రష్మికలా పేలడానికి శ్రీలీలకు ఛాన్స్ ఉందా?
శ్రీలీల గ్లామర్ అప్పిరియన్స్ తగ్గ డిజైన్ దుస్తుల్లో అలరించగల్గితే? రాత్రికి రాత్రే బాలీవుడ్ లో క్వీన్ అవ్వగలదు. అమ్మడు అంతటి ఘనాపాటి అనడంలో ఎలాంటి సందేహం లేదు.;
నేషనల్ క్రష్ రష్మికా మందన్నా బాలీవుడ్ లో ఎంత ఫేమస్ అయిందో చెప్పాల్సిన పనిలేదు. అనతి కాలంలో బాలీవుడ్ భామలకు పోటీగా నిలిచిందంటే? కారణం అమ్మడిలో యాక్టింగ్ స్కిల్స్ ఓ కారణమైతే గ్లామర్ అప్పిరియన్స్ ది మరో కారణం. ఆన్ ది స్క్రీన్ అయినా ఆఫ్ ది స్క్రీన్ అయినా రష్మిక మెరుపులు ఒకేలా ఉంటాయని ప్రూవ్ చేసింది. `పుష్ప`తో పాన్ ఇండియాలో గుర్తింపు రావడం అటుపై `ఛావా`లాంటి విజయం అమ్మడికి ప్రత్యేకమైన ఇమేజ్ ని తెచ్చి పెట్టింది. `గుడ్ బై`, `మిషన్ మజ్ను`, `సికిందర్` లాంటి చిత్రాలు ప్లాప్ అయినా ఆ ప్రభావం తనపై ఎంత మాత్రం చూపలేదు.
శ్రీలీల చలాకీతనం అడ్వాంటేజ్:
ఇమేజ్ పరంగా ఎలాంటి డ్యామేజ్ జరగలేదు. ఇటీవల రిలీజ్ అయిన `థామా`తోనూ మరో సక్సెస్ ఖాతాలో పడింది. ప్రస్తుతం రష్మిక బాలీవుడ్ లైనప్ వెరీ స్ట్రాంగ్ అని చెప్పాలి. `కాక్ టెయిల్ 2` సహా ప్రతిష్టాత్మక చిత్రాల్లో భాగమవుతుంది. అయితే రష్మికలా బ్లాస్ట్ అవ్వడానికి శ్రీలీలకు మంచి అవకాశం ఉంది. రష్మిక తరహాలో అమ్మడు చలాకీగా ఉంటుంది. వాక్చుతర్యంతో అందర్నీ ఆకట్టుకోగలదు. గ్లామర్ గేట్లు ఇంకా పూర్తి స్థాయిలో ఓపెన్ చేయలేదు గానీ... ఆ రకంగానూ షురూ చేస్తే సోషల్ మీడియాలో సంచలనంగా మారుతుంది.
రిలీజ్ కు ముందే కొత్త కమిట్ మెంట్లు:
శ్రీలీల గ్లామర్ అప్పిరియన్స్ తగ్గ డిజైన్ దుస్తుల్లో అలరించగల్గితే? రాత్రికి రాత్రే బాలీవుడ్ లో క్వీన్ అవ్వగలదు. అమ్మడు అంతటి ఘనాపాటి అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటికే సంచలన హిట్ ప్రాంచైజీ `ఆషీకీ`తో బాలీవుడ్ లో లాంచ్ అవుతోన్న సంగతి తెలిసిందే. అనురాగ్ బసు తెరకెక్కిస్తోన్న చిత్రంలో అమ్మడు రొమాంటిక్ గాళ్ ప్రెండ్ పాత్రలో అలరించనుంది. అనురాగ్ బాలీవుడ్ భామల్ని సైతం పక్కన బెట్టి శ్రీలీలను ఎంపిక చేసారంటే? దాని వెనుక ఇదే బలమైన కారణం. ఈ సినిమా రిలీజ్ కు ముందే మరో రెండు హిందీ ప్రాజెక్ట్ ల్లో అమ్మడి పేరు వినిపిస్తోంది.
రష్మీకకు పోటీ ఇవ్వగలదా?
ఈ ఛాన్సులు కూడా షురూ అయితే? తిరుగుండదు. ఇవన్నీ ఆలోచించే రీసెంట్ గా గ్లామర్ ఎలివేషన్ పరంగా కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. పాత్ర కోసమే కాదు..గ్లామర్ విషయంలో ట్రెండ్ని ఫాలో అవ్వాలని...అలా చేయకపోతే రేసులో ఉన్నట్లు కాదని అభిప్రాయపడింది. అంతర్లీనంగా శ్రీలీలలో దాగిన సిసలైన ప్రతిభను బయట పెట్టే కోణంలోనే ఇలా మాట్లాడిందా? అన్న సందేహం నెటి జనుల్లో వ్యక్తమవుతోంది. నిజంగా శ్రీలీల అనుకున్నది పక్కాగా ఎగ్జిక్యూట్ చేయగల్గితే రష్మికకు రీప్లేస్ నాయిక అవ్వగలదు.