కోట్లు సంపాదిస్తున్నా ర‌ష్మికాకి దొర‌క‌ని సంతృప్తి!

నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మికా మంద‌న్నా కెరీర్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. జెట్ స్పీడ్ తో టాలీవుడ్..బాలీవుడ్ లో దూసుకుపోతుంది.;

Update: 2025-09-06 06:57 GMT

నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మికా మంద‌న్నా కెరీర్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. జెట్ స్పీడ్ తో టాలీవుడ్..బాలీవుడ్ లో దూసుకుపోతుంది. అవ‌కాశాల‌తో బిజీగా ఉంది. కోట్ల రూపాయ‌లు పారితోషికం అందుకుంటుంది. మ‌రో వైపు వాణిజ్య ప్ర‌క‌ట‌న‌ల‌తోనూ బాగానే జుర్రుతోంది. ఇలా రెండు చేతులా సంపాద‌నే. న‌టిగా ర‌ష్మిక కూడా ఊహించ‌ని స్థానానికి చేరిపోయింది. ఇక బాలీవుడ్ లో స్టార్ లీగ్ లో చేర‌డ‌మే ఆల‌స్యం. అందుకు ఎంతో దూరంలో కూడా లేదు. స‌రైన రెండు బ్లాక్ బ‌స్ట‌ర్లు ప‌డితే అక్క‌డికి చేరిపోతుంది.

ఆ విష‌యం మాత్రం చెప్ప‌లేదుగా:

ప్ర‌స్తుతం అమ్మ‌డు ఆ ప‌నిలోనే బిజీగా ఉంది. అందుకోసం ఎంతో క‌ష్ట‌ప‌డుతుంది కూడా. ఆ క‌ష్టం నుంచే ఇలా తెల్ల‌వారు జామున లేచి ప్ర‌యాణాలు చేయ‌డం ఇబ్బందిగా ఉందంటోంది. ఉద‌యం 3:50 గంటలకు విమానంలో ప్ర‌యాణి స్తోన్న స‌మ‌యంలో విండో ద‌గ్గ‌ర నుంచి తీసిన ఓ ఫోటోని షేర్ చేసింది. ఈ జ‌ర్నీ ఎంతో దారుణంగా ఉదంటూ చెప్పుకొచ్చింది. ప‌గ‌లో...రాత్రో కూడా అర్దం కాలేదంటూ అస‌హ‌నంగా క‌నిపిం చింది. కానీ ఎక్క‌డ నుంచి ఎక్క‌డికి ప్ర‌యాణం చేస్తుంది? అన్న వివ‌రాలు మాత్రం రివీల్ చేయ‌లేదు.

6 గంట‌ల‌కు స్పాట్ లో ఉండాల్సిందే:

కేవ‌లం రెండు గంట‌లు మాత్ర‌మే నిద్ర‌పోయి రోజంతా ప‌ని చేయాలంటే క‌ష్టంగా ఉందంది. అలా చేయ‌డం చాలా నీర‌సంగానూ ఉందంటోంది. కంటికి స‌రైన నిద్రలేక‌పోతే అంతా నిర‌స‌మే అంటోంది. ప్ర‌తీ రోజు ఇలాంటి నిర్ణ‌యాలు తీసుకోవ‌డం అంటే క‌ఠినంగా ఉంటుంద‌ని అభిప్రాయ‌ప‌డింది. ఇంత‌గా ఇబ్బంది ప‌డి మ‌రీ జ‌ర్నీలు చేస్తుంటే? క‌చ్చితంగా ప‌నిలో భాగంగానేన‌ని నెటి జ‌నులు పోస్టులు పెడుతున్నారు. సినిమా షూటింగ్ లు ఉంటేనే యూనిట్ చెప్పిన టైమ్ కి స్పాట్ కి చేరుకోవాలి.

ఇబ్బంది అయినా త‌ప్ప‌దు:

ఉద‌య‌మే షూటింగ్ అంటే ఆరు స్పాట్ ఓ ఉండాలి. ఉద‌యాన్ని షూటింగ్ కి హాజ‌ర‌వ్వాలంటే స్థానికంగా ఉంటే ప‌ర్వాలేదు. రీచ్ అవ్వ‌డానికి గంట ముందు లేచినా స‌రిపోతుంది. కానీ దూరాబారం ప్ర‌యాణాలు చేయాల్సి వ‌స్తే మాత్రం ఇలాంటి ఇబ్బందులు త‌ప్ప‌వు. అందుకే చాలా మంది న‌టీమ‌ణులు కంటున్యూ షూటింగ్ ఉందంటే స్థానికంగానే నివాసం ఉంటారు. అలా లేని ప‌క్షంలో ఇలాంటి అర్ద‌రాత్రి...తెల్ల వారు జాము ప్ర‌యాణాలు త‌ప్ప‌వు.

Tags:    

Similar News