్ చిత్రాల్లో ఒక‌టిగా నిలిచిన యానిమ‌ల్ లో నేష‌న‌ల్ క్ర‌ష్ త‌న పాత్ర‌ను అద్భుతంగా పోషించింది.


ఈ చిత్రం ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. ఈ చిత్రంలో రష్మిక మందన్నా న‌ట‌న‌కు ఆస్కారం ఉన్న పాత్ర‌లో అందరికీ బాగా నచ్చింది. ర‌ష్మిక‌కు భారీగా అభిమానుల ఫాలోయింగ్ ఉంది. కొన్నేళ్లుగా ఈ ఫాలోయింగ్ విస్తృతంగా పెరిగింది.


సోష‌ల్ మీడియాల్లోను ర‌ష్మిక అనుచ‌ర‌గణం అద్వితీయం. ఇన్‌స్టాగ్రామ్‌లో గొప్ప ఫాలోవ‌ర్ల‌ను కలిగి ఉంది, ఈ వేదిక‌పై తన అభిమానుల కోసం తన వ్యక్తిగత వృత్తిపరమైన అంశాలతో అప్‌డేట్ చేస్తుంది. సుమారు 41.1 మిలియన్ల మంది ఫాలోవ‌ర్ల‌ను ర‌ష్మిక కలిగి ఉంది. ఇప్ప‌టికీ ఈ సంఖ్య పెరుగుతూనే ఉంది.

వియ‌త్నాం ప‌ర్య‌ట‌న‌లో..

తాజాగా రష్మిక మందన్న వియత్నాం పర్యటనకు వెళ్లింది. అక్క‌డ తన పర్యటన నుండి కొన్ని అరుదైన ఫోటోలను సోష‌ల్ మీడియాలో త‌న అభిమానుల కోసం షేర్ చేసింది. ముఖ్యంగా ఇందులో శంఖాకార టోపీని ధ‌రించి క‌నిపించింది. ఈ అరుదైన హ్యాట్ తో ప్రేమ‌లో ప‌డిపోయిన ర‌ష్మిక త‌న‌తో పాటే ఇంటికి తీసుకుని వెళుతున్నానని తెలిపింది. వెదురు అల్లిక‌తో కూడుకున్న ఈ అంద‌మైన హ్యాట్ నిజంగా ఎంతో ప్ర‌త్యేకంగా ఉంది. పుష్ప 2 లో మ‌ళ్లీ శ్రీ‌వ‌ల్లిగా క‌నిపించ‌నున్న ర‌ష్మిక షార్ట్ గ్యాప్ లో విదేశీ విహార‌యాత్ర‌ల‌ను ఆస్వాధిస్తోంది. తాజా ఫోటోగ్రాఫ్ లో ర‌ష్మిక క్యూట్ నెస్ ఓవ‌ర్‌లోడెడ్ అంటూ అభిమానులు కితాబిచ్చేస్తున్నారు.

Tags:    

Similar News