• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ముగింపు వేళ...

ముగింపు వేళ బ‌న్నీతో..కొత్త ఏడాది కౌశ‌ల్ తో!

| నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక మంద‌న్నా కెరీర్ బాలీవుడ్..టాలీవుడ్ లో దేదీప్యమానంగా సాగిపోతుంది.

By - Tupaki Desk
Update: 2024-11-10 11:30 GMT

నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక మంద‌న్నా  కెరీర్ బాలీవుడ్..టాలీవుడ్ లో దేదీప్యమానంగా సాగిపోతుంది. అమ్మ‌డు ఏ సినిమా చేసినా? అది పాన్ ఇండియా చిత్ర‌మే అవుతుంది. త్వ‌ర‌లో మ‌రో రెండు సినిమాల‌తో ప్రేక్ష‌కుల ముందుకు రాబో తుంది. అయితే ఈ సారి సంథింగ్ స్పెష‌ల్ గా అభిమానుల‌కు త‌న‌వైపు నుంచి ట్రీట్ ఇస్తుంది. ఏడాది ముగింపు వేళ‌..కొత్త ఏడాది ఆరంభంలోనూ ర‌ష్మిక కొత్త సినిమాల‌తో అల‌రిస్తుంది.

ఆ వివ‌రాల్లోకి వెళ్తే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స‌ర‌స‌న ర‌ష్మిక `పుష్ప‌-2`లో న‌టించిన సంగ‌తి తెలిసిందే. డిసెంబ‌ర్ 5న ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకొస్తుంది. భారీ అంచ‌నాల మ‌ధ్య రిలీజ్ అవుతున్న సినిమా ఇది. ఇందులో ర‌ష్మిక పాత్ర ఎంతో కీల‌క‌మైంది. రెండ‌వ భాగంలో ఆ పాత్ర ఎలా సాగుతుంది? అన్న దానిపై స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొంది. త‌న మార్క్ అప్పిరియ‌న్స్ తో ఎలాంటి స‌న్నివేశాల్లో క‌నిపిస్తుంది? అని అంతా ఎదురు చూస్తున్నారు.

సినిమాకి బ‌న్నీ ఓ ఎత్తైతే..ర‌ష్మిక మ‌రో ఎత్తులా నిలిచింది. తొలి భాగాన్ని ఇద్ద‌రు సినిమాని రెండు భుజాల‌పై తీసుకెళ్లారు. ఇక కొత్త ఏడాదిలో అమ్మ‌డు `ఛావా` సినిమాతో ప్రేక్ష‌కుల్ని అల‌రించనుంది. ఇందులో అమ్మ‌డు విక్కీ కౌశ‌ల్ కి జోడీగా న‌టించింది. ఇదొక హిస్టారిక‌ల్ ఎపిక్ చిత్రం. భారీ అంచ‌నాల మ‌ధ్య రిలీజ్ అవుతుంది. `పుష్ప‌-2`కి పోటీగా రిలీజ్ అవ్వాల్సిన చిత్ర‌మిది.

కానీ ఆ పోటీ నుంచి త‌ప్పుకుని జ‌న‌వ‌రికి వెళ్తున్న‌ట్లు తెలుస్తోంది. అంటే కొత్త ఏడాదిలో అమ్మ‌డు ఛావా సినిమాతో బాలీవుడ్ ప్రేక్ష‌కుల్ని ప‌ల‌క‌రించ‌నుంది. 2024 ముగింపు పుష్ప‌-2 అయితే...2025 ఆరంభం ఛావా చిత్రం అవుతున్నాయి. రెండు సినిమాలు భారీ అంచ‌నాల‌తో వ‌స్తున్నాయి. స‌క్సెస్ అవుతాయ‌నే అంచ‌నాలు ట్రేడ్ వ‌ర్గాల్లో బ‌లంగా ఉంది.

Tags:    
  • Rashmikamandanna 
  • Chhava 
  • Pushpa2 
  • Bollywood 
  • Tollywood 
  • Alluarjun 
  • Vickykaushal 
  • Rashmikamovies 
  • Filmindustry 

Similar News

చిరు మాట ఇచ్చారు సరే.. వెంకీకి మళ్ళీ మెగా ఛాన్స్ దక్కేనా?

2026-11-10 18:30 GMT

ISKCON వ్యవస్థాపక ఆచార్యులు శ్రీ‌ల ప్ర‌భుపాద్‌ బ‌యోపిక్..హోంబలే సంచలనం!

2026-11-10 17:30 GMT

తమిళ ఇంటర్వ్యూలో తెలుగు సినిమాకు ఎలివేషన్

2026-11-10 16:30 GMT

డైరెక్టర్ టు హీరో.. భాషతోపాటు క్యారెక్టర్ మార్చిన తరుణ్ భాస్కర్.. వర్కౌట్ అయ్యేనా?

2026-11-10 15:30 GMT

వైట్ క్రాప్ టాప్‌లో గ్లామర్ ట్రీట్ ఇచ్చిన దిశా పటానీ!

2026-11-10 14:30 GMT

మండే రోజు రామాయణం మంటలు

2026-11-10 14:11 GMT

వాళ్లు 1% మాత్రమే... సినిమాను ఏం చేయలేరు!

2026-11-10 13:30 GMT

ట్రెడిషనల్ లుక్ లో మెరిసిన నిహారిక!

2026-11-10 12:54 GMT

పాత బాకీల పంచాయితీ.. ఆ డైరెక్టర్ సినిమా రిలీజ్ కష్టమేనా?

2026-11-10 12:54 GMT

'ఇంకా ఏం అనుకోలేదు' మూవీ.. మెస్మరైజ్ చేస్తున్న ఫస్ట్ సింగిల్!

2026-11-10 12:51 GMT

రేణు దేశాయ్ షాకింగ్ పోస్ట్.. కర్మఫలం తప్పదంటూ..

2026-11-10 12:49 GMT

'ఇరుముడి' కావేరి పెళ్లి పీటలు ఎక్కనుందా?

2026-11-10 12:49 GMT

Copyright @2026

Powered by Blink CMS