• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  రామ్-మహేష్ మూవీ.....

రామ్-మహేష్ మూవీ.. పట్టాలెక్కేసింది..

| అయితే RAPO 22 ప్రాజెక్ట్ పూజా కార్యక్రమాలు హైదరాబాద్ లో గురువారం ఉదయం ఘనంగా జరిగాయి.

By - Tupaki Desk
Update: 2024-11-21 09:44 GMT

టాలీవుడ్ యంగ్ హీరో రామ్ పోతినేని ఇటీవల డబుల్ ఇస్మార్ట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఆ చిత్రం దారుణంగా నిరాశపరిచింది. దీంతో రామ్ తన నెక్స్ట్ మూవీతో ఎలా అయినా హిట్ కొట్టాలని చూస్తున్నారు. ఆయన తన తర్వాత చిత్రం కోసం ఎవరితో వర్క్ చేస్తారోనని కొద్ది రోజులుగా జోరుగా చర్చ సాగుతోంది.

 

ఈ నేపథ్యంలో రామ్ పోతినేని కొత్త సినిమా పట్టాలెక్కింది. సీనియర్ హీరోయిన్ అనుష్క, నవీన్ పోలిశెట్టి లీడ్ రోల్స్ లో నటించిన మిస్ శెట్టి మిస్ పొలిశెట్టి మూవీతో మంచి విజయం అందుకున్న పి. మహేష్ దర్శకత్వం వహిస్తున్నారు. మరాఠీ బ్యూటీ భాగ్యశ్రీ బొర్సే హీరోయిన్ గా నటిస్తున్నారు. టాలీవుడ్ బడా ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ గ్రాండ్ గా నిర్మిస్తోంది.

 

అయితే RAPO 22 ప్రాజెక్ట్ పూజా కార్యక్రమాలు హైదరాబాద్ లో గురువారం ఉదయం ఘనంగా జరిగాయి. వేడుకకు మూవీ యూనిట్ హాజరవ్వగా.. పలువురు టాలీవుడ్ ప్రముఖులు గెస్టులుగా విచ్చేశారు. దర్శకులు హను రాఘవపూడి, గోపీచంద్ మలినేని, శివ నిర్వాణ, వెంకీ కుడుముల సహా తదితరులు వేడుకలో పాల్గొని మూవీ టీమ్‌ కు ప్రత్యేక అభినందనలు తెలిపారు.

 

ముహూర్తపు షాట్‌ కు హను రాఘవపూడి క్లాప్‌ కొట్టారు. గోపీచంద్ మలినేని కెమెరా స్విచ్చాన్ చేశారు. రామ్, భాగ్యశ్రీ నటించిన మొదటి షాట్‌ కు వెంకీ కుడుముల దర్శకత్వం వహించారు. ఎంతో ఆహ్లాదంగా జరిగిన పూజా కార్యక్రమాలకు సంబంధించిన ఫోటోస్ ను మైత్రీ మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. తెగ వైరల్ అవుతున్నాయి

 

అయితే మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి మూవీతో డైరెక్టర్ మహేష్ మంచి వినోదంతో పాటు చక్కటి సందేశం ఇచ్చారు. భావోద్వేగాలను హృద్యంగా ఆవిష్కరించి మెప్పించారు. ఇప్పుడు రామ్ తో ఫీల్ ఫీల్ గుడ్ అండ్ క్రేజీ ఎంటర్టైనర్ చేస్తున్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఫ్రెష్ అండ్ ఇంట్రెస్టింగ్ కంటెంట్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తెలుస్తోంది.

RAPO22 ప్రాజెక్టును మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌ పై నిర్మిస్తున్న నవీన్ యెర్నేని, వై రవిశంకర్ త్వరలో అన్ని వివరాలు రివీల్ చేయనున్నారు. మెయిన్ క్యాస్టింగ్ తో పాటు వివిధ డిటైల్స్ ను మరికొద్ది రోజుల్లో ప్రకటించనున్నారని తెలుస్తోంది. అనేక మంది ప్రముఖులను రంగంలోకి దించుతున్నారట. మరి ఈ మూవీతో రామ్ తిరిగి సక్సెస్ ట్రాక్ లోకి వస్తారో లేదో చూడాలి.

Tags:    
  • Rapo22 
  • Rampothineni 
  • Bhagyashreeborse 
  • Mythrimoviemakers 
  • HanuRaghavapudi 
  • GopichandMalineni 
  • ShivaNirvana 
  • VenkyKudumula 
  • NaveenYerneni 
  • YRaviShankar 

Similar News

ఈర్ష్య కాదు ప్రశంస.. కై పో చే ఫ్రెండ్స్!

2026-11-06 08:30 GMT

'సీన్' మూవీ రివ్యూ

2026-11-06 07:54 GMT

గార్జియస్ లుక్ లో అందరినీ తన వైపు తిప్పుకున్న శ్రీలీల.. ఔట్ఫిట్ తోనే మాయ చేస్తూ!

2026-11-06 07:51 GMT

రాజకీయాల నుంచి వెండితెరకు అసాధారణ ప్రయాణం!

2026-11-06 07:30 GMT

'సమ్మర్ హాలిడేస్' రివ్యూ

2026-11-06 07:23 GMT

ఫ్లాపుల తర్వాత రామ్ మాస్టర్ ప్లాన్.. 2027లో రెండు సినిమాల రిలీజ్‌కు రెడీ!

2026-11-06 06:30 GMT

సూర్యకు మళ్లీ 30 కోట్ల టార్గెట్

2026-11-06 05:49 GMT

కాజల్‌కు ఈ పార్ట్ 2 కష్టాలేంటి!

2026-11-06 05:49 GMT

కన్నుగీటుతూ కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టిస్తున్న జాన్వీ కపూర్!

2026-11-06 05:45 GMT

భారీ బడ్జెట్ అంటే ఈ రెండు బ్యానర్లే గుర్తొస్తున్నాయా!

2026-11-06 05:06 GMT

రామాయణం కలెక్షన్స్.. ఓపెనింగ్స్ ఓకే కానీ!

2026-11-06 05:05 GMT

వారణాసి: ఇక స్ట్రాంగ్‌గా మొదలవ్వాలి!

2026-11-06 05:03 GMT

Copyright @2026

Powered by Blink CMS