రష్మిక 'ది గర్ల్‌ఫ్రెండ్' మేనియా.. పెరుగుతున్న వసూళ్లు!
ఇక రీసెంట్ గా ఆమె ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ 'ది గర్ల్‌ఫ్రెండ్' కూడా మంచి టాక్ ని సొంతం చేసుకుంది.;
'నేషనల్ క్రష్' రష్మిక మందన్న ఈమధ్య కాలంలో బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో బాక్సాఫీస్ వద్ద మంచి ఫలితాలను అందుకుంటున్న విషయం తెలిసిందే. పుష్పతో శ్రీవల్లి గా పాన్ ఇండియా క్రేజ్ ని అందుకున్న ఆమె అ తరువాత ఆనిమల్, ఛావా సినిమాలతో మరింత గుర్తింపు అందుకుంది. ఇక రీసెంట్ గా ఆమె ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ 'ది గర్ల్‌ఫ్రెండ్' కూడా మంచి టాక్ ని సొంతం చేసుకుంది.
రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాపై ముందు నుంచీ మంచి అంచనాలు ఉన్నాయి. దీక్షిత్ శెట్టి హీరోగా నటించిన ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ (అల్లు అరవింద్) సమర్పించడం, హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందించడంతో సినిమాకు పాజిటివ్ వైబ్ క్రియేట్ అయింది.
ఈ నెల 7వ తేదీన థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు దక్కాయి. ఇది కేవలం రొటీన్ ప్రేమకథ కాకుండా, ఒక బలమైన సందేశంతో కూడిన "ఇంటెన్స్ రిలేషన్‌షిప్ డ్రామా" కావడంతో ఆడియన్స్‌కు బాగా కనెక్ట్ అయింది.
విడుదలైన రోజు నుంచి బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా మంచి వసూళ్లను రాబడుతోంది. లేటెస్ట్ గా, 'ది గర్ల్‌ఫ్రెండ్' టీమ్ తమ సినిమా గ్లోబల్ కలెక్షన్ల వివరాలను అధికారికంగా ప్రకటించింది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు రూ.28.2 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసినట్లు వెల్లడించారు.
కేవలం స్వదేశంలోనే కాదు, అంతర్జాతీయ మార్కెట్‌లోనూ ఈ సినిమా మంచి రెస్పాన్స్ ని అందుకుంది. ముఖ్యంగా నార్త్ అమెరికా మార్కెట్‌లో 'ది గర్ల్‌ఫ్రెండ్' సత్తా చాటింది. అక్కడ ఈ సినిమా ఇప్పటికే 650K డాలర్ల మార్క్ ని దాటింది. ఇది ఈ జానర్ సినిమాకు మంచి నంబర్‌గానే ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.
ఈ వసూళ్లకు ప్రధాన కారణం రష్మికకు ఉన్న తిరుగులేని స్టార్ పవర్ అని చెప్పాలి. దానికి తోడు, రాహుల్ రవీంద్రన్ రాసుకున్న ఆకట్టుకునే కథనం కూడా ప్లస్ అయింది. అల్లు అరవింద్ సమర్పణలో, గీతా ఆర్ట్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లపై ఈ చిత్రాన్ని ధీరజ్ మొగిలినేని, విద్యా కొప్పినీడి నిర్మించారు. పాజిటివ్ టాక్‌తో మొదలైన 'ది గర్ల్‌ఫ్రెండ్', లాంగ్ రన్‌లో ఇంకెంత వసూలు చేస్తుందో చూడాలి.