రష్మిక ఖాతాలో మరో క్రేజీ ప్రాజెక్ట్..?

నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఫాం గురించి ఎంత చెప్పినా తక్కువే. సౌత్ లో ఆమెకు తిరుగులేదు.. బాలీవుడ్ లో కూడా వరుస ప్రాజెక్ట్ లతో దూసుకెళ్తుంది.;

Update: 2025-09-16 07:52 GMT

నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఫాం గురించి ఎంత చెప్పినా తక్కువే. సౌత్ లో ఆమెకు తిరుగులేదు.. బాలీవుడ్ లో కూడా వరుస ప్రాజెక్ట్ లతో దూసుకెళ్తుంది. హిందీలో ఒకటి అర ఫ్లాపులు పడుతున్నా దాన్ని లెక్క చేయకుండా ఆఫర్లు ఇస్తున్నారు. లేటెస్ట్ గా షాహిద్ కపూర్ తో ఒక సినిమా ఫైనల్ అయినట్టు తెలుస్తుంది. కాక్ టైల్ 2 లో రష్మిక ఛాన్స్ అందుకుందని తెలుస్తుంది. ఆల్రెడీ ఆయుష్మాన్ ఖురానా సినిమాలో అమ్మడు నటిస్తున్న విషయం తెలిసిందే.

కాంచన 4లో రష్మిక మందన్న..

ఇక రష్మిక మందన్న ఖాతాలో మరో క్రేజీ ప్రాజెక్ట్ చేరినట్టు టాక్. కోలీవుడ్ సూపర్ హిట్ ఫ్రాంచైజీ కాంచన నాలుగో మూవీగా కాంచన 4 వస్తుంది. ఈ సినిమాను లారెన్స్ డైరెక్ట్ చేస్తూ నటిస్తున్నారు. ఆల్రెడీ ఈ సినిమాలో బుట్ట బొమ్మ పూజా హెగ్దే నటిస్తుందని టాక్. ఆమెతో పాటు రష్మిక మందన్న కూడా ఉంటుందని అంటున్నారు. సినిమాలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ లో రష్మిక మందన్న ఉంటుందట. సో సినిమాలో రష్మిక ఘోస్ట్ గా కనిపిస్తుందని టాక్.

ఇప్పటికే రష్మిక మందన్న డిఫరెంట్ రోల్స్ తో ఆడియన్స్ ని మెప్పిస్తూ వస్తుంది. ఇప్పుడు అమ్మడు కాంచన 4 లో కొత్త రోల్ లో సర్ ప్రైజ్ చేయబోతుందట. ఐతే మేకర్స్ నుంచి అఫీషియల్ కన్ ఫర్మేషన్ లేకుండానే కాంచన 4 లో రష్మిక ఉంటుందని సోషల్ మీడియాలో హంగామా మొదలైంది.

విజయ్ దేవరకొండతో హిట్ సెంటిమెంట్..

రష్మిక మందన్న నిజంగానే కాంచన 4 లో ఉందా లేదా అన్నది త్వరలో తెలుస్తుంది. ఏది ఏమైనా మిగతా హీరోయిన్స్ ఏమో ఛాన్స్ లు లేక ఖాళీగా ఉంటే రష్మిక మాత్రం ఒక దానికి మించి మరొకటి అనిపించేలా అవకాశాలతో అదరగొట్టేస్తుంది. రష్మిక సినిమాలో ఉంది అంటే సినిమా సక్సెస్ అన్నట్టేలా క్రేజ్ తెచ్చుకుంది. అందుకే ఆమె వెంట దర్శక నిర్మాతలు పడుతున్నారు. ఇక తెలుగులో రష్మిక మందన్న ది గర్ల్ ఫ్రెండ్ సినిమా పూర్తి చేసింది. నెక్స్ట్ విజయ్ దేవరకొండ రాహుల్ సంకృత్యన్ కాంబో మూవీలో అమ్మడు నటిస్తుంది. ఈ సినిమా పీరియాడికల్ స్టోరీతో వస్తుంది. తప్పకుండా విజయ్, రష్మిక కాంబోకి ఉన్న హిట్ సెంటిమెంట్ ని ఇది రిపీట్ చేస్తుందని అంటున్నారు.

విజయ్, రష్మిక కూడా ఈ సినిమా కోసం తమ ఫుల్ ఎఫర్ట్ పెట్టేస్తున్నారట. ఇద్దరి మధ్య ఆల్రెడీ మంచి కెమిస్ట్రీ ఉంటుంది కాబట్టి సినిమా నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందని చెప్పుకుంటున్నారు. సో ఇటు సౌత్ లో స్టార్ ఛాన్స్ లతో పాటు బాలీవుడ్ లో మంచి ఫాం కొనసాగిస్తూ రష్మిక ఫుల్ స్వింగ్ లో ఉంది.

Tags:    

Similar News