పట్టించుకోవడం లేదంటూ రష్మిక పై కంప్లైంట్
అసలు ఇప్పుడీ విషయం ఎందుకొచ్చిందంటే కృష్ణ ముకుంద మురారి సీరియల్ తో ఎంతో మంది అభిమానుల్ని సంపాదించుకున్న ప్రేరణ గతేడాది బిగ్‌బాస్ కి వెళ్లిన విషయం తెలిసిందే.;
ఎవరైనా సరే సినీ ఇండస్ట్రీలోకి వచ్చాక వారి లైఫ్ మొత్తం మారిపోతుంటుంది. ఇంతకు ముందులా ఫ్యామిలీకి ఎక్కువ టైమ్ కేటాయించలేరు, ఎప్పుడంటే అప్పుడు ఫ్రెండ్స్ ను కలవలేరు. ఆయా నటీనటుల షెడ్యూల్స్ వారిని అలా మార్చేస్తాయి. అయితే కొందరు అటు పర్సనల్ లైఫ్ ను, ఇటు ప్రొఫెషనల్ లైఫ్ ను బ్యాలెన్స్ చేస్తూ ముందుకెళ్తూ పాత స్నేహాలను కంటిన్యూ చేస్తూ ఉంటే మరికొందరు మాత్రం తీరిక లేక ప్రొఫెషనల్ లైఫ్ పైనే ఫోకస్ చేస్తుంటారు.
అసలు ఇప్పుడీ విషయం ఎందుకొచ్చిందంటే కృష్ణ ముకుంద మురారి సీరియల్ తో ఎంతో మంది అభిమానుల్ని సంపాదించుకున్న ప్రేరణ గతేడాది బిగ్‌బాస్ కి వెళ్లిన విషయం తెలిసిందే. కర్ణాటకకు చెందిన ప్రేరణకు రష్మిక మందన్నా చాలా క్లోజ్ ఫ్రెండ్ అనే విషయం అప్పుడే బయటికొచ్చింది. రీసెంట్ గా తమ ఫ్రెండ్‌షిప్ పై మాట్లాడుతూ ప్రేరణ ఎమోషనల్ అయ్యారు.
వీరిద్దరూ ఫ్రెండ్స్ మాత్రమే కాదు, రూమ్మేట్స్ కూడా. మోడలింగ్ చేస్తూ సినిమాల్లో ఛాన్సుల కోసం తిరిగేటప్పుడు ఇద్దరూ కలిసి ఒకే రూమ్ లో ఉన్నారట. అదృష్టం కలిసొచ్చి రష్మిక స్టార్ హీరోయిన్ గా దూసుకెళ్తుంటే ప్రేరణ మాత్రం సీరియల్స్ తో సరిపెట్టేసుకున్నారు. తాజాగా ప్రేరణ ఓ ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇవ్వగా దానికి సంబంధించిన ప్రోమో రిలీజైంది.
ఇంటర్వ్యూలో భాగంగా మీరూ, రష్మిక బెస్ట్ ఫ్రెండ్స్ అని విన్నాం నిజమేనా అని యాంకర్ అడగ్గా దానికి ప్రేరణ సమాధానమిచ్చారు. రష్మిక వాళ్ల ఫ్యామిలీ, మేమూ క్లోజ్ అని, వాళ్ల ఫ్యామిలీ వాళ్లు నేను తెలుగులో స్టార్ అయితే, రష్మిక కన్నడలో స్టార్ అవుతుందనేవాళ్లని, తర్వాత ఇద్దరూ కలిసి ఓ మల్టీస్టారర్ సినిమా చేయమని అంటుండే వాళ్లని ప్రేరణ చెప్పారు.
తర్వాత తాను, రష్మిక కూడా ఈ విషయంలో చాలా అనుకున్నామని, కానీ అవేవీ అవలేదని, ఒకప్పుడు తనకు గుర్తుండేది కానీ ఇప్పుడు గుర్తులేనని, ఫస్ట్ తనను కలవాలని చెప్పారు. ప్రేరణ చేసిన వ్యాఖ్యలతో ఆ ప్రోమో వైరల్ అవగా రష్మిక ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉందని, ఫ్యామిలీకి, ఫ్రెండ్స్ కు కూడా టైమ్ కేటాయించలేకపోతున్నానని బాధ పడుతూ రీసెంట్ గా ఇంటర్వ్యూలో చెప్పారని అందుకే రష్మిక, ప్రేరణను కలిసి ఉండరని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరి వీరిద్దరికీ కలవడానికి టైమ్ ఎప్పుడు కుదురుతుందో?