ఆ చిత్రంలో అజిత్ దోవ‌ల్ నేప‌థ్య‌మా?

ఈ చిత్రాన్ని 1970-80 ల‌లో పాకిస్తాన్ లో జరిగిన నిజ జీవిత సంఘ‌ట‌న‌లు ఆధారంగా రూపొందిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం గురించి మ‌రో ఇంట్రెస్టింగ్ విష‌యం లీకైంది.;

Update: 2025-06-21 08:30 GMT

బాలీవుడ్ స్టార్ ర‌ణ‌వీర్ సింగ్ క‌థానాయ‌కుడిగా ఆదిత్య ధ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో స్పై థ్రిల్ల‌ర్ గా `దురంధ‌ర్` చిత్రం తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. ఇదోక స్పెష‌ల్ స్పై థ్రిల్ల‌ర్ గా హైలైట్ అవుతుంది. ఇప్ప‌టికే 70 శాతం చిత్రీక‌ర‌ణ పూర్త‌యింది. ఈ చిత్రాన్ని 1970-80 ల‌లో పాకిస్తాన్ లో జరిగిన నిజ జీవిత సంఘ‌ట‌న‌లు ఆధారంగా రూపొందిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం గురించి మ‌రో ఇంట్రెస్టింగ్ విష‌యం లీకైంది.

ఇందులో జాతీయ భ‌ద్ర‌తా స‌ల‌హాదారు అజిత్ దోవ‌ల్ జీవిత సంఘ‌ట‌న‌ల నేప‌థ్యం కూడా ఉంటుంద‌ని బాలీవుడ్ మీడియాలో ప్ర‌చారం మొద‌లైంది. దేశ భ‌ద్ర‌త కోసం దోవ‌ల్ ఎలాంటి సాహ‌సాలు చేసారు? పాకి స్తాన్ లో ఆయ‌న గుఢ‌చార్యం ఎలా ఉండేది? ఆయ‌న వ్య‌క్తిగ‌త జీవితంతో పాటు మరికొన్ని ఆస‌క్తిక‌ర అంశా లతో ముడిప‌డిన క‌థ‌గా వినిపిస్తుంది. ముఖ్యంగా పాకిస్తాన్ లో ఆయ‌న గుఢచ‌ర్యాన్ని ఆద్యంతం ఆవిష్క రించ‌నున్నారు.

ఇంటిలిజెన్స్ బ్యూరోలో ప‌నిచేస్తున్న మొద‌టి రోజు నుంచి దోవ‌ల్ కు పాక్ చ‌ర్య‌ల‌పై 100 శాతం ఖ‌చితత్వం ఉండేది. పూర్తిగా ఉగ్ర‌వాదాన్ని న‌మ్ముకున్న సైనిక దేశం రానున్న రోజుల్లో ఎలా కుప్పకూల‌నుందో గ‌తంలోనే అనేక సార్లు వివ‌రించారు. పాకిస్తాన్ లో దాదాపు ఏడేళ్ల పాటు అండ‌ర్ క‌వ‌ర్ ఏజెంట్ గా ప‌ని చేసారు. ఎన్నో కీల‌క‌మైన సైనిక ర‌హ‌స్యాలు భార‌త్ కు అందించారు. మ‌రి ఈ ప్ర‌చారంలో నిజ‌మెంతో తెలియాలి.

ఈ చిత్రంలో సంజ‌య్ ద‌త్, అక్ష‌య్ ఖ‌న్నా, అర్జున్ రాంపాల్, ఆర్ మాధ‌వ‌న్ ఇత‌ర కీల‌క పాత్ర‌లు పోషి స్తున్నారు. ఈ సినిమా షూటింగ్ సెప్టెంబ‌ర్ క‌ల్లా పూర్తి చేయాల‌ని ప్లాన్ చేస్తున్నారు. రిలీజ్ కు సంబంధించి అతి త్వ‌ర‌లోనే ప్ర‌క‌ట‌న కూడా రానుందని స‌మాచారం. జులై 6న ర‌ణ‌వీర్ సింగ్ పుట్టిన రోజు సంద‌ర్భంగా అభిమానుల కోసం స్పెష‌ల్ ట్రీట్ ఏర్పాటు చేస్తున్న‌ట్లు వినిపిస్తుంది. ఆ రోజున ఓ స్పెష‌ల్ టీజ‌ర్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారుట‌.

Tags:    

Similar News