వీడియో : రష్మిక ఎప్పుడూ జిమ్‌లోనే ఉంటావా?
వచ్చే నెలలో మరో సినిమాతో రష్మిక మందన్న రాబోతున్న విషయం తెల్సిందే. రష్మిక సినిమాల జోరు చూస్తూ ఉంటే ఆమె ఫ్యాన్స్ సైతం షాక్ అవుతున్నారు.;
నేషనల్ క్రష్ రష్మిక మందన కెరీర్ పరంగా చాలా బిజీగా ఉంది. పుష్ప 2 సినిమా భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకోవడంతో పాటు, యానిమల్, ఛావా సినిమాలతో బాలీవుడ్‌లో రష్మిక మందన్న మరింత బిజీ అయింది. ఈ ఏడాదిలో రష్మిక సక్సెస్ రేటు బాగుంది, అంతే కాకుండా ఆమె సినిమాలు మంచి విజయాన్ని సొంతం చేసుకుంటున్నాయి. సల్మాన్ ఖాన్‌తో వచ్చిన సికిందర్ మినహా మిగిలిన అన్ని సినిమాలు మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. ఛావా సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా ఈ ఏడాది టాప్ సినిమాల జాబితాలో నిలిచిన విషయం తెల్సిందే. ఇక కుబేర సినిమా సైతం భారీ వసూళ్లు సాధించడం ద్వారా మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. వచ్చే నెలలో మరో సినిమాతో రష్మిక మందన్న రాబోతున్న విషయం తెల్సిందే. రష్మిక సినిమాల జోరు చూస్తూ ఉంటే ఆమె ఫ్యాన్స్ సైతం షాక్ అవుతున్నారు.
జిమ్‌లో కఠిన వర్కౌట్స్ చేస్తున్న రష్మిక మందన్న
సాధారణంగా టాప్ స్టార్ హీరోయిన్స్ ఏడాదిలో రెండు మూడు సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడం గొప్ప విషయం. కానీ రష్మిక ఈ ఏడాదిలో ఇప్పటికే మూడు సినిమాలతో వచ్చింది. మరో సినిమాను వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతుంది. థామా టైటిల్‌తో రూపొందిన ఆ సినిమాలో రష్మిక మందన్న పాత్ర చాలా విభిన్నంగా ఉంటుందని అంటున్నారు. బాలీవుడ్‌లో మరింతగా ఆధరణ పెరగడానికి ఆ సినిమా పని చేస్తుందని అంటున్నారు. మొత్తానికి రష్మిక సినిమాలతో ఇంత బిజీగా ఉన్నప్పటికీ ఎప్పుడూ ఆమె తన ఫిజిక్ విషయంలో అశ్రద్ధ కనబర్చరు అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సోషల్ మీడియాలో ఆమె వర్కౌట్ వీడియోలు, ఫోటోలు చూసి చాలా మంది అవాక్కయ్యారు. ఈసారి హీరోయిన్ కృతి సనన్ వంతు వచ్చింది. ఆమె తాజాగా షేర్ చేసిన వీడియో వైరల్ అవుతోంది.
సోషల్ మీడియాలో కృతి సనన్
కృతి సనన్ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసిన వీడియో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఆ వీడియోలో రష్మిక జిమ్‌లో వర్కౌట్‌లు చేస్తుంది. రష్మిక నువ్వు ఎప్పుడు చూసినా జిమ్‌లోనే ఉంటున్నావు. నువ్వు జిమ్‌లోనే జీవిస్తున్నావా అంటూ ప్రశ్నించింది. అప్పుడు రష్మిక నవ్వుతూ నువ్వు వచ్చే సమయంలో నేను ఉంటున్నాను, నేను ఎక్కువగా ఏమీ చేయడం లేదు అంటూ నవ్వేసింది. నువ్వు చాలా కష్టపడుతున్నావు అంటూ మరోసారి కృతి సనన్ వీడియోలో అనడం చూడవచ్చు. రష్మిక తన ఫిజిక్ కోసం, అందం కోసం రోజులో గంటల తరబడి వర్కౌట్‌లు చేస్తూ ఉంది. అందుకు ఆమె చాలా ఎఫర్ట్ పెడుతుంది అని కృతి సనన్ వీడియో చూస్తే అర్థం అవుతుంది. ఈ మధ్య కాలంలో హీరోయిన్స్ తమను తాను ఎక్కువ కాలం ఇండస్ట్రీలో ఉంచుకోవడం కోసం గంటల తరబడి జిమ్‌లో ఉంచాల్సి వస్తున్న విషయం తెల్సిందే. అయితే రష్మిక అంతకు మించి జిమ్‌లో కష్టపడుతోంది.
ది గర్ల్ ఫ్రెండ్ సినిమా విడుదల కోసం
సన్నగా నాజూకుగా ఉండే రష్మికకు ఎందుకు జిమ్, వర్కౌట్స్ అంటూ చాలా మంది కామెంట్స్ చేస్తూ ఉంటారు. కేవలం ఫిజికల్ ఫిట్ నెస్ కోసం మాత్రమే కాకుండా తాను చేయబోతున్న యాక్షన్ సినిమాల కోసం, యాక్షన్ సన్నివేశాల కోసం కూడా రష్మిక కష్టపడుతుందని ఆమె సన్నిహితులు చెబుతున్నారు. రష్మిక ముందు ముందు లేడీ బాండ్ సినిమాలు, స్పై థ్రిల్లర్స్ చేయాలని కోరుకుంటున్న అభిమానులు చాలా మంది ఉన్నారు. వారి కోసం అయిన రష్మిక అలాంటి సినిమాలు చేస్తుందేమో చూడాలి. తెలుగులో ప్రస్తుతానికి సినిమాలు ఏమీ లేవు. కానీ అల్లు అర్జున్, అట్లీ కాంబోలో రూపొందుతున్న సినిమాలో ఈమె నటించబోతుందనే వార్తలు వస్తున్నాయి. మరో వైపు ఈమె నటించిన ది గర్ల్ ఫ్రెండ్ సినిమా విడుదలకు రెడీ అవుతోంది. అభిమానులు ఈ ఏడాదిలోనే ఆ సినిమా విడుదల చేయాలని కోరుకుంటున్నారు. మరి ది గర్ల్ ఫ్రెండ్ ఈ ఏడాదిలో వచ్చేనా చూడాలి.