ఫస్ట్ లవ్.. రష్మిక పర్ఫెక్ట్ రియాక్షన్
బాలీవుడ్ మూవీ కాక్‌టైల్ 2 ప్రమోషన్స్ లో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా తన ఫస్ట్ లవ్ గురించి చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.
బాలీవుడ్ మూవీ కాక్‌టైల్ 2 ప్రమోషన్స్ లో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా తన ఫస్ట్ లవ్ గురించి చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. ఇంటర్వ్యూలో మొదటి ప్రేమ గురించి అడిగిన ప్రశ్నకు ఆమె చాలా తెలివిగా, హుందాగా సమాధానం ఇచ్చారు. గతం గురించి మళ్లీ మళ్లీ ఆలోచించడం తనకు ఇష్టం లేదని, ప్రస్తుత తన వైవాహిక జీవితంలో చాలా సంతోషంగా ఉన్నానని అసలు విషయాన్ని డైరెక్ట్ గా చెప్పేసింది. రష్మిక ఇచ్చిన ఈ మెచ్యూర్డ్ ఆన్సర్ కు అక్కడున్న ఆడియన్స్ తో పాటు అభిమానులు కూడా ఫిదా అవుతున్నారు.
విజయ్ దేవరకొండ, రష్మికకు ఇటీవల పెళ్లి అయిన విషయం తెలిసిందే. ఇక ఈ జోడీకి యూత్ లో ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 2018లో గీత గోవిందం సెట్స్ లో మొదలైన వీరి పరిచయం ఆ తర్వాత ప్రేమగా మారి, ఈ ఏడాది ఆరంభంలోనే పెళ్లి పీటలెక్కింది. రెండు కుటుంబాల సభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్య వీరు వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. పెళ్లి తర్వాత దేశవ్యాప్తంగా పలు ప్రత్యేక పూజలు, దానధర్మాలు చేస్తూ తమ ఆనందాన్ని అభిమానులతో పంచుకుని అందరి దృష్టిని ఆకర్షించారు.
ఇక సినిమా ప్రమోషన్ లో భాగంగా ఎదురైనా సెన్సిటివ్ విషయాన్ని ఆమె హ్యాండిల్ చేసిన తీరుకు పాజిటివ్ కామెంట్స్ అందుతున్నాయి. అదే ఈవెంట్ లో తోటి హీరోయిన్ కృతి సనన్.. అసలు నీకు ఫస్ట్ లవ్ గుర్తుందా అని సరదాగా అడిగే ప్రయత్నం చేసింది. దీనికి కూడా రష్మిక అంతే స్మార్ట్ గా, కూల్ గా రిప్లై ఇచ్చారు. పాత జ్ఞాపకాల గురించి ఆలోచించడం కంటే, ఇప్పుడు తాను ఉన్న పొజిషన్ తో పాటు ప్రెజెంట్ లైఫ్ ని ఆస్వాదించడం చాలా ముఖ్యమని నవ్వుతూనే బదులిచ్చింది.
ఒక సెన్సిటివ్ టాపిక్ ఎదురైనప్పుడు ఎక్కడా కాంట్రవర్సీకి తావు లేకుండా ఎంత బ్యాలెన్స్డ్ గా మాట్లాడాలో రష్మిక ఇక్కడ స్పష్టంగా చూపించింది. రష్మిక కామెంట్స్ తర్వాత తోటి నటీనటులు కూడా ప్రేమ గురించి తమ వ్యక్తిగత అభిప్రాయాలను పంచుకున్నారు. జీవితంలో ఒక దశలో నిజమైన ప్రేమ అనుకున్నది, తర్వాత కాలంలో వేరే కోణంలో అనిపించొచ్చని కృతి సనన్ తన ఆలోచనను బయటపెట్టింది.
ఇక షాహిద్ కపూర్ అయితే మరో అడుగు ముందుకేసి.. మొదటి ప్రేమ కంటే చివరి ప్రేమే జీవితంలో చాలా ముఖ్యమని అన్నాడు. జీవితాంతం ఒకరినొకరు అర్థం చేసుకుని అన్ని పరిస్థితుల్లో అండగా నిలబడటమే అసలైన ప్రేమ అని తనదైన స్టైల్ లో వివరించాడు. ప్రస్తుతం రష్మిక ఫోకస్ అంతా తన ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ పైనే పెట్టింది. హోమీ అదాజానియా డైరెక్షన్ లో తెరకెక్కిన కాక్‌టైల్ 2 జూన్ 19న థియేటర్లలోకి రాబోతోంది. స్నేహం, ప్రేమ, ఎమోషన్స్ చుట్టూ తిరిగే ఈ కథ ఆడియన్స్ కు ఒక కొత్త ఫీలింగ్ ఇస్తుందని మూవీ టీమ్ నమ్ముతోంది. ఈ సినిమాతో పాటు త్వరలో తన భర్త విజయ్ దేవరకొండతో కలిసి రణబలి అనే మరో భారీ ప్రాజెక్ట్ తో ప్రేక్షకుల ముందుకు రానుంది.