రష్మిక.. ఇది మైండ్ బ్లోయింగ్ కాంబినేషన్

త్వరలోనే మోస్ట్ అవైటెడ్ మూవీ పుష్ప-2లో శ్రీవల్లిగా మరోసారి అలరించనుంది రష్మిక.

Update: 2024-05-09 07:41 GMT

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప మూవీతో నేషనల్ క్రష్ గా మారిపోయిన హీరోయిన్ రష్మిక మందన్న.. ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీగా ఉంది. వరుస అవకాశాలు దక్కించుకుంటూ దూసుకుపోతోంది. చివరగా సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన యానిమల్ సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈ మూవీలో గీతాంజలి పాత్రలో కనిపించి విమర్శకుల నుంచి ప్రశంసలు కూడా దక్కించుకుంది.

త్వరలోనే మోస్ట్ అవైటెడ్ మూవీ పుష్ప-2లో శ్రీవల్లిగా మరోసారి అలరించనుంది రష్మిక. ఈ సినిమాతో పాటు శేఖర్ కమ్ముల తీస్తున్న మల్టీస్టారర్ కుబేరా సినిమాలో నటిస్తోంది. రెయిన్ బో, గర్ల్ ఫ్రెండ్ వంటి లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు కూడా చేస్తోంది. తాజాగా మరో బంపర్ ఆఫర్ అందుకుంది రష్మిక. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ తో నటించే ఛాన్స్ కొట్టేసింది. ఈ విషయాన్ని ఆమెతో పాటు మేకర్స్ సోషల్ మీడియాలో ప్రకటించారు.

సల్మాన్ ఖాన్ హీరోగా దక్షిణాది ప్రముఖ దర్శకుడు ఏఆర్ మురుగదాస్ సికిందర్ సినిమా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీలోనే రష్మిక హీరోయిన్ గా ఎంపికైంది. ''మా మూవీ యూనిట్ లోకి రష్మికను స్వాగతిస్తున్నాం. సికిందర్ లో సల్మాన్ ఖాన్ సరసన ఆమె యాక్ట్ చేస్తున్నారు'' అని నడియాడ్ వాలా గ్రాండ్ సన్ ఎంటర్టైన్మెంట్ సంస్థ ట్వీట్ చేసింది.

ఇక రష్మిక మందన్న కూడా ట్వీట్ చేసింది. ''మీరు ఎన్నో రోజులుగా నా సినిమా అప్డేట్స్ కోసం ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. మీకోసమే ఈ సర్పైజ్. సికిందర్‌ సినిమాతో మీ ముందుకు వస్తున్నాను. ఇంత గొప్ప ప్రాజెక్టులో యాక్ట్ చేసే ఛాన్స్ రావడం ఎంతో ఆనందంగా, గౌరవంగా ఉంది'' అని రష్మిక తన హ్యాపీనెస్ ను షేర్ చేసుకుంది. అయితే ఈ బ్యూటీకి సికిందర్ సినిమా.. 25వ చిత్రం కావడం విశేషం.

Read more!

ఈ సినిమాను వచ్చే రంజాన్ కు రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు. అయితే ఏటా రంజాన్ ఫెస్టివల్ కు సల్మాన్ సినిమాలకు సంబంధించిన ఏదో ఒక అప్డేట్ వస్తుంటుంది. ఇప్పుడు సికిందర్ మూవీ 2025 ఈద్ కు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి ప్రీతమ్ సింగ్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఎమోషన్స్ తో కూడిన యాక్షన్ ఫిల్మ్ గా సికిందర్ ఉండనున్నట్లు తెలుస్తోంది. మరి ఈ మూవీ ఎలాంటి హిట్ అవుతుందో వేచి చూడాలి.

Tags:    

Similar News