• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  పుష్ప 2.. ఆమెకు పెద్ద...

పుష్ప 2.. ఆమెకు పెద్ద తలనొప్పి!

| ఎందుకంటే బాలీవుడ్ లో విక్కీ కౌశల్ తో కలిసి ఆమె చేస్తున్న చావా మూవీ అదే డేట్ న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది.

By - Tupaki Desk
Update: 2024-06-18 09:54 GMT

కన్నడ బ్యూటీ రష్మిక మందన్న.. పుష్ప మూవీతో పాన్ ఇండియా లెవెల్ లో క్రేజ్ సంపాదించుకున్న విషయం తెలిసిందే. శ్రీవల్లిగా అందరినీ మెప్పించి వేరే లెవెల్ లో పాపులారిటీ దక్కించుకుంది. నేషనల్ క్రష్ గా మారిపోయింది. ఆ తర్వాత వరుస అవకాశాలు అందుకుని నార్త్ టు సౌత్ అనేక సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది. తనదైన అందం, అభినయంతో అలరిస్తోంది. నాన్ స్టాప్ గా షూటింగ్స్ లో పాల్గొంటోంది అమ్మడు.

ఇక ప్రస్తుతం ఆమె పుష్ప-2లో శ్రీవల్లి 2.0గా నటిస్తోంది. ఇప్పటికే రిలీజ్ చేసిన ఆమె ఫస్ట్ లుక్ తోపాటు సూసేకి సాంగ్ మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. ఇంతలో సినిమా రిలీజ్ ను వాయిదా వేస్తూ మేకర్స్ అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. ఇంకా షూటింగ్ పూర్తవ్వకపోవడమే పోస్ట్ పోన్ కు కారణమని మేకర్స్ తెలిపారు. మంచి క్వాలిటీతో ఔట్ పుట్ ఇవ్వడమే తమ టార్గెట్ అని చెప్పారు. బన్నీ స్పెషల్ పోస్టర్ ను షేర్ చేశారు.

డిసెంబర్ 6వ తేదీన సినిమాను రిలీజ్ చేయనున్నట్లు కూడా వెల్లడించారు. అయితే అదే ఇప్పుడు రష్మికకు పెద్ద తలనొప్పిగా మారింది. ఎందుకంటే బాలీవుడ్ లో విక్కీ కౌశల్ తో కలిసి ఆమె చేస్తున్న చావా మూవీ అదే డేట్ న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. దీంతో నేషనల్ క్రష్.. పుష్ప పోస్ట్ పోన్ విషయం పట్ల డిస్సపాయింట్ అయినట్లు తెలుస్తోంది. చావా మూవీ కూడా ఇప్పుడు వాయిదా పడుతుందని అంటున్నారు.

బ్లాక్ బస్టర్ హిట్ మూవీలు తీసిన లక్ష్మణ్ ఉటేకర్ తెరకెక్కిస్తున్న చావా మూవీ.. ఛత్రపతి శివాజీ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతోంది. మహారాష్ట్రలో శివాజీకి స్పెషల్ అభిమానులు ఉన్నారు. దీంతో ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. అందుకే పుష్ప, చావా ఒకేసారి విడుదలైతే.. బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద పెద్ద క్లాష్ జరుగుతోంది. రెండు సినిమాల వసూళ్లపై కూడా ఎఫెక్ట్ పడుతుంది. కాబట్టి క్లాష్ జరగడం మంచిది కాదు.

మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న పుష్ప-2 మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.1000 కోట్ల సాధించే లక్ష్యంగా రిలీజ్ అవుతుంది. కాబట్టి చావా విడుదల విషయంలో మేకర్స్ దే తుది నిర్ణయం. బాక్సాఫీస్ వద్ద పుష్ప 2తో నేరుగా పోటీ పడడం కన్నా పోస్ట్ పోన్ చేయడమే బెటర్ అని సినీ పండితులు చెబుతున్నారు. వచ్చే ఏడాది జనవరిలో గణతంత్ర దినోత్సవం సందర్భంగా రిలీజ్ చేస్తే అన్నీ కలిసి వస్తాయని అంటున్నారు. మరేం జరుగుతుందో వేచి చూడాలి.

Tags:    
  • Rashmikamandanna 
  • Pushpatherule2 
  • Alluarjun 
  • Sukmar 
  • Mythrimoviemakers 
  • Srivalli 
  • Chava 
  • Vickykaushal 

Similar News

ఫ్లాపుల తర్వాత రామ్ మాస్టర్ ప్లాన్.. 2027లో రెండు సినిమాల రిలీజ్‌కు రెడీ!

2026-11-06 06:30 GMT

సూర్యకు మళ్లీ 30 కోట్ల టార్గెట్

2026-11-06 05:49 GMT

కాజల్‌కు ఈ పార్ట్ 2 కష్టాలేంటి!

2026-11-06 05:49 GMT

కన్నుగీటుతూ కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టిస్తున్న జాన్వీ కపూర్!

2026-11-06 05:45 GMT

భారీ బడ్జెట్ అంటే ఈ రెండు బ్యానర్లే గుర్తొస్తున్నాయా!

2026-11-06 05:06 GMT

రామాయణం కలెక్షన్స్.. ఓపెనింగ్స్ ఓకే కానీ!

2026-11-06 05:05 GMT

వారణాసి: ఇక స్ట్రాంగ్‌గా మొదలవ్వాలి!

2026-11-06 05:03 GMT

ఆదిపురుష్, రామాయణం.. తేడా అక్కడే కనిపించింది!

2026-11-06 04:06 GMT

స్టార్ హీరో బిగ్ మిస్టేక్.. అందుకే ర‌చ‌యిత‌లు అల‌క‌బూనారా?

2026-11-06 03:57 GMT

సౌత్ సినిమాలో చ‌రిత్ర సృష్టించిన‌ టాప్ -4 సౌండ్ ఇంజినీర్లు

2026-11-06 03:56 GMT

'రాప్తాడు ఘటన'కు సినిమాలను నిందించడం సరికాదు!

2026-11-06 03:55 GMT

నేను అంత అందంగా లేను.. ఈ స్వ‌చ్ఛ‌తే సీత పాత్ర‌కు ఔచిత్యం!

2026-11-06 03:53 GMT

Copyright @2026

Powered by Blink CMS