నేషనల్ క్రష్ మొదటి టార్గెట్ అవుతుందే..?
నేషనల్ క్రష్ విషయంలో ప్రస్తుతం ఇలాంటి చర్చలే జరుగుతున్నాయి. కన్నడ నటి అయిన రష్మిక కిరిక్ పార్టీతో ఓవర్ నైట్ స్టార్ అవ్వగా ఛలోతో తెలుగు ఎంట్రీ ఇచ్చింది.;
కొన్నిసార్లు టైం బాగా లేకపోతే ఎలాంటి సంబంధం లేకపోయినా కొందరిని టార్గెట్ చేసినట్టు అవుతుంది. అంతా బాగుంటే ఏమి ఉండదు కానీ ఏదైనా తేడా వస్తేనే ఇలాంటివి జరుగుతుంటాయి. మొన్నటిదాకా సౌత్ నార్త్ అనే తేడా లేకుండా అదరగొడుతూ వచ్చి.. నేషనల్ క్రష్ గా ఆడియన్స్ చేత సూపర్ అనిపించుకున్న రష్మిక ఇప్పుడు తనకు ఏమాత్రం సంబంధం లేని విషయాలకు మొదటి టార్గెట్ అవుతుంది. కొన్నిసార్లు మాట్లాడితే తప్పు అవుతుందనుకున్న టైం లో మరికొన్నిసార్లు సైలెంట్ గా ఉన్నా కూడా మిస్టేక్ అవుతుంది.
కన్నడ నటి రష్మిక కిరిక్ పార్టీతో..
నేషనల్ క్రష్ విషయంలో ప్రస్తుతం ఇలాంటి చర్చలే జరుగుతున్నాయి. కన్నడ నటి అయిన రష్మిక కిరిక్ పార్టీతో ఓవర్ నైట్ స్టార్ అవ్వగా ఛలోతో తెలుగు ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా నుంచి ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ గా సూపర్ ఫామ్ కొనసాగిస్తుంది. ఐతే లేటెస్ట్ గా రిషబ్ శెట్టి కాంతారా చాప్టర్ 1 సెన్సేషనల్ హిట్ అయ్యింది. ఆ సినిమా మీద రష్మిక మందన్న స్పందించకపోవడంపై కన్నడ ఆడియన్స్ హర్ట్ అవుతున్నారు. ప్రతి కన్నడ సినిమాకు రష్మిక స్పందించాల్సిన అవసరం లేదు. కానీ కిరిక్ పార్టీ డైరెక్ట్ చేసింది రిషబ్ శెట్టి కాబట్టి అతని డైరెక్షన్ తో పాటు యాక్టింగ్ చేసి అదరగొట్టిన సినిమాపై రష్మిక రెస్పాండ్ అయితే బాగుంటుందని అంటున్నారు.
ఐతే దీనిపై మరో వెర్షన్ రష్మికకు సపోర్ట్ చేస్తున్న వారు ఉన్నారు. రష్మిక ఆ సినిమా చూసి ఉండకపోవచ్చు. ప్రస్తుతం ఆమె కూడా వరుస ప్రాజెక్ట్ లతో బిజీగా ఉంది. అందుకే ఒకవేళ చూసే ఛాన్స్ రాకపోవచ్చని అంటున్నారు. రష్మిక మీద ఈమధ్య కాలంలో వచ్చిన ఫస్ట్ నెగిటివిటీ ఇదే. ఐతే అంతకుముందు రిషబ్ శెట్టి కూడా రష్మిక పేరు చెప్పకుండా మాట్లాడినందుకే రష్మిక ఇప్పుడు కాంతారా 1పై స్పందించడం లేదని అంటున్నారు.
అనవసరమైన ఇష్యూస్ లో ఆమె..
ఈ వ్యవహారాలు అన్నీ కూడా రష్మిక ఇమేజ్ ని తగ్గించలేవు కానీ అనవసరమైన ఇష్యూస్ లో ఆమెను పెడుతున్నట్టు ఉంటుంది. ఇక లేటెస్ట్ గా రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ ఎంగేజ్మెంట్ జరిగింది. అఫీషియల్ గా ఇద్దరు చెప్పలేదు కానీ ఈ టైంలో రష్మికపై ఇలా కొన్ని పాజిటివ్, కొన్ని నెగిటివి వార్తలు రావడం కూడా ఆమెను కచ్చితంగా అప్సెట్ చేస్తాయని చెప్పొచ్చు. మొన్నటిదాకా ఆమెను ఆకాశాన్ని ఎత్తిన నెటిజెన్లు ఇప్పుడు కాంతారా 1 విషయంపై రష్మికను కార్నర్ చేయడం మాత్రం కరెక్ట్ కాదని కొందరు అంటున్నారు. మరి ఈ ఇష్యూస్ గురించి రష్మిక ఏదైనా రెస్పాండ్ అవుతుందా అన్నది చూడాలి.