'ది గర్ల్‌ఫ్రెండ్' నధివే పాటతో రష్మిక మాయ

ఇప్పుడు ఆమె నటిస్తున్న ‘ది గర్ల్‌ఫ్రెండ్’ సినిమా నుంచి వచ్చిన నధివే పాట... మరోసారి రష్మిక కెరీర్‌లో ప్రత్యేకతను రిపీట్ చేసింది.;

Update: 2025-07-16 13:12 GMT

నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ హిట్లతో దూసుకెళ్తున్నారు. పుష్ప 2తో మాస్ సాలీడ్ రీచ్ పొందిన ఈ బ్యూటీ, ఛావా అనే బాలీవుడ్ ప్రాజెక్ట్‌తో హిందీ ఆడియెన్స్‌ని ఆకట్టుకుంటున్నారు. ఇక ఇటీవల కుబేర సినిమాలో ఆమె నటనకు మంచి స్పందన వచ్చింది. ఇలా వరుస సినిమాల ద్వారా హీరోయిన్‌గా తన లెవెల్‌ను పెంచుకుంటూ పోతున్నారు రష్మిక. ఇప్పుడు ఆమె నటిస్తున్న ‘ది గర్ల్‌ఫ్రెండ్’ సినిమా నుంచి వచ్చిన నధివే పాట... మరోసారి రష్మిక కెరీర్‌లో ప్రత్యేకతను రిపీట్ చేసింది.

ఇది ఒక లేడీ ఓరియెంటెడ్ సినిమా. గీతా ఆర్ట్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో రష్మికకు జోడీగా నటిస్తున్నది దీక్షిత్ శెట్టి. సినిమా టీజర్‌తోనే మంచి హైప్ వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు విడుదలైన తొలి సింగిల్ నధివే అందరినీ ఆకట్టుకుంటోంది.

ఈ పాటను కంపోజ్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్ హేషమ్ అబ్దుల్ వహాబ్ మళ్లీ తన మ్యాజిక్‌ను చూపించాడు. తను స్వయంగా ఆలపించిన ఈ పాటలోని సంగీతం, లిరిక్స్ బాగా హార్ట్ టచింగ్‌గా ఉన్నాయి. రకెందు మౌళి రాసిన పదాలు.. ప్రేమలోని లోతును, భావాలను అందంగా చెప్పగలిగాయి. ఆ మెలోడి ట్యూన్, హేషమ్ గాత్రం ఓ మంచి అనుభూతిని ఇస్తాయి.

పాటలో రష్మిక - దీక్షిత్ శెట్టిల మధ్య ఉన్న కెమిస్ట్రీ మాత్రం స్పెషల్ హైలైట్. ఇద్దరూ ఎంత సింపుల్ గా కనిపించినా.. వారి భావోద్వేగాలు మాత్రం ఆడియెన్స్‌ని తాకేలా ఉన్నాయి. ముఖ్యంగా క్లోస్ అప్ షాట్స్ లో రష్మిక ఎక్స్‌ప్రెషన్స్ ఫ్యాన్స్‌ని మెప్పిస్తున్నాయి. ఇది ప్రేమను సూచించే కంటెంట్ కు అదనపు బలాన్ని ఇస్తోంది. అందుకే పాట రొమాంటిక్ గా ఉండటంతో పాటు.. ఎమోషనల్‌గా కూడా చాలా బాగుంది.

ఈ పాటకు సంబంధించిన పోస్టర్ కూడా ఆకట్టుకునేలా ఉంది. అందులో ఇద్దరూ ఎదురెదురు నిలబడిన స్టిల్... ప్రేమలో ఎదురయ్యే భావోద్వేగాలను సూచిస్తూ చాలా బాగుంది. పోస్టర్ డిజైన్, లుక్ అండ్ ఫీల్ అన్ని క్లాస్ ఆడియెన్స్‌ని టార్గెట్ చేయడం స్పష్టంగా కనిపిస్తోంది. సినిమా ఫస్ట్ సింగిల్‌తో ఈ స్థాయి రెస్పాన్స్ రావడం చూస్తే, మిగతా ప్రమోషన్లపై మరింత ఆసక్తి పెరిగింది. మొత్తంగా చూస్తే, 'ది గర్ల్‌ఫ్రెండ్' మూవీపై నధివే పాట మళ్ళీ పాజిటివ్ బజ్ క్రియేట్ చేసింది. ఇక సినిమా విడుదల అనంతరం ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.

Full View
Tags:    

Similar News