రష్మికకు 15 కోట్ల పారితోషికం వెనుక నిజమెంత?

ఇటీవలి కాలంలో భారతీయ చలనచిత్ర పరిశ్రమలో అగ్ర కథానాయికల పారితోషికాలపై పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది.

Update: 2026-05-31 18:30 GMT

ఇటీవలి కాలంలో భారతీయ చలనచిత్ర పరిశ్రమలో అగ్ర కథానాయికల పారితోషికాలపై పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. బాలీవుడ్ టాప్ హీరోయిన్ దీపికా పదుకొణె ఒక్కో సినిమాకు 20 కోట్లు డిమాండ్ చేస్తుండగా, ఆలియా భట్ 15 కోట్ల రేంజ్‌లో రెమ్యునరేషన్ అందుకుంటున్నట్లు కథనాలు వచ్చాయి. ఇక సౌత్ ఇండియా విషయానికి వస్తే లేడీ సూపర్ స్టార్ నయనతార లాంటి సీనియర్ నటీమణులు 10-12 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్నారనే గుసగుసలు ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈ సీనియ‌ర్ల‌ సరసన `నేషనల్ క్రష్` రష్మిక మందన్న సైతం చేరిపోయిందని ఈ ప్ర‌తిభావ‌ని ఒక్కో బాలీవుడ్ చిత్రానికి ఏకంగా 15 కోట్ల రేంజ్‌లో పారితోషికం అందుకుంటోందని మీడియాలో కథనాలొస్తున్నాయి.

బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ సరసన నటిస్తున్న తాజా హిందీ చిత్రం `కాక్‌టైల్ 2` కోసం ర‌ష్మిక‌కు 15 కోట్ల పారితోషికం ఇచ్చార‌ని క‌థ‌నాలొస్తున్నాయి. ఈ త్రయంలో అత్యంత అనుభవజ్ఞుడైన కథానాయకుడు షాహిద్ కపూర్ ఈ సినిమాకు 35 కోట్ల రెమ్యునరేషన్ అందుకుంటుండగా.. ఇందులో దియా అనే పాత్రను పోషిస్తున్న రష్మిక మందన్నతో పాటు `అల్లీ` పాత్రలో నటిస్తున్న మరో స్టార్ హీరోయిన్ కృతి సనన్‌కు కూడా చెరో 15 కోట్ల చొప్పున పారితోషికం అందించినట్లు క‌థ‌నాలొస్తున్నాయి. ఒక అగ్ర హీరో అందుకుంటున్న మొత్తంలో దాదాపు సగానికి పైగా మొత్తాన్ని హీరోయిన్లకు ఆఫర్ చేయడం నిజంగా గొప్ప విష‌య‌మేన‌న్న చ‌ర్చా సాగుతోంది.

అయితే ఒక తెలుగు హీరోయిన్ ఇంత పెద్ద మొత్తం అందుకోవడం నిజమేనా? అంటూ ప్రస్తుతం తెలుగు ఫిలిం సర్కిల్స్‌లో రకరకాల ఆరాలు మొదలయ్యాయి. టాలీవుడ్‌లో విజయ్ దేవరకొండ లాంటి స్టార్ హీరోలే ఒక్కో చిత్రానికి 20 కోట్ల నుండి 30 కోట్ల మధ్యలో పారితోషికం అందుకుంటున్నట్లు కథనాలు ఉన్నాయి. అలాంటిది... ఇప్పుడు విజయ్ దేవరకొండ వంటి టాప్ హీరో అందుకునే మొత్తంలో దాదాపు సగం మొత్తాన్ని రష్మికకు ఒక్క బాలీవుడ్ ప్రాజెక్ట్ కోసమే ఆఫర్ చేస్తుండడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.

సాధారణంగా రష్మిక మందన్నకు టాలీవుడ్‌లో ఇప్పటివరకు గరిష్టంగా 3-4 కోట్ల రేంజ్‌లోనే పారితోషికాలు ఇచ్చినట్లు పరిశ్రమ వర్గాల టాక్. తెలుగు సినిమాలతో పోలిస్తే బాలీవుడ్ ఈ బ్యూటీకి ఏకంగా 15 కోట్లు ఇవ్వడం హాట్ టాపిక్‌గా మారింది. టాలీవుడ్‌లో స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్నా.. రీజనల్ మార్కెట్ పరిమితుల వల్ల పారితోషికం తక్కువగా ఉండొచ్చు. బాలీవుడ్‌లో `నేషనల్ క్రష్`గా సంపాదించుకున్న విపరీతమైన క్రేజ్ వల్లే ర‌ష్మిక‌కు ఈ రేంజ్‌లో భారీ ఆఫర్లు క్యూ కడుతున్నాయని భావించవచ్చు.

`యానిమల్` వంటి గ్లోబల్ బ్లాక్‌బస్టర్ తర్వాత రష్మిక బ్రాండ్ వాల్యూ దేశవ్యాప్తంగా విపరీతంగా పెరిగింది. అందుకే బాలీవుడ్ మేకర్స్ త‌న‌ పాన్-ఇండియా ఇమేజ్‌ను క్యాష్ చేసుకోవడానికి హీరోలతో సమానంగా భారీ పారితోషికాలను ఆఫర్ చేయడానికి వెనకాడడం లేదు. ఉత్తరాదిన రష్మిక సృష్టిస్తున్న ఈ రెమ్యునరేషన్ సంచలనాలపై ఇటు ద‌క్షిణాదినా పెద్ద చ‌ర్చ సాగుతోంది. ఈ వార్త‌లు టాలీవుడ్‌లోనూ సౌత్ హీరోయిన్ల పారితోషికాల సమీకరణాలను పూర్తిగా మార్చేసినా ఆశ్చ‌ర్య‌పోన‌వ‌స‌రం లేద‌నే చ‌ర్చ‌కు తావిస్తోంది.

Tags:    

Similar News