రామ్ డైరెక్షన్ కు పెద్ద బలం.. రంగంలోకి స్టార్ టెక్నీషియన్

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని మొదటిసారి మెగాఫోన్ పట్టి తెరకెక్కిస్తున్న 'RAPO23' ప్రాజెక్ట్ లోకి ఒక స్టార్ టెక్నీషియన్ ఎంట్రీ ఇచ్చాడు.

Update: 2026-06-06 06:18 GMT

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని మొదటిసారి మెగాఫోన్ పట్టి తెరకెక్కిస్తున్న 'RAPO23' ప్రాజెక్ట్ లోకి ఒక స్టార్ టెక్నీషియన్ ఎంట్రీ ఇచ్చాడు. ఈ సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ కు నేషనల్ అవార్డ్ విన్నింగ్ సినిమాటోగ్రాఫర్ తిరు (తిరునావుక్కరసు) డీవోపీగా ఫిక్స్ అయ్యాడు. మేకర్స్ సోషల్ మీడియాలో అధికారికంగా ఒక పోస్ట్ రిలీజ్ చేసి ఈ క్రేజీ అప్డేట్ ను పంచుకున్నారు. హీరోగా నటిస్తూనే స్వయంగా కథ రాసి డైరెక్షన్ చేస్తుండటంతో రామ్ ఈ ప్రాజెక్ట్ ను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు అర్థమవుతోంది.

తిరు లాంటి ఒక సీనియర్ కెమెరామెన్ ఈ టీమ్ లో చేరడం ప్రాజెక్ట్ కు ఒక పెద్ద ప్లస్ పాయింట్. గతంలో భరత్ అనే నేను, క్రిష్ 3, 24 లాంటి డిఫరెంట్ సినిమాలో ఎన్నో అద్భుతమైన విజువల్స్ తో తనకంటూ ఒక స్పెషల్ మార్క్ క్రియేట్ చేసుకున్న తిరు.. ఇప్పుడు సరికొత్త యాక్షన్ ప్రపంచాన్ని స్క్రీన్ మీద ఆవిష్కరించబోతున్నాడు. లైటింగ్, మూడ్ ని పర్ఫెక్ట్ గా క్యారీ చేయడంలో అతనికి మంచి అనుభవం ఉంది. ఇక రామ్ రాసుకున్న ఈ స్ట్రాంగ్ సబ్జెక్ట్ కు అతని వర్క్ కరెక్ట్ గా సెట్ అవుతుందట.

ఈ సినిమాలో రామ్ 'వీర' అనే పవర్ ఫుల్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నాడు. "ది స్టోరీ ఆఫ్ ఎ లోన్ వుల్ఫ్" అనే క్యాప్షన్ తో వస్తున్న ఈ చిత్రం ఒక డిఫరెంట్ ఎమోషనల్ జర్నీగా సాగనుందని మేకర్స్ చెబుతున్నారు. రామ్ తన బర్త్ డే రోజున రిలీజ్ చేసిన ఫస్ట్ గ్లింప్స్ లోని ఇంటెన్స్ లుక్ ఇప్పటికే సోషల్ మీడియాలో జనాలను ఎట్రాక్ట్ చేసింది. ఇప్పుడు తిరు కూడా తోడవడంతో సినిమా మేకింగ్ వాల్యూస్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయని ఆడియన్స్ భావిస్తున్నారు.

నటుడిగా ఇన్నాళ్లూ తన మార్క్ చూపించిన రామ్, మొదటిసారి కెమెరా వెనుక ఉండి సినిమాను నడిపించడం ఒక సాహసమనే చెప్పాలి. కృష్ణ పోతినేని 'రాపో సినిమాటిక్స్' బ్యానర్ పై ఈ చిత్రాన్ని చాలా గ్రాండ్ స్కేల్ లో నిర్మిస్తున్నారు. క్రియేటివ్ గా ఎప్పటికప్పుడు కొత్త విషయాలు ట్రై చేసే రామ్, ఈ ప్రాజెక్ట్ విషయంలో మాత్రం ప్రతి చిన్న డీటెయిల్ మీద ప్రత్యేకంగా ఫోకస్ పెడుతున్నాడు. ఒకేసారి ఇన్ని బాధ్యతలు మోస్తూ ఒక ఇంటెన్స్ వరల్డ్ ను క్రియేట్ చేయడం అతనికి కచ్చితంగా పెద్ద ఛాలెంజ్.

ఒక పర్ఫెక్ట్ టెక్నికల్ టీమ్ ను సెట్ చేసుకునే పనిలో పడ్డ రామ్ ముందు ముందు మరిన్ని సర్ ప్రైజ్ లు ఇచ్చేలా ఉన్నాడు. ఇప్పటికే టెక్నికల్ గా ఒక బలమైన పునాది పడటంతో మిగతా క్యాస్ట్, క్రూ వివరాలు కూడా త్వరలోనే బయటకు రానున్నాయి. నటుడిగా తనను తాను ప్రూవ్ చేసుకున్న ఈ హీరో, ఇప్పుడు దర్శకుడిగా తనకంటూ ఎలాంటి గుర్తింపు తెచ్చుకుంటాడో చూడాలి. ఇక తిరు లాంటి మాస్టర్ మైండ్ తో కలిసి రామ్ ఎలాంటి మ్యాజిక్ చేస్తాడనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.



Tags:    

Similar News