వివాహమనంతరం రష్మిక కొత్త లుక్.. అది గమనించారా?

ఇదంతా బాగానే ఉన్నా.. పెళ్లి తర్వాత మొదట్లో రష్మిక విలేజ్‌కు వెళ్లినప్పుడు కొందరు అభిమానులు ఆమె నుదుట సిందూరం లేదని గమనించారు.;

Update: 2026-03-13 15:31 GMT

టాలీవుడ్ సెన్సేషనల్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల వివాహం తర్వాత నెట్టింట వారి సందడే కనిపిస్తోంది. ముఖ్యంగా పెళ్లి తర్వాత రష్మిక తన లుక్ విషయంలో చూపిస్తున్న మార్పులు అభిమానులను ఫిదా చేస్తున్నాయి. నుదుట సిందూరం, మెడలో మంగళసూత్రం ధరించి అచ్చమైన తెలుగింటి కోడలిలా కనిపిస్తున్న రష్మికను చూసి ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. ఫ్యాన్స్ కోరికను గౌరవిస్తూ, మన సంప్రదాయాలకు ప్రాముఖ్యత ఇస్తూ ఆమె కనిపిస్తున్న తీరు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

అచ్చమైన పల్లెటూరి కోడలిలా:

ఉదయ్‌పూర్ లో అట్టహాసంగా పెళ్లి చేసుకున్న తర్వాత, ఈ జంట తెలంగాణలోని విజయ్ సొంత ఊరైన తుమ్మనపేటను సందర్శించింది. అక్కడ కొత్తగా నిర్మించిన తమ ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం, గృహప్రవేశం వంటి సంప్రదాయ కార్యక్రమాలను నిర్వహించిన సంగతి తెలిసిందే, ఈ సందర్భంగా రష్మిక బేజ్ కలర్ ప్రింటెడ్ చీర, ఎరుపు రంగు బోర్డర్‌తో ఎంతో అందంగా మెరిసిపోయింది. ముఖ్యంగా ఆమె మెడలో తాళి (మంగళసూత్రం), నుదుట సిందూరంతో విజయ్ చేతిని పట్టుకుని నడుస్తున్న ఫోటోలు చూస్తుంటే దేవలోకం నుండి దిగివచ్చిన దేవతలా ఉందని గ్రామస్తులు, అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

సిందూరంతో మెరిసిపోతున్న రష్మిక:

ఇదంతా బాగానే ఉన్నా.. పెళ్లి తర్వాత మొదట్లో రష్మిక విలేజ్‌కు వెళ్లినప్పుడు కొందరు అభిమానులు ఆమె నుదుట సిందూరం లేదని గమనించారు. హిందూ సంప్రదాయంలో దానికి ఉన్న ప్రాముఖ్యతను గుర్తు చేస్తూ సోషల్ మీడియాలో చర్చించుకున్నారు. ఇక తన అభిమానుల మనోభావాలను అర్థం చేసుకున్న రష్మిక, ఆ తర్వాత ఎక్కడికి వెళ్లినా సిందూరం ధరించే కనిపిస్తోంది. రీసెంట్‌గా జరిగిన ఫ్యాన్స్ మీట్, వెడ్డింగ్ రిసెప్షన్, అలాగే హైదరాబాద్‌లోని తిరుమల తిరుపతి దేవస్థానం ఆలయ సందర్శన సమయంలోనూ ఆమె పక్కా ట్రెడిషనల్ లుక్‌లో కనిపించి అందరికీ ఆదర్శంగా నిలిచింది. ఇక తన అభిమానులు డిస్సపాయింట్ అవ్వకూడదని ఆమె తీసుకున్న ఈ నిర్ణయంపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

వైరల్ అవుతున్న వీడియోలు:

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా విజయ్-రష్మికల వీడియోలే కనిపిస్తున్నాయి. మినిమల్ మేకప్, లాంగ్ కర్లీ హెయిర్, మెడలో బంగారు గొలుసులు.. వీటన్నింటికీ మించి ఆమె ముఖంలోని వెలుగు చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. గుడిలో భక్తులకు స్వయంగా స్వీట్లు పంచుతూ తన సంతోషాన్ని అందరితో పంచుకున్న తీరు ఆమె వ్యక్తిత్వాన్ని చాటిచెబుతోంది. ఒక స్టార్ హీరోయిన్ హోదాలో ఉన్నా, పెళ్లి తర్వాత మన కట్టుబాటులను పాటిస్తూ సామాన్య గృహిణిలా కనిపిస్తున్న రష్మికను చూసి "అచ్చం దేవతలా ఉంది" అని ఫ్యాన్స్ సోషల్ మీడియాను కామెంట్లతో నింపేస్తున్నారు. విజయ్-రష్మికల జోడీ ఎప్పుడూ స్పెషలే.ఇక పెళ్లి తర్వాత రష్మిక తన లుక్‌తో చూపిస్తున్న ఈ సంప్రదాయ మార్పులు వారి బంధాన్ని మరింత అందంగా మారుస్తున్నాయి.

Tags:    

Similar News