హారర్ వరల్డ్ లోకి నయా స్టార్ ఎంట్రీ!
బాలీవుడ్ స్టార్ రణవీర్ సింగ్ ఇప్పటి వరకూ ఎన్నో పాత్రలు పోషించాడు. ఆయన ఏ పాత్ర పోషించినా ఆ పాత్రకే వన్నె తేగల నటుడు.;
బాలీవుడ్ స్టార్ రణవీర్ సింగ్ ఇప్పటి వరకూ ఎన్నో పాత్రలు పోషించాడు. ఆయన ఏ పాత్ర పోషించినా ఆ పాత్రకే వన్నె తేగల నటుడు. యాక్షన్ స్టాన్ గా కనిపించాడు. లవర్ బోయ్ గా అలరించాడు. పీరియాడిక్ చిత్రాలు పోషించాడు. ప్రతి నాయకుడు పాత్రలో మెప్పించాడు. హీరోగానే కాకుండా స్టార్ హీరోల చిత్రాల్లోనూ వైవిథ్యమైన పాత్రలెన్నో పోషించాడు. కానీ ఇంతవరకూ హారర్ జానర్లోకి మాత్రం ఎంటర్ అవ్వలేదు.
మరి ఇప్పుడు ఆ సమయం ఆసన్నమైందా? అంటే అవుననే తెలుస్తోంది. మడాక్ ఫిల్మ్స్ రణవీర్ సింగ్ భారీ హారర్ థ్రిల్లర్ చిత్రాన్ని ప్లాన్ చేస్తోంది. రణవీర్ తో మడాక్ హారర్ యూనివర్శ్ లో అవెంజర్స్ తరహా చిత్రాన్ని నిర్మించడానికి ఒప్పందం చేసుకుంది. ఇప్పటికే హీరో-నిర్మాణ సంస్థ మధ్య డీల్ కుదిరింది. ఇందులో హీరోయిన్ గా మనుషీ చిల్లర్ ఎంపికైంది. ఇంతవరకూ రణవీర్ సింగ్ హారర్ జానర్లో సినిమాలు చేయలేదు.
దీంతో రణవీర్ కి ఈసినిమా ఓ కొత్త ఎక్స్ పీరియన్స్ ను అందించనుంది. మరి ఈ హారర్ చిత్రానికి బేస్ కథ ఏంటి? అన్నది తెలియాలి. అలాగే ఈ చిత్రానికి దర్శకుడు ఎవరు? అన్నది కూడా ఇంకా ఫైనల్ కాలేదు. మడాక్ వద్ద సిద్దంగా ఉన్న స్టోరీతోనే ఈ ఒప్పందం చేసుకుంది. ఈ కథను డీల్ చేసే దర్శకుడు కోసం మాడాక్ సెర్చ్ చేస్తోంది. ఈ నేపత్యంలో సౌత్ డైరెక్టర్ల ను కూడా మడాక్ సంస్థ పరిశీలి స్తుందిట.
బాలీవుడ్ హారర్ కింగ్ అమర్ కౌశిక్ పేరు తెరైకి వచ్చింది. ఆయనతోనూ మడాక్ చర్చలు జరుపుతోందిట. ఇదే సంస్థలో అమర్ కౌశిక్ ఇప్పటికే కొన్ని హారర్ థ్రిల్లర్ చిత్రాలను రూపొందించిన సంగతి తెలిసిందే. అవి మంచి విజయం సాధించాయి. ఈనేపథ్యంలో అమర్ కౌశింక్ ఎంపిక అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.