మోక్ష‌జ్ఞ మిస్స‌యినా ఘ‌ట్ట‌మ‌నేని హీరోతో జాక్ పాట్

మేటి క‌థానాయిక ర‌వీనా టాండ‌న్ ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. నంద‌మూరి బాల‌కృష్ణ `బంగారు బుల్లోడు` చిత్రంలో గ్లామ‌ర‌స్ యాక్ట్ తో హృద‌యాల‌ను కొల్ల‌గొట్టింది ఈ బ్యూటీ.;

Update: 2025-08-23 02:30 GMT

మేటి క‌థానాయిక ర‌వీనా టాండ‌న్ ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. నంద‌మూరి బాల‌కృష్ణ `బంగారు బుల్లోడు` చిత్రంలో గ్లామ‌ర‌స్ యాక్ట్ తో హృద‌యాల‌ను కొల్ల‌గొట్టింది ఈ బ్యూటీ. 90ల నాటి యూత్ క‌ల‌ల రాణిగా వెలిగిపోయింది. అందానికి అందం, డ్యాన్సింగ్ ట్యాలెంట్ తో ఈ బ్యూటీ బాలీవుడ్ ని ఏలింది. అందుకే ర‌వీనా టాండ‌న్ కుమార్తె రాషా త‌డానీ టాలీవుడ్ ఎంట్రీ పై సర్వ‌త్రా ఉత్కంఠ నెల‌కొంది.

దేవ‌గ‌న్ మేన‌ల్లుడితో ఎంట్రీ..

రాషా ఇప్ప‌టికే `ఆజాద్` అనే చిత్రంతో బాలీవుడ్ లో క‌థానాయిక‌గా ప‌రిచ‌య‌మైంది. ఈ చిత్రంలో అజ‌య్ దేవ‌గ‌న్ మేన‌ల్లుడు అమ‌న్ దేవ‌గ‌న్ స‌ర‌స‌న నాయిక‌గా న‌టించింది. ఈ చిత్రంలో `ఉయ్ అమ్మా...` పాట‌తో ఒక ఊపు ఊపిన రాషా భ‌విష్య‌త్ పై చాలా అంచ‌నాలేర్ప‌డ్డాయి.

ఏమైందో ఏమో కానీ..!

కొద్దిరోజుల క్రితం న‌ట‌సింహా నంద‌మూరి బాల‌కృష్ణ వార‌సుడు మోక్ష‌జ్ఞ స‌ర‌స‌న రాషా త‌డానీ క‌థానాయిక‌గా ప‌రిచ‌య‌మ‌వుతుంద‌ని ప్ర‌చార‌మైంది. కానీ ఆ ప్రాజెక్ట్ అనూహ్యంగా ఆగిపోయింద‌ని క‌థ‌నాలొచ్చాయి. ఆ త‌ర్వాత ఘ‌ట్ట‌మ‌నేని కుటుంబ హీరో జ‌య‌కృష్ణ స‌ర‌స‌న రాషా త‌డానీ క‌థానాయిక‌గా ఎంపికైంద‌ని కూడా గుస‌గుస‌లు వినిపించాయి. తాజా స‌మాచారం మేర‌కు ఈ సినిమా త్వ‌ర‌లో చిత్రీక‌ర‌ణ‌కు వెళ్ల‌నుంద‌ని తెలుస్తోంది.

మ‌హేష్ కుటుంబ హీరో..

జ‌య‌కృష్ణ మ‌హేష్ అన్న‌గారైన‌ ఘ‌ట్ట‌మ‌నేని ర‌మేష్ బాబు కుమారుడు. అత‌డు న‌ట‌న‌, డ్యాన్సులు, ఫైట్స్ లో ప‌రిపూర్ణంగా శిక్ష‌ణ పొందాడు. ఆర్.ఎక్స్ 100 ఫేం అజయ్ భూపతి జయ కృష్ణను లాంచ్ చేస్తున్నారని, ప్రీ-ప్రొడక్షన్ కొన‌సాగుతోంద‌ని తెలిసింది. వైజయంతి మూవీస్- ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. కాస్టింగ్ స‌హా క్రూ గురించి ఇంకా వివ‌రాలు వెల్ల‌డి కావాల్సి ఉంది. టైటిల్ ని అధికారికంగా ప్ర‌క‌టించాల్సి ఉంది.

మోక్షజ్ఞ‌తో ఛాన్స్ ఉంది:

టాలీవుడ్ లో బడా ఫ్యామిలీస్ నుంచి వ‌స్తున్న న‌ట‌వార‌సుల స‌ర‌స‌న‌ రాషా అవ‌కాశాలు అందుకోవ‌డం ఆస‌క్తిని క‌లిగిస్తోంది. త‌దుప‌రి నంద‌మూరి మోక్ష‌జ్ఞ స‌ర‌స‌న కూడా రాషాకు అవ‌కాశం ఉంది. మోక్ష‌జ్ఞ ప్ర‌స్తుతం త‌న రూపాన్ని మార్చుకుని స్మార్ట్ గా క‌నిపిస్తున్నాడు. అత‌డు పూర్తిగా స్లిమ్ అయ్యాడు. ఈ ఏడాది చివ‌రి నాటికి హీరోగా త‌న డెబ్యూ చిత్రాన్ని ప్ర‌క‌టించే అవ‌కాశం ఉంది.

Tags:    

Similar News